చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరిస్తే సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి. వాస్తు ప్రకారం ఫాలో అవ్వడం వలన మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు.
వాస్తు ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిహారాలని పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు ప్రకారం ఇలా చేయడం వలన సంపద పెరుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
తులసి మొక్కని లక్ష్మీదేవిగా భావిస్తారు. వాస్తు ప్రకారం తులసి మొక్క ఈశాన్యం వైపు ఉండాలి. లేదంటే తూర్పు వైపు ఉండొచ్చు. రోజూ తులసి మొక్కకి నీటిని సమర్పించాలి. సాయంత్రం పూట దీపారాధన చేయాలి. ఇలా చేయడం వలన ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి వ్యాపిస్తుంది.
పూజ గది ఈశాన్యం వైపు ఉండేటట్టు చూసుకోవాలి. ఇది శక్తివంతమైనది. ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తుంది. మనసుని ప్రశాంతంగా మారుస్తుంది. ఎప్పుడూ కూడా పూజ గదిని శుభ్రంగా ఉంచాలి. పూజ చేసేటప్పుడు తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు కూర్చుని పూజ చేయాలి.
శుభ్రత చాలా ముఖ్యం. చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి. ఈశాన్యం వైపు చెత్త అస్సలు ఉండకూడదు. ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ఇంట్లో పాత సామాన్లు, విరిగిపోయినవి ఉండకూడదు.
వాస్తు ప్రకారం ఇంట్లో శంఖం, గంటలు ఉండడం కూడా మంచిది. ఇవి సానుకూల శక్తిని తీసుకొస్తాయి. ప్రతికూల శక్తిని తొలగిస్తాయి. వీటి వల్ల వచ్చే శబ్దం గాలిని స్వచ్ఛంగా మారుస్తుంది.
వాస్తు ప్రకారం సరైన దిశలో నిద్రపోవడం మంచిది. ఎప్పుడు కూడా నిద్ర పోయేటప్పుడు తలను దక్షిణం లేదా తూర్పు వైపు ఉంచుకోవాలి. అలా నిద్రపోయినట్లయితే నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటి ఇబ్బందులు ఉండవు.
శ్రీ యంత్రాన్ని కూడా ఇంట్లో ఉంచడం మంచిది. దీనిని ఇంట్లో పెట్టేటప్పుడు ఈశాన్యం వైపు లేదా బ్రహ్మస్థానంలో ఉంచితే ఇంకా మంచిది. ఇది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తీసుకు రావడంతో పాటుగా వాస్తు దోషాలని కూడా తొలగిస్తుంది.
వాస్తు ప్రకారం ఆకుపచ్చ ప్రకృతికి సంబంధించిన ఫోటోలని పెట్టడం మంచిది. అలాగే జలపాతాలు, ఏడు గుర్రాలు వంటి ఫోటోలని పెట్టడం వలన సానుకూల శక్తి వ్యాపించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. సంతోషంగా ఉండొచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.