ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ ఫుల్లు ఖుషీ .. నిత్యం కాసుల వర్షమే, జీవితాంతం ఉల్లాసమే..-based on numerology people born on these days will be happy always and live with wealth never feel low makes other smile ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ ఫుల్లు ఖుషీ .. నిత్యం కాసుల వర్షమే, జీవితాంతం ఉల్లాసమే..

ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ ఫుల్లు ఖుషీ .. నిత్యం కాసుల వర్షమే, జీవితాంతం ఉల్లాసమే..

Peddinti Sravya HT Telugu
Published Feb 07, 2025 11:30 AM IST

రాడిక్స్ నెంబర్ ద్వారా భవిష్యత్తు గురించి తెలుసుకోవడంతో పాటుగా, మనిషి వ్యక్తిత్వం గురించి కూడా తెలుసుకోవచ్చు. న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు సంఖ్యల వివరణ కనుగొనబడుతుంది. ఈరోజు రాడిక్స్ నెంబర్ 6 గురించి చూద్దాం. ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ ఫుల్లు ఖుషీ.

ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ ఫుల్లు ఖుషీ
ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ ఫుల్లు ఖుషీ (pinterest)

జ్యోతిష్యం మాదిరి న్యూమరాలజీని కూడా చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. న్యూమరాలజీ ప్రకారం, మనం చాలా విషయాలను తెలుసుకోవచ్చు. రాడిక్స్ నెంబర్ ద్వారా భవిష్యత్తు గురించి తెలుసుకోవడంతో పాటుగా, మనిషి వ్యక్తిత్వం గురించి కూడా తెలుసుకోవచ్చు.

న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు సంఖ్యల వివరణ కనుగొనబడుతుంది. ఈ సంఖ్యలన్నీ ఏదో ఒక గ్రహాన్ని సూచిస్తూ ఉంటాయి. ఈరోజు రాడిక్స్ నెంబర్ 6 గురించి చూద్దాం. ఏదైనా నెలలో 6,15, 24వ తేదీల్లో పుట్టిన వారి రాడిక్స్ నెంబర్ 6 అవుతుంది.

రాడిక్స్ సంఖ్య 6 వారి జీవితం ఎలా ఉంటుంది? కెరీర్ ఎలా ఉంటుంది?

  1. శుక్రుడు ఈ సంఖ్యకు అధిపతి. విలాసవంతమైన జీవితాన్ని ఇచ్చే గ్రహం. పైన చెప్పిన తేదీల్లో పుట్టిన వారు శుక్రుని ఆశీర్వాదం పొందుతారు. చాలా డబ్బు సంపాదిస్తారు.
  2. న్యూమరాలజీ ప్రకారం ఆరు సంఖ్య ఉన్న వ్యక్తులు సృజనాత్మక ఆలోచనాపరులు. అలాంటివారు ఫ్యాషన్, డిజైనింగ్, ఇండస్ట్రీ, డ్రామా లేదంటే మోడలింగ్లో కెరీర్ ని మొదలు పెడితే కచ్చితంగా విజయాన్ని అందుకుంటారు.
  3. వ్యాపారం చేయాలనుకుంటే ఫ్యాషన్, నగల దుకాణం, బట్టల దుకాణం లేదంటే లగ్జరీ వస్తువులు షోరూమ్ తెరవడం వలన మంచి లాభం ఉంటుంది.
  4. శుక్రుని ప్రభావంతో ఈ సంఖ్యకు చెందిన వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.
  5. నలువైపుల నుంచి వీరికి ధన వర్షం కురుస్తుంది. వీళ్ళు కుంగిపోవడానికి ఇష్టపడరు.వాళ్ళను వారు ఫిట్ గా ఉంచుకోవడానికి శ్రద్ధ చూపిస్తూ ఉంటారు.
  6. హాస్య స్వభావాన్ని కలిగి ఉండే వీరు ఎక్కడికి వెళ్ళినా అందర్నీ ఉల్లాసంగా ఉంచుతారు. సమాజంలో ఎంతో గౌరవం లభిస్తుంది.
  7. ప్రయాణంలో కూడా వీళ్ళు ముందుంటారు.
  8. న్యూమరాలజీ ప్రకారం ఈ సంఖ్యకు చెందినవారు జీవితాంతం డబ్బుతో ఉంటారు. అనేక ఆదాయ వనరులు ఉన్నాయి. శాశ్వత ఆదాయాన్ని వీరికి ఇస్తుంది.
  9. ఖరీదైన బట్టలు వేసుకుని ఎప్పటికప్పుడు కార్లు మారుస్తూ ఉంటారు. ఈ వ్యక్తులు జీవితాంతం ధనవంతులుగా ఉంటారు. వారి అభిరుచులకు వదులుకోరు. జీవితంలో ప్రతిక్షణాన్ని ఆనందిస్తారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner