Ayyappa Ashtottara Namavali: అయ్యప్ప మాలధారులు పఠించాల్సిన అయ్యప్ప అష్టోత్తర నామావళి ఇదే-ayyappa ashtottara namavali lyrics in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ayyappa Ashtottara Namavali: అయ్యప్ప మాలధారులు పఠించాల్సిన అయ్యప్ప అష్టోత్తర నామావళి ఇదే

Ayyappa Ashtottara Namavali: అయ్యప్ప మాలధారులు పఠించాల్సిన అయ్యప్ప అష్టోత్తర నామావళి ఇదే

Ramya Sri Marka HT Telugu
Nov 20, 2024 06:06 AM IST

Ayyappa Ashtottara Namavali: శబరిమల అయ్యప్ప స్వామిని ప్రసన్నం చేసుకునేందుకు కార్తీక మాసంలో భక్తులు మాలధారణ చేపడతారు. మండలం పాటు కఠినమైన నియమ నిష్టలు పాటిస్తూ స్వామిని భక్తితో కొలుస్తారు. అయ్యప్ప స్వామి పూజల్లో, భజనల్లో, శబరిమల ప్రయాణంలో పఠించే అయ్యప్ప స్వామి అష్టోత్తర నామావళి తెలుసుకుందాం.

అయ్యప్ప స్వామి అష్టోత్తర నామావళి
అయ్యప్ప స్వామి అష్టోత్తర నామావళి

శబరిమలలో నెలవై ఉన్న అయ్యప్ప స్వామిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు కఠిన దీక్ష చేపడతారు. కార్తీక మాసం మొదలుకొని మాస సంక్రాంతి వరకూ నలబై ఒక్క రోజుల పాటు నియమ నిష్టలతో స్వామిని కొలుస్తారు. మొదటి రోజు నుంచి చివరి వరకూ భక్తిశ్రద్ధలతో స్వామిని ఆరాధించి భక్తితో ఒక ముడి, శ్రద్ధతో మరో ముడి వేసి ఇరుముడితో శబరిమల చేరుకుంటారు. ఈ 108 పేర్లను పఠించిన వారు అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు, శాంతి, రక్షణ పొందుతారు. ప్రతి పేరులో అయ్యప్ప స్వామి దైవిక గుణాలు, లక్షణాలు, ఆయన రక్షణాత్మక స్వభావాన్ని తెలియజేస్తాయి. ఈ పేర్లను 41 రోజుల దీక్షా సమయంలో లేదా శబరిమల ఆలయ యాత్రకు వెళ్ళేటప్పుడు, అలాగే అయ్యప్ప స్వామికు అంకితం చేసిన ఇతర పూజా కార్యక్రమాల సమయంలో సాధారణంగా పఠిస్తారు. ఆ నామావళి మీరు కూడా తెలుసుకోండి. స్వామి వారి అనుగ్రహం పొందండి.

అయ్యప్ప గాయత్రీ మంత్రం

"ఓం భూత నాథాయ విధ్మహే

భవా నందనాయ ధీమహే

తన్నో శాస్తాప్రచోదయాత్"

అయ్యప్ప అష్టోత్తర నామావళి

1. ఓం మహాసశ్రే నమః

2. ఓం మహాదేవాయ నమః

3. ఓం మహాదేవ సుతాయ నమః

4. ఓం అవ్యయాయ నమః

5. ఓం లోకకర్తే నమః

6. ఓం లోకభర్తే నమః

7. ఓం లోకహర్తే నమః

8. ఓం పరాత్పరాయ నమః

9. ఓం త్రిలోక రక్షకాయ నమః

10. ఓం ధన్వినే నమః

11. ఓం తపస్వినే నమః

12. ఓం భూతసాయికాయ నమః

13. ఓం మంత్రవేదినే నమః

14. ఓం మారుతాయ నమః

15. ఓం జగదీశ్వరాయ నమః

16. ఓం లోకాధ్యక్షాయ నమః

17. ఓం అగ్రగణ్యాయ నమః

18. ఓం శ్రీమతే నమః

19. ఓం అప్రమేయ పరాక్రమాయ నమః

20. ఓం సింహరోహితాయ నమః

21. ఓం గజరోహితాయ నమః

22. ఓం హయరోహితాయ నమః

23. ఓం మహేశ్వరాయ నమః

24. ఓం నానాశస్త్రధరాయ నమః

25. ఓం అనర్ఘరాయ నమః

26. ఓం నానావిద్యావిశారదాయ నమః

27. ఓం నానారూపధరాయ నమః

28. ఓం వీరాయ నమః

29. ఓం నానప్రాణిసేవకాయ నమః

30. ఓం భూతసేయ నమః

31. ఓం భూతిదాయ నమః

32. ఓం బ్రుత్యాయ నమః

33. ఓం భుజంగభరణోజ్వలాయ నమః

34. ఓం ఇక్షుధన్వినే నమః

35. ఓం పుష్భనాయ నమః

36. ఓం మహారూపాయ నమః

37. ఓం మహాప్రభువే నమః

38. ఓం మహాదేవిసుతాయ నమః

39. ఓం మాన్యాయ నమః

40. ఓం మహానీతయ నమః

41. ఓం మహాగుణాయ నమః

42. ఓం మహాసైవయ నమః

43. ఓం మహారుద్రాయ నమః

44. ఓం విష్ణవాయ నమః

45. ఓం విష్ణుపూజకాయ నమః

46. ఓం విఘ్నేశ్వరాయ నమః

47. ఓం వీరభద్రాయ నమః

48. ఓం భైరవాయ నమః

49. ఓం శన్ముఖద్రువాయ నమః

50. ఓం మీరుసృంగ సమసీనాయ నమః

51. ఓం మునిసంఘ సేవితాయ నమః

52. ఓం దేవాయ నమః

53. ఓం భద్రాయ నమః

54. ఓం జగన్నాధాయ నమః

55. ఓం గణనాధాయ నమః

56. ఓం గణేశ్వరాయ నమః

57. ఓం మహాయోగినే నమః

58. ఓం మహామాయే నమః

59. ఓం మహాస్తిరాయ నమః

60. ఓం దేవాస్త్రే నమః

61. ఓం భూతాస్త్రే నమః

62. ఓం భీమాశయ పరాక్రమాయ నమః

63. ఓం నాగహారాయ నమః

64. ఓం నాగకేశాయ నమః

65. ఓం వ్యోమకేశాయ నమః

66. ఓం సనాతయనాయ నమః

67. ఓం సూగుణాయ నమః

68. ఓం నిర్గుణాయ నమః

69. ఓం నిత్యాయ నమః

70. ఓం నిత్యత్రుప్తాయ నమః

71. ఓం నిరాస్రయాయ నమః

72. ఓం లోకశ్రయాయ నమః

73. ఓం గణాధేశాయ నమః

74. ఓం చతురస్త్రి కాళమాయాయ నమః

75. ఓం రుగ్యజుశ్సమధర్ణవనాయ నమః

76. ఓం రూపనై నమః

77. ఓం మల్లికాసుర బంజకాయ నమః

78. ఓం త్రిమూర్తయే నమః

79. ఓం దైత్యమధనాయ నమః

80. ఓం ప్రకృతాతయే నమః

81. ఓం పురుషోత్తమాయ నమః

82. ఓం కాలజ్ఞినే నమః

83. ఓం కామదాయ నమః

84. ఓం కామలేశనాయ నమః

85. ఓం కల్పవృక్ష్య నమః

86. ఓం మహావృక్ష్య నమః

87. ఓం విద్యావృక్ష్య నమః

88. ఓం విభూతిదాయ నమః

89. ఓం సామ్సారతాప విచ్చేత్రయే నమః

90. ఓం పశులోక భయంకరాయ నమః

91. ఓం రోహహంత్రే నమః

92. ఓం ప్రాణదాత్రే నమః

93. ఓం పరగవ విభుజనాయ నమః

94. ఓం సర్వశాస్త్రధాత్వగ్యానాయ నమః

95. ఓం నీతిమతే నమః

96. ఓం పాపాభంజనాయ నమః

97. ఓం పుషలౌర్ణసమ్యూక్తాయ నమః

98. ఓం పరమాత్మనే నమః

99. ఓం సతంగయే నమః

100. ఓం అనంతాదిత్యసంకాశాయ నమః

101. ఓం సుబ్రహ్మణ్యానుజాయ నమః

102. ఓం భలినే నమః

103. ఓం భక్తానుకంపినే నమః

104. ఓం దేవసాయ నమః

105. ఓం భగవతే నమః

106. ఓం భక్తవస్తలయ నమః

107. ఓం పూర్ణాపుష్కల సమేత హరిహరపుత్ర అయ్యప్పస్వామినే నమః

108. ఓం శ్రీ అయ్యప్పాయ నమః

అయ్యప్ప అష్టోత్తర నామావళి సమాప్తం

Whats_app_banner