వాస్తు ప్రకారం భార్యాభర్తల ఫోటోని ఏ దిశలో పెట్టాలి? ఇలా చేస్తే ప్రేమ జీవితంలో సంతోషాలే!-auspicious direction to keep wife and husband photo according to vastu shastra ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వాస్తు ప్రకారం భార్యాభర్తల ఫోటోని ఏ దిశలో పెట్టాలి? ఇలా చేస్తే ప్రేమ జీవితంలో సంతోషాలే!

వాస్తు ప్రకారం భార్యాభర్తల ఫోటోని ఏ దిశలో పెట్టాలి? ఇలా చేస్తే ప్రేమ జీవితంలో సంతోషాలే!

Peddinti Sravya HT Telugu

వాస్తు ప్రకారం భార్యాభర్తల ఫోటోలని సరైన దిశలో ఉంచితే వారి బంధం బలంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో మధురం ఉంటుంది. భార్యాభర్తల ఫోటోలను ఏ దిశలో ఉంచితే మంచిదో వాస్తు శాస్త్రం ప్రకారం చూద్దాం. వాస్తు ప్రకారం భార్యాభర్తల చిత్రాన్ని ఏ దిశలో పెట్టాలి? ఎలాంటి తప్పులు చేయకూడదు వంటి వివరాలను ఇప్పుడే తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం భార్యాభర్తల చిత్రాన్ని ఏ దిశలో పెట్టాలి? (pinterest)

వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇంట్లో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. వాస్తు ప్రకారం అనుసరిస్తే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. సంతోషంగా ఉండొచ్చు.

వాస్తు ప్రకారం భార్యాభర్తలకి ఫోటోలకి సంబంధించిన విషయంలో వాస్తు నియమాలను పాటిస్తే మంచిది. ఇది వారి మధ్య ప్రేమానురాగాలని బలంగా మారుస్తుంది. సంతోషమైన జీవితాన్ని అందిస్తుంది. వాస్తు ప్రకారం పాటిస్తే సంతోషం, ధనంతో జీవించొచ్చు.

వాస్తు ప్రకారం భార్యాభర్తల ఫోటోలని సరైన దిశలో ఉంచితే వారి బంధం బలంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో మధురం ఉంటుంది. భార్యాభర్తల ఫోటోలను ఏ దిశలో ఉంచితే మంచిదో వాస్తు శాస్త్రం ప్రకారం చూద్దాం.

వాస్తు ప్రకారం భార్యాభర్తల చిత్రాన్ని ఏ దిశలో పెట్టాలి?

  1. నైరుతి వైపు భార్యా భర్తల చిత్రాన్ని ఉంచడం ఉత్తమమైనది. ఈ దిశలో వారి ఫోటోని పెట్టడం వలన వైవాహిక జీవితంలో స్థిరత్వం, ప్రేమ, సామరస్యం ఉంటాయి.
  2. ఉత్తర దిశలో కూడా భార్యాభర్తల ఫోటోను పెట్టవచ్చు. ఇది కూడా శుభప్రదంగా భావిస్తారు. ఉత్తర దిశలో భార్యాభర్తల ఫోటో పెట్టడం వలన సమన్వయం, అవగాహన పెరుగుతుంది. సంబంధంలో మధురం ఉంటుంది.
  3. భార్యాభర్తల ఫోటోను పడకగదిలో పెడితే మంచిది. ముఖ్యంగా మంచం వెనక ఉంచాలి. దీని వలన ప్రేమ, గౌరవం పెరుగుతాయి.
  4. డ్రాయింగ్ రూమ్‌లో భార్యాభర్తల ఫోటోను ఉంచితే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఇబ్బందులు తగ్గుతాయి.

ఈ తప్పులు చేయకండి:

  • భార్యాభర్తల ఫోటోలను పెట్టేటప్పుడు సరైన దిశలో మాత్రమే పెట్టాలి. పడకగదిలో ఎదురుగా ఉండే గోడకు భార్యాభర్తల ఫోటోలు పెడితే మానసిక ఒత్తిడి ఎక్కువవుతుంది.
  • పూజ గది వద్ద లేదా టాయిలెట్ గోడలకు ఆనుకుని ఉన్నచోట పెట్టకూడదు. అలా చేసినట్లయితే ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
  • వంటగదిలో కానీ, వంటగది సమీపంలో ఉన్న గోడకు కానీ భార్యాభర్తల ఫోటోని పెట్టకూడదు. దీని వలన భార్యాభర్తల మధ్య బంధంలో ఇబ్బందులు వస్తాయి.
  • భార్యాభర్తల ఫోటోలు పెట్టేటప్పుడు బాధాకరమైనవి పెట్టకూడదు. ఇద్దరు కలిసి సంతోషంగా నవ్వుతున్న ఫోటోలని పెట్టవచ్చు.
  • రంగులు పోయినవి, విరిగిపోయిన ఫ్రేమ్స్ ఉన్న ఫోటోలని గోడలకు తగిలించడం వలన ప్రతికూల శక్తి ఎదుర్కోవాల్సి ఉంటుంది. రిలేషన్షిప్‌లో కూడా ఇబ్బందులు వస్తాయి.
  • చనిపోయిన పూర్వికుల ఫోటోలతో పాటు భార్యాభర్తల ఫోటోలను ఇంట్లో పెట్టడం మంచిది కాదు. దాని వలన వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.