Bangles Rules: ఆడవాళ్ళు కొత్త గాజులను ఎప్పుడు కొనుక్కోవాలి?, ఏ రంగు గాజులు వేసుకోకూడదు? తప్పక తెలుసుకోవాల్సిన నియమాలు!-auspicious days to buy bangles and check which color bangles are not good see bangles rules ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Bangles Rules: ఆడవాళ్ళు కొత్త గాజులను ఎప్పుడు కొనుక్కోవాలి?, ఏ రంగు గాజులు వేసుకోకూడదు? తప్పక తెలుసుకోవాల్సిన నియమాలు!

Bangles Rules: ఆడవాళ్ళు కొత్త గాజులను ఎప్పుడు కొనుక్కోవాలి?, ఏ రంగు గాజులు వేసుకోకూడదు? తప్పక తెలుసుకోవాల్సిన నియమాలు!

Peddinti Sravya HT Telugu

Bangles Rules: స్త్రీలు వేసుకునే గాజులకు సంబంధించి చాలా మందికి తెలియని విషయాలు ఇవి. వివాహిత స్త్రీలు ఏ రంగు గాజులు వేసుకోకూడదు?, ఎప్పుడు ఏ రోజు గాజులు వేసుకుంటే శుభప్రదంగా పరిగణించబడుతుంది అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.

ఆడవాళ్ళు కొత్త గాజులను ఎప్పుడు కొనుక్కోవాలి? (pinterest)

హిందూమతంలో 16 అలంకారణలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇందులో గాజులు కూడా ఒకటి. గాజులు స్త్రీల అందాన్ని పెంచుతాయి. అదృష్టాన్ని తీసుకువస్తాయి. స్త్రీలు గాజులు వేసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది.

మానసిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు. మత విశ్వాసాల ప్రకారం చూసినట్లయితే ఒక స్త్రీ గాజులని ధరించడం వలన ఆమె భర్త ఆరోగ్యంగా ఉంటారు. వివాహిత స్త్రీలు ఏ రంగు గాజులు వేసుకోకూడదు?, ఎప్పుడు ఏ రోజు గాజులు వేసుకుంటే శుభప్రదంగా పరిగణించబడుతుంది అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.

గాజులు ఎప్పుడు వేసుకోవాలి?

  1. ఎప్పుడైనా సరే ఎవరైనా కొత్త గాజులను వేసుకునేటప్పుడు, వాటిని గౌరీ దేవి ముందు ఉంచడం మంచిది. అలా ఉంచాక, వాటిని ధరించాలి. ఇలా చేయడం వలన వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
  2. గాజులు వేసుకుంటే భార్యాభర్తల బంధం బాగుంటుంది. వైవాహిక జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి.
  3. ఉదయం లేదా సాయంత్రం సమయంలో కొత్త గాజులని వేసుకోవచ్చు.
  4. శాస్త్రం ప్రకారం మంగళవారం, శనివారం కొత్త గాజులని కొనుగోలు చేయకూడదు. ఇలా చేయడం వలన భర్తకు దురదృష్టం కలుగుతుంది.
  5. స్త్రీలు గాజులు వేసుకుంటే తన ఆరోగ్యం తన భర్త ఆరోగ్యం కూడా బాగుంటుంది.
  6. ఆదివారం, శుక్రవారం నాడు కొత్త గాజులు వేసుకోవడానికి ఉత్తమ రోజులు.

గాజులు వేసుకునేటప్పుడు పాటించాల్సినవి, పాటించకూడనివి

  1. గుండ్రని ఆకారంలో ఉండే గాజులు బుధుడు, చంద్రుడిని సూచిస్తాయి. ఇవి ధరిస్తే మంచిది.
  2. గాజు గాజులు పవిత్రమైనవి. గాజు గాజులని వేసుకోవడం వలన, వాటి వలన వచ్చే శబ్దం ప్రతికూల శక్తిని తొలగిస్తుంది.
  3. గాజు గాజులు వేసుకుంటే బుధ గ్రహం అనుగ్రహం ఉంటుంది. జాతకంలో శుభ ఫలితాలు వస్తాయి.
  4. బంగారు గాజులు వేసుకునేవారు బంగారం గాజులతో పాటుగా ఒక గాజు గాజు వేసుకునేటట్టు చూసుకోండి.
  5. పెళ్లయిన స్త్రీలు తెలుపు, నలుపు రంగు గాజులు వేసుకోవడం మంచిది కాదు. ఇది దురదృష్టాన్ని, ప్రతికూల శక్తిని కలిగిస్తాయి.
  6. పెళ్లి కాని వారు ఏ రంగు గాజులనైనా వేసుకోవచ్చు.
  7. మణికట్టు మీద గాజులు పడినప్పుడు రక్తప్రసరణ జరిగి రక్తపోటు పెరిగే అవకాశాలని తగ్గిస్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం