ఆగస్ట్ 8, నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వాళ్ళు వృథా ఖర్చులు నియంత్రించాలి
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ08.08.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 08-08-2024
వారం: గురువారం, తిథి : తదియ,
నక్షత్రం: ఉత్తర ఫల్గుణి, మాసం: శ్రావణము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేషం
మానసికంగా ఉల్లాసంగా గడుపుతారు. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. పెట్టుబడులకు తగిన ప్రతిఫలాలు అందుతాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. బాల్యమిత్రులను కలుసుకుంటారు. ఆస్తి పంపకాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలమవుతాయి. కుటుంబసభ్యులతో కలిసి విందులకు హాజరవుతారు. అనవసర భయాలకు దూరంగా ఉండండి. దుర్గాదేవి స్తుతి చేయండి. అంతా మంచే జరుగుతుంది.
వృషభం
నూతన పరిచయాలతో కీలక పనులు పూర్తవుతాయి. పాతబాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రయాణాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విహారయాత్రల్లో పాల్గొంటారు. సోదరులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఒకింత జాగ్రత్త అవసరం. అనవసర చర్చలకు దూరంగా ఉండండి. భూ లావాదేవీల్లో ఇబ్బందులు ఉండవచ్చు. దత్తాత్రేయస్వామి ఆరాధన చేసుకోండి. మనశ్శాంతి లభిస్తుంది.
మిథునం
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈరోజు పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. వృథా ఖర్చులు ముందుకు వస్తాయి. అదృష్టం కలిసి వస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి మూలంగా ఆదాయం సమకూరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. భూ వ్యవహారం కలిసి వస్తుంది. వాహనం కొనుగోలు చేస్తారు. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. శివాలయాన్ని సందర్శించండి.
కర్కాటకం
అదృష్టం కలిసి వస్తుంది. నలుగురికి సాయపడతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సహోద్యోగులతో అభిప్రాయభేదాలు రావచ్చు. సమాజంలో గుర్తింపు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయులు, స్నేహితులు ప్రోద్బలంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. సత్ఫలితాలను పొందుతారు. మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. నరసింహస్వామి స్తోత్రాలు చదువుకోండి.
సింహం
అన్నదమ్ములు, బంధువర్గంతో ఆప్యాయంగా ఉంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. పనులపై మనసు నిలు పుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబసభ్యులతో విహారయాత్రలు చేపడతారు. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులను పూర్తి చేయడంపై మనసు నిలుపుతారు. విద్యార్థులు చదువు విషయంలో శ్రమించాల్సి వస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. రామాలయాన్ని సందర్శించండి.
కన్య
సహోద్యోగుల సహకారం, అధికారుల చేయూత లభిస్తుంది. అదృష్టం కలిసివస్తుంది. ఆర్థికంగా లబ్ది పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణం చేపడతారు. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తవచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఇష్టదైవాన్ని ఆరాధించండి. మంచి జరుగుతుంది.
తుల
కోర్టు సమస్యలు తీరుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యంపై మనసు నిలపాలి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు సాధిస్తారు. నిరుత్సాహానికి గురి కాకుండా ప్రయత్నాలు కొనసాగించాలి. ఉద్యోగులకు తగిన గుర్తింపు వస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందడంలో ఆలస్యం కావచ్చు. రుణ బాధలు ఉంటాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. మంచి అవకాశాలు వస్తాయి. హనుమంతుడి ఆరాధన శుభప్రదం.
వృశ్చికం
భూ వ్యవహారాలు లాభిస్తాయి. ప్లాట్లు కొంటారు. వాహనం కొనుగోలు చేస్తారు. పనులపై శ్రద్ధ నిలుపుతారు. నలుగురికి సాయపడతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తోటి వారితో మనస్పర్ధలు రావచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ, బంధువర్గం సహకారం లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. శివాలయాన్ని సందర్శించండి.
ధనుస్సు
వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబసభ్యుల ప్రోత్సా హంతో సంతోషంగా ఉంటారు. రోజువారీ వ్యాపారం లాభ సాటిగా కొనసాగుతుంది. చేతిలో ఉన్న పనులను పూర్తిచేయడంపై మనసు నిలుపుతారు. సహోద్యోగులు, పై అధికారులతో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. శుభకార్య ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. పనిలో బాధ్యతలు పెరుగుతాయి. వృథా ఖర్చులు నియంత్రించుకోండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. లక్ష్మీదేవి ఆరా ధన మేలుచేస్తుంది.
మకరం
నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వాళ్ళు కుటుంబసభ్యులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. రావలసిన డబ్బు సమయానికి చేతికి అందదు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఉత్సాహంతో పనులుచేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆలోచించి పనులు చేపడతారు. శుభకార్యాల ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఓపికతో సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. మంచి అవకాశాలు వస్తాయి. దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి.
కుంభం
ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధుమిత్రుల సాయంతో కార్యసాఫల్యం ఉంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. మంచి అవకాశాలు వస్తాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వస్తువులు కొంటారు. సమయపాలన లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటారు. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.
మీనం
బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. అనవసర విషయాల జోలికి వెళ్లకుండా ఉండటం అవసరం. రావలసిన డబ్బు చేతికి ఆలస్యంగా అందుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. వృథా చర్చలకు దూరంగా ఉంటారు. సత్ఫలితాలు పొందుతారు. భాగస్వాముల మధ్య స్నేహం పెరుగు తుంది. రాజకీయ, ప్రభుత్వ పనులలో ఖర్చులు పెరగవచ్చు. శివారాధన మేలు చేస్తుంది.