విఘ్నాలను తొలగించే వినాయకుడు జన్మదిన నాడు వినాయక చవితిని జరుపుకుంటాము. భాద్రపద మాసం శుక్లపక్ష చవితి నాడు అంగరంగ వైభవంగా వినాయక చవితిని జరుపుతారు. మనం ఏ పనిని మొదలు పెట్టినా, మొట్టమొదట గణపతిని పూజిస్తాము. వినాయకుని ఆశీస్సులు ఉంటే, ఏ పనిలో కూడా ఆటంకాలు రావని, అన్నీ విజయాలే అని నమ్మకం.
ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు 27న వచ్చింది. మరి ఈ ఏడాది వినాయకుడిని పూజించేటప్పుడు ఏ సమయంలో పూజించాలి? ఏ రంగు దుస్తులు అదృష్టాన్ని తీసుకువస్తాయి వంటి విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం.
ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు 27న వచ్చింది. ప్రతి సంవత్సరం భద్రపద శుక్లపక్ష చతుర్థి నాడు వినాయక చవితిని జరుపుతాము. ఈ సంవత్సరం ఆగస్టు 27న వచ్చింది. చతుర్దశి సెప్టెంబర్ 6న వచ్చింది. సెప్టెంబర్ 6న అనంత చతుర్దశి నాడు వినాయకుడిని నిమజ్జనం చేస్తారు.
చవితి ఆగస్టు 26 మధ్యాహ్నం 1:54 గంటలకు మొదలవుతుంది. ఆగస్టు 27 మధ్యాహ్నం 3:44తో ముగుస్తుంది. ఈ లెక్కన ఆగస్టు 27న వినాయక చవితిని జరుపుకోవాలి. ఆగస్టు 27 ఉదయం 5:20 నుంచి 7:20 వరకు సింహ లగ్నం ముహూర్తం ఉంది. ఈ సమయంలో వినాయకుడిని పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
ఒకవేళ ఆ సమయంలో పూజ చేసుకోలేనట్లయితే, వృశ్చిక లగ్నంలో చేసుకోవచ్చు. ఇది ఉదయం 11:05 నుంచి 11:50 వరకు ఉంటుంది. వినాయకుడిని ప్రతిష్టించి నియమాలతో పూజించాలి. వినాయకుని వ్రత కథ చదువుకోవాలి.
ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారం నాడు వచ్చింది. బుధవారానికి అధిపతి బుధుడు. బుధుడు ఇష్ట దైవం వినాయకుడు. వినాయకుడికి ఆకుపచ్చ ఇష్టం. కాబట్టి వినాయకుడికి ఇష్టమైన ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి పూజ చేసుకుంటే మంచిది.
ఇంట్లో, గణేష్ మండపాల ఏర్పాట్లలో వినాయకుడిని వాస్తు ప్రకారం పెట్టాలి. వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి కలిగి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వినాయకుడు తూర్పు లేదా ఉత్తర దిక్కులో ఫేసింగ్ ఉండేటట్టు చూసుకోవాలి. అలా ఉంటే సానుకూల శక్తి ప్రవహిస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.