వారఫలాలు.. ఈ వారం గ్రహాల సంచారం వీరికి అద్భుతమైన వార్తలు ఇవ్వబోతుంది-august 25th to august 31st weekly horoscope prediction in telugu check zodiac signs results ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వారఫలాలు.. ఈ వారం గ్రహాల సంచారం వీరికి అద్భుతమైన వార్తలు ఇవ్వబోతుంది

వారఫలాలు.. ఈ వారం గ్రహాల సంచారం వీరికి అద్భుతమైన వార్తలు ఇవ్వబోతుంది

HT Telugu Desk HT Telugu
Aug 25, 2024 02:00 AM IST

Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. ఆగస్ట్ 25వ తేదీ నుంచి ఆగస్ట్ 31వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

ఆగస్ట్ 25 నుంచి 31వ తేదీ వరకు వారఫలాలు
ఆగస్ట్ 25 నుంచి 31వ తేదీ వరకు వారఫలాలు (pixabay)

రాశి ఫలాలు (వార‌ ఫలాలు) 25.08.2024 నుంచి 31.08.2024 వ‌ర‌కు

మాసం : శ్రావ‌ణ‌ము, సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేషం

ఈ వారం మేష‌ రాశి వారి గ్రహసంచారం అనుకూలంగా ఉంది. కీల‌క విష‌యాల ప‌ట్ల‌ శ్రద్ధ, ఆసక్తి చూపించాల్సి ఉంది. ఖర్చులు నియంత్రించుకొంటూ ముందుకు సాగాలి. భారీ ఖర్చులు ఏర్పడు సూచనలు ఉన్నాయి. ఇత‌రుల‌తో ఏర్ప‌డిన‌ సమస్యల‌ను పరిష్కరించుకోవాలి. దేనికి భ‌య‌ప‌డొద్దు. ధైర్యంగా ముందు అడుగు వేయండి. వృత్తి, ఉద్యోగ మార్పుల కోసం యత్నించుకొనువారికి శుభాలు ఏర్పడతాయి. అధికారులచే ప్రశంసలు పొందు సూచ‌న‌లు ఉన్నాయి. ఆది, సోమ, బుధ వారములు అనువైనవి. సూర్యుడి ఆరాధ‌న మేలు చేస్తుంది.

వృషభం

ఈ వారం వృష‌భ‌రాశి వారికి సంతృప్తికరంగా ఉంది . ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. మాట, మంచితనం కొన‌సాగే విధంగా జాగ్రత్త పడండి. నూతన పనులకు శ్రీకారం చుడ‌తారు. సంతాన అవసరాలు తీర్చ‌డానికి ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తారు . కుటుంబంలో చిన్నతరహా మార్పులు చేయ‌గ‌ల‌రు. వాహన, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తారు. నిరుద్యోగులు శుభ‌వార్త‌లు విన‌డానికి అవ‌కాశం ఉంది. శుక్ర, శని వారాల్లో అన్నింటా జాగ్రత్తలు అవసరం. దుర్గాదేవిని ఆరాధించండి. శుభ ఫ‌లితాలు మీ సొంతం అవుతాయి.

మిథునం

ఈ వారం వారఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ వారంలో మీ ఊహల్ని, ప్రయత్నాల్ని కార్యరూపంలో పెట్టగలుగుతారు. ఆర్థికంగా చిన్న తరహా సంతృప్తిని ఏర్పరచుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు స్వీకరించవలసిరావచ్చు. ఆరోగ్యపరంగా బావుంటుంది. అవసరాలకు తగినట్లు ఆర్థిక సర్దుబాటులుంటాయి. మానసిక ఒత్తిడిని ఏర్పరచిన అంశాల్ని దూరం చేసుకోగ‌లుగుతారు. ప్రయాణాల్లో జాగ్ర త్తలు తప్పనిసరి. ఆది, సోమ వారాలలో కొన్ని విష‌యాల్లో జాగ్రత్తలు అవసరం. లక్ష్మిదేవిని ఆరాధించండి. ఖ‌ర్చులు నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌డానికి ప్ర‌య‌త్నించండి.

కర్కాటకం

గ్రహసంచారాలు సాధారణ స్థితి గ‌తుల‌ను చూపిస్తున్నాయి. నిత్యకృత్యముల‌కు సంబంధించిన కీల‌క‌ మార్పులు చేర్పులు ఏర్ప‌ర‌చుకోగ‌ల‌రు. సమయోచితంగా సాగి బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగించగలరు. ప్రభుత్వ తరహా పనుల్ని అనుకూలింప చేసుకోగలరు. సంతానంచే శుభవార్తలు వింటారు. ఉన్నత ఉద్యోగులకు బాధ్యతల మార్పు, స్థానచలనం ఉంటాయి. కీలకమనుకొన్న అంశాల పై పట్టు సాధిస్తారు. వీరికి మంగళ, బుధ వారములలో అన్నింటా జాగ్రత్తలు అవసరం. సుబ్ర‌హ్మ‌ణ్య స్వామిని ఆరాధించండి. మంచి జ‌రుగుతుంది.

సింహం

ఈ వారంలో గ్రహసంచారాలు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. ఆత్మనూన్యతా భావాలు వంటివి వెంటపడగలవు. చిన్నచిన్న విషయాలు చికాకు పరచగలవు. అపరిచితులతో మితంగానే సాగాలి. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతగా వ్యవహరించుకోవాలి.ఆర్థికంగా బాగుంటున్నా ఖర్చులు ఎక్కువ ఉండగలవు. వ్యక్తిగత విషయాల్లో ఇతరుల ప్రమేయాలు పెరుగు సూచనలున్నాయి. ఆదిత్య హృదయ పారాయణ చేసుకోండి. ఆది, సోమ, బుధ వారాలు అనువైనవి. గ‌ణ‌ప‌తి ఆరాధ‌న శుభ ఫ‌లితాలు అందిస్తుంది.

కన్య

ఈ వారంలో మంచి ఫ‌లితాలు ఉన్నాయి. బంధుమిత్రుల‌తో ఏర్ప‌డిన క‌లహల‌ను దూరం చేసుకోగలరు. అవ కాశాలను సద్వినియోగం చేసుకోగలరు. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేసుకొంటారు. నూతన కోర్సులపట్ల ఆకర్షితులు అవుతారు. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల స్వీకరిస్తారు. కుటుంబ వ్యక్తుల మధ్య ఏకీభావాలు ఏర్పడతాయి. పెట్టుబడులు పెడ‌తారు . పోటీ పరీక్షలతో విజయాల్ని పొందుతారు. గురు, శుక్ర, బుధ వారాలు అనువైనవి. విష్ణు స‌హ‌స్రనామం స్తోత్రాన్ని ప‌ఠించండి. మేలు చేకూరుతుంది.

తుల

ఈ వారంలో సంచారాలు అనుకూలం. గత లోటుపాట్లను సవరించుకొనేందుకు యత్నించుకోగలరు. అవకాశాలు కలసి వస్తాయి. శ్రమలు ఎక్కువ ఉన్నా అనుకూలతలు పెంచుకోగలుగుతారు. కుటుంబంలో ముఖ్యమైన విషయం ఆలస్యంగా తెలుస్తుంది. లౌక్యం, మౌనంగా ఉండుటయే మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో మీదైన తరహాలో వ్యవహారాలు పూర్తిచేసుకొని మెప్పును పొందుతారు. వీరికి శుక్ర, శని, ఆది వారములు అనువైనవి. ఇష్ట‌దేవ‌తా ఆరాధ‌న మేలు చేస్తుంది.

వృశ్చికం

ఈ వారమున శుభాశుభ మిశ్రమముగా ఉంటుంది. విమర్శలు చేయు వ్యక్తులు పెరుగుతారు. ఆర్థిక సర్దుబాట్లు వంటివి అవసరమయినా నెలవారి ఋణములను తీర్చగలుగుతారు. సంతాన వ్యవహారాల్లో అనుకూలతలు పెంచుకోగలరు. వారి అవసరాలను తీర్చగలుగుతారు. కుటుంబ వ్యక్తులచే ఉత్సాహాలు పొందగలరు. అధికారుల ఒత్తిడులు ఉంటాయి. సంయమనాలు పాటించుకోండి. వీరికి గురు, ఆది, సోమ వారములు అనువైనవి. శివాల‌యాన్ని సంద‌ర్శించండి. స‌త్ఫ‌లితాలు అందుతాయి.

ధనుస్సు

ఈ వారమున గ్రహసంచారాలు అనుకూలంగా ఉన్నాయి. కీల‌క విష‌యాల్లో ప్రయత్నాల‌ను ముమ్మరం చేసుకోండి. అవకాశాలు కలసివస్తాయి. కుటుంబంలో ఉత్సాహకరమైన స్థితులు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో వృద్ధి, ప్రమోషన్ ఏర్పడు సూచనలు గలవు. గత సమస్యలకు పరిష్కారాలు ఏర్పరచుకోగలరు. నూతన ఒప్పందాలు, అగ్రిమెంట్లు చేసుకోగలరు. సంతానపు అవసరాలు తీర్చుటకు ఒత్తిడిని ఎదుర్కో వలసిరావచ్చును. శుక్ర, శని, బుధ వారములు అనువైనవి. శివారాధ‌న మంచి ఫ‌లితాలు అందిస్తుంది.

మకరం

ఈ వారంలో గ్రహసంచారాలలో మార్పులు చిన్నతరహా ప్రయోజనాలనిస్తాయి. వివాదకరమైన అంశాలు కొన్ని చికాకునకు గురిచేస్తాయి. సంతాన పరంగా మీరు తీసుకొను నిర్ణయాలు పునర్విమర్శలకు గురిచేయు సూచనలు కలవు. జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. వృత్తి, ఉద్యోగ అదనపు బాధ్యతలతో అధికార్లతో చిన్నతరహా మానసిక ఘర్షణలు, ఇతరులపట్ల దురుసుగా వ్యవహరించుకొనుట ఉంటాయి. గురు, ఆది, సోమ వారములు అనువైనవి. అమ్మ‌వారిని ఆరాధించండి. మంచి జ‌రుగుతుంది.

కుంభం

ఈ వారంలో కొన్ని మంచి ఫలితాలు, కొన్ని మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ఖర్చులెక్కువ అయినా అమలుచేసుకోగలుగుతారు. ప్రభుత్వతరహా పనుల్ని పూర్తిచేసుకొంటారు. విదేశీయతకు యత్నించుకొను వారికి శుభములు ఉంటాయి. ఇంటి విషయాలకు ఎక్కువ సమయం కేటాయించవలసిరావచ్చును. శుక్ర, శని, బుధ వారములు అనువైనవి. సత్య‌నారాయ‌ణ స్వామిని ఆరాధించండి.

మీనం

ఈ వారములో ప్రయ్నతకార్య అనుకూలతలు పెంచుకోగలరు. బాధ్యతాయుతం గాను, పట్టుదలతోను సాగి అనుకూలతలు పెంచుకోగలరు. వాహన ఏర్పాట్లు చేసుకోగలరు. అనారోగ్యభావనలు దూరమవ్వగలవు. బంధుమిత్రు లతో ఇచ్చిపుచ్చుకోవడాలు అనుకూలింపచేసుకొంటారు. చెల్లింపుల్ని పూర్తి చేసుకొనునట్లు ఆదాయాలుంటాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు వంటివి ఉంటాయి. శుక్ర, శని, ఆది, సోమ వారములు అనువైనవి. న‌వ గ్ర‌హ శ్లోకాలు ప‌ఠించండి. మంచి జ‌రుగుతుంది.

ఆధ్యాత్మిక వేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
ఆధ్యాత్మిక వేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ