ఆగస్ట్ 18, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఎదురుచూడని అవకాశం తలుపు తట్టబోతుంది
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ18.08.2024 అదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 06.08.2024
వారం: ఆదివారం, తిథి : విదియ,
నక్షత్రం: ఉత్తరాషాఢ, మాసం: శ్రావణము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేషం
మేష రాశి వారికి అనుకూల కాలంగా ఉంది. శుభ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఏ పని చేపట్టినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. షేర్లు, భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. మిత్ర బృందంతో చర్చలు సాగిస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలతో సతమతమవుతారు. కొంతమంది వల్ల నిరాశ ఎదురవుతుంది. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి.
వృషభం
ఆర్థిక వ్యవహారాలు ప్రాతికూలముగా ఉంటాయి. సంఘంలో మీకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంటారు. ఇంతకాలం మూలన పడిన పనులు ఇప్పుడు గాడిన పడతాయి. అరటినార వత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. వ్యవహారాలు ఇప్పుడు సానుకూలపడతాయి. ప్రభుత్వపరమైన కొన్ని కాంట్రాక్టులు లీజులు, లైసెన్సులు కలిసి వస్తాయి.
మిథునం
ప్రతి విషయంలోనూ నిరాశకు గురి చేసేవారు ఉన్నారు. ఇబ్బందికరమైన మాటలు వినటం పెద్ద సమస్యగా మారుతుంది. మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసే వారికి దూరంగా ఉండాలి. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలి. ఇంట్లో, వ్యాపార ప్రదేశాల్లో సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. నరదృష్టి తగ్గిపోతుంది. వైద్య విద్యలపై ఆసక్తి కనబరుస్తారు.
కర్కాటకం
నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. కీలక పనులను నూతనోత్సాహంతో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు . ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెంపొందుతాయి. సమీప బంధువులను కలుస్తారు. భవిష్య ప్రణాళికల గురించి చర్చించి, అధిక లాభాలు వచ్చే స్వల్పకాలిక వ్యాపారాలలో ధనాన్ని పొదుపు చేస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి.
సింహం
గృహ సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. స్నేహ బంధాలు బలపడతాయి. వృత్తి సంబంధమైన అభివృద్ధిలో ఆటంకాలు తొలగిపోతాయి. వెన్నునొప్పి బాధించే సూచనలు ఉన్నాయి. సుమంగళి పసుపుతో గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి. నిందలకు దూరంగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి.
కన్య
ఆర్థిక సంబంధ వ్యవహారాలలో లోటుపాట్లు ఉన్నాయి. విపరీతమైన పని ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అకారణంగా మిత్రులతో విరోధం రాకుండా జాగ్రత్త పడండి. దైవానుగ్రహం అన్ని వేళలా అండగా ఉంటుంది. అష్టమూలికా తైలం, లక్ష్మీతామర వత్తులతో అమ్మవారికి దీపారాధన చేయండి. ధైర్యంతో తీసుకున్న ఒక నిర్ణయం సరికొత్త మలుపుకు దారి తీస్తుంది. సత్ఫలితాలు అందుతాయి.
తుల
దేవాలయాలు సందర్శిస్తారు. మీ పరిజ్ఞానానికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారానికి, ఉద్యోగానికి సంబంధించిన ఉపయోగకరమైన సమాచారం అందుకుంటారు. మాట తొందరపాటు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. సంస్థలో మీ సహచరుల సౌజన్యంతో కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.
వృశ్చికం
మీ తెలివి తేటలు, నైపుణ్యం ప్రదర్శించటానికి ఒక చక్కని అవకాశం మీ ముందుకు వస్తుంది, నేర్పుగా ఉపయోగించుకోండి. కొనుగోలు-అమ్మకాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. ప్రశాంతంగా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధికంగా లాభపడతారు. సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చన జరిపించండి. రహస్య శత్రువులు వెలుగులోకి వస్తారు. నరఘోష అధికంగా ఉంటుంది.
ధనుస్సు
ఇతరులను మెప్పించి మీ పనులు పూర్తి చేసుకుంటారు. అదృష్టం కలిసి వస్తుంది. ఒక ఆహ్వానం మీలో ఆనందాన్ని నింపుతుంది. చేపట్టిన కార్యంలో విజయం లభిస్తుంది. అష్టమూలికా తైలం, లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేయండి. కార్యాలయంలో నూతనోత్సాహంతో శ్రమించి మంచి ఫలితాలు సాధిస్తారు. మీకు అందాల్సిన సమాచారం సాంకేతిక లోపం వల్ల సకాలంలో అందదు.
మకరం
ఇంటర్వూలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఎదురు చూడని అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని నేర్పుగా ఉపయోగించుకోండి. గోశాలలో గరిక దానం చేయండి. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. విదేశీ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నవారి సొంతింటి కల నెరవేరుతుంది. సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలు శ్రేయస్కరం.
కుంభం
వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఒకానొక ప్రయాణం మీకు అనుకూలంగా మారుతుంది. శుభవార్తలు వింటారు. అరటినార వత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన సమస్యలు పరిష్కారమవుతాయి. సంఘ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
మీనం
నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వాళ్ళు వ్యక్తిగత విషయాలకు ప్రాముఖ్యతనిస్తారు. కొనుగోళ్లకు అధిక ధనం ఖర్చు చేస్తారు. కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని, వాటిని అమలు చేస్తారు. యోగాభ్యాసం, ప్రకృతి వైద్యం ఆకర్షిస్తాయి. కుటుంబంలో ఐకమత్యం ప్రశాంతతను ఇస్తుంది. వ్యాపారంలో రొటేషన్ లాభాలు బాగుంటాయి. విలువైన వస్తువుల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండండి. శ్రీ వేంకటేశ్వర స్తోత్రాలు పఠించండి.