ఆగస్ట్ 17, నేటి రాశి ఫలాలు.. పారిశ్రామికవేత్తలకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ17.08.2024 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 17.08.2024
వారం: శనివారం, తిథి : ద్వాదశి,
నక్షత్రం: పూర్వాషాఢ, మాసం : శ్రావణము
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేషం
పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులను ఆశ్చర్యపరుస్తాయి. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. కుటుంబ సమస్యలు చాలావరకు పరిష్కారం. ద్వేషించిన వారే ప్రేమ చూపుతారు. వ్యూహాత్మక వైఖరి ఉపకరిస్తుంది. వ్యాపారులకు కోరుకున్న లాభాలు. పెట్టుబడులు రెట్టింపు. ఉద్యోగులకు మరింత ఉత్సాహం. పారిశ్రామికవేత్తలు, కళాకారులు కొత్త ఆశలతో ముందడుగు. హనుమాన్ దేవాలయాన్ని సందర్శించండి.
వృషభం
నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి కొత్త కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. సాంకేతిక విజ్ఞానంపై ఆసక్తి. గృహయోగం. చిత్రవిచిత్ర సంఘటనలు. విద్యార్థులు, నిరుద్యోగుల ప్రయత్నాల్లో కదలికలు. ఆదాయం తగ్గినా అవసరాలకు లోటు రాదు. వివాదాలు నేర్పుగా పరిష్కారం. వ్యాపార భాగ స్వాములతో చర్చలు ఫలిస్తాయి. నూతన పెట్టుబడులు కొంతమేరకు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. రాజకీయవేత్తలకు గుర్తింపు. అమ్మవారిని ఆరాధించండి. మంచి జరుగుతుంది.
మిథునం
ముఖ్య కార్యాలు కొంత జాప్యమైనా పూర్తి చేస్తారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. మీరు తీసుకునే నిర్ణ యాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. ఆదాయం గణనీ యంగా పెరుగుతుంది. వృథా ఖర్చులు. పోటీపరీక్షల్లో విజయం. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. భవన నిర్మాణాలను చేపడతారు. వ్యాపారులు క్రమేపీ లాభాల బాట పడతారు. ఉద్యోగులకు ఊహించని ప్రమోషన్లు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలకు వ్యూహాత్మక విజయాలు. ఇష్టదేవతారాధన శుభప్రదం.
కర్కాటకం
అవసరాలకు లోటు ఉండదు. చేపట్టిన కార్యాలు విజయవంతం. విలువైన సామగ్రి కొంటారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. బంధువులు మీపై ఉంచిన గురుతర బాధ్యత సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వాహనాలు కొంటారు. మీ మాటలతో శత్రు వులను ఆకట్టుకుంటారు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు. ప్రముఖులు సాయం అందిస్తారు. వ్యాపారులకు కొంతమేర లాభాలు. ఉద్యోగులకు ఉత్సాహవంతం. రాజకీయవేత్తలకు విశేష ఆదరణ. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. మంచి జరుగుతుంది.
సింహం
ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చుకుం టారు. శత్రువిజయం. ఆపన్నులను ఆదుకుంటారు. విద్యార్థులు అనుకున్న విజయాలు సాధిస్తారు. వివాహ యత్నాలు, ఏర్పాట్లలో బిజీగా గడుపుతారు. ఆస్తుల వ్య వహారాల్లో చిక్కులు క్రమేపీ తొలగుతాయి. విద్యార్థులు, ఉద్యోగార్ధుల శ్రమ ఫలిస్తుంది. ఆశించిన ఫలితాలు రాబడతారు. నూతన వస్తులాభాలు. వ్యాపారులు భాగస్వాములతో కొన్ని సర్దుబాట్లు చేసుకుంటారు. ఉద్యోగులకు పూర్వవైభవం. పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు జరుపుతారు.
కన్య
పొదుపు పాటిస్తారు. ఆశించిన ఆదాయం సమకూరుతుంది. ఆస్తుల వివాదాల నుంచి బయటపడ తారు. కోర్టు వ్యవహారాల్లోనూ కొంత ప్రగతి. వాహన సౌఖ్యం. దూరపు బంధువుల ద్వారా మాటసహకారం పొందుతారు. క్రీడాకారులు సత్తా చాటుకుంటారు. పలుకుబడి పెంచుకుని ఆధిపత్యాన్ని నిలుపుకుంటారు. కొత్త అగ్రిమెంట్లు. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు.
తుల
చిరకాల కోరిక నెరవేరే సమయం. రాబడి ఆశాజనకం. విలువైన సమాచారం అందుతుంది. ఆస్తులకు సంబంధించిన వివాదాల నుంచి బయటపడే అవకాశం. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. విలువైన సామగ్రి కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వాహనాలు కొంటారు. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు గౌరవ పురస్కారాలు.
వృశ్చికం
ఆస్తుల అగ్రిమెంట్లు. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుంటారు. పోటీపరీక్షల్లో విద్యార్థులకు అనుకూల ఫలితాలు. గృహ నిర్మాణాల్లో ముందడుగు. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. నిరుద్యోగులు అడుగు ముందుకు వేస్తారు. వాహనాలు, స్థలాలు కొంటారు. రాబడి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు విధుల్లో ప్రశంసలు. పారిశ్రామికవేత్తలు తమలోని నైపుణ్యత చాటుకుంటారు.
ధనుస్సు
ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయమై విశేషంగా సహకరిస్తారు. ఆస్తుల విషయంలో ఇబ్బందులు తొలగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. నేర్పు, సహనంతో కొన్ని వివాదాల పరిష్కారం. ఇంతకాలం పడిన ఇబ్బందుల నుంచి ఉపశమనం. వాహనాలు కొంటారు. విద్యార్థులకు విజయాలు. వ్యాపారులకు లాభాలు సంతృప్తినిస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు. రాజకీయవేత్తలు, కళాకారులు అనూహ్య మైన విజయాలు సొంతం చేసుకుంటారు.
మకరం
ఆశ్చర్యకరమైన సంఘటనలు. పలుకుబడి పెరుగుతుంది. ముఖ్య కార్యాల్లో విజయం. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం. విద్యార్థులకు కోరుకున్న ఫలితాలు. ఆదాయం పెరుగుతుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలం. ఇంటి నిర్మాణాలపై తుది నిర్ణయాలు. ఉద్యోగార్థుల ఆశ నెరవేరుతుంది. వ్యాపారులకు ఉత్సాహవంతం. ఉద్యోగులు విధుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు.
కుంభం
నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వాళ్ళు ఈరోజు చేపట్టిన కార్యాల్లో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థుల అంచనాలు నిజం కాగలవు. ఎటువంటి నిర్ణయమైనా తేలిగ్గా తీసుకుంటారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. ఆదాయం పెరుగుతుంది. పదవుల్లో ఉన్న వారితో మాట్లాడతారు. ప్రముఖ వ్యక్తుల పరిచయం. వాహనాలు, భూములు సమకూరతాయి. నిరుద్యోగుల కు శుభవర్తమానాలు. వ్యాపార లావాదేవీలు సరిదిద్దు తారు. ఉద్యోగులకు నూతనోత్సాహం. కొత్త పదవులు దక్కే అవకాశం. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు.
మీనం
ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుస్తాయి. మీ సేవలకు తగిన గుర్తింపు. ప్రముఖుల పరిచయాలు. అం దరిలోనూ గౌరవం. స్థిరాస్తి వివాదాల పరిష్కారంలో చొరవ ఫలిస్తుంది. వాహనాలు, భూములు కొంటారు. శత్రువులు మిత్రులుగా మారతారు. ఇంటి నిర్మాణాలపై ఆసక్తి. నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. వ్యాపారులకు సానుకూలమైన కాలం. ఉద్యోగులకు శ్రమానంతర ఫలితం. రాజకీయవేత్తలకు ఊహించని అవకాశాలు దక్కుతాయి.