ఆగస్ట్ 11, నేటి రాశి ఫలాలు.. వీళ్ళు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ11.08.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 11.08.2024
వారం: ఆదివారం, తిథి: సప్తమి,
నక్షత్రం: స్వాతి, మాసం: శ్రావణము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేషం
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. బంధు మిత్రులను కలుసుకుంటారు. ఇంట్లో సందడి వాతావరణం నెల కొంటుంది. విద్యార్థులు కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందుతారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. కొత్త ఒప్పందాలకు అనువైన సమయం. ఆర్థిక లావాదేవీల్లో తొందరపాటు తగదు. ఆహారం విషయంలో సమయపాలన తప్పనిసరి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సూర్యారాధన శుభప్రదం.
వృషభం
అనుకూల సమయం కొనసాగుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. భూ లావాదేవీల్లో లబ్ధి పొందుతారు. అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. పాతబాకీలు వసూలు అవుతాయి. చిన్న నాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. కోర్టు వ్యవహారాల్లో జాప్యం ఉండవచ్చు. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
మిథునం
గ్రహస్థితి ఫర్వాలేదు. ప్రతి విషయంలోనూ శ్రద్ధ అవసరం. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. రోజువారీ కార్యకలాపాల్లో చిన్నచిన్న ఆటంకాలు తలెత్తుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారులు కొత్త ఒప్పందాల విషయంలో వేచి చూసే ధోరణితో ఉండటం మంచిది. పరిస్థితుల్లో అనుకూల మార్పులు మొదలవుతాయి. రాబడి పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. శివారాధన వల్ల మేలు జరుగుతుంది.
కర్కాటకం
నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. స్నేహితులతో విభేదాలు తలెత్తవచ్చు. రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. విలువైన వస్తువుల విషయంలో అజాగ్రత్త కూడదు. ఖర్చుల నియంత్రణ అవసరం. కుటుంబసభ్యుల సలహాలు పాటించండి. గణపతి ఆలయాన్ని సందర్శించండి.
సింహం
మంచి ఆలోచనలు వస్తాయి. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. పనులు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విద్యార్థులకు మంచి సమయం. వ్యాపారులకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. అన్నదమ్ములతో మనస్పర్ధలు రావొచ్చు. వాహన మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. సహో ద్యోగుల సహకారం లభిస్తుంది. పెద్దల అండదండలు పొందుతారు. పలు కుబడితో పనులు నెరవేరుతాయి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
కన్య
నేటి రాశి ఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఈరోజు పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు మంచి సమయం నడుస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో వృథా ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అశ్రద్ధ కారణంగా కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అదృ ష్టంతో వ్యవహారాలు చక్కబడతాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.
తుల
రావలసిన డబ్బు అందుతుంది. రోజువారి లావాదేవీలు అనుకూ లంగా సాగుతాయి. పెద్దల సూచనలు, సలహాలు పాటించడం అవసరం. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులు సంయమనంతో మెలగాలి. వ్యాపారులు ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించడం అవసరం. కుటుంబసభ్యులతో వివాదాలకు దూరంగా ఉండండి. గణపతి గుడికి వెళ్లండి.
వృశ్చికం
గ్రహస్థితి మోస్తరుగా ఉంది. ఆలోచనలు అమలుచేయడంలో జాప్యం జరుగుతు వస్తుంది. ఉద్యోగులు కాస్త పడాల్సిన సమయం. దానికి తగ్గ ఫలితం పొందుతారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందకపోవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సమయపాలన అవసరం. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
ధనుస్సు
మంచి ఆలోచనలు అమలు చేస్తారు. అన్ని పనుల్లో తాత్కాలిక లబ్ధి పొందుతారు. వ్యాపారులు న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అనుభవజ్ఞుల సలహాలు పాటించడం అవసరం. సహోద్యోగులతో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. భూ లావాదేవీల్లో ఆశించిన ఫలితం పొందలేకపోవచ్చు. రాబడి పెరుగుతుంది. ఆస్తి తగాదాలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. సూర్యారాధన మేలు చేస్తుంది.
మకరం
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అన్నదమ్ములు, స్నేహితులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. అయితే రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందవచ్చు. కుటుంబసభ్యులతో మనస్పర్ధలు రావచ్చు. అనవసరమైన ఆలోచనలు ఉంటాయి. ఆహారం విషయంలో సమయపాలన అవసరం. శివారాధన శుభప్రదం.
కుంభం
నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వాళ్ళు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శ్రమకు అదృష్టం తోడవుతుంది. ఆదాయం పెరుగుతుంది. పిల్లల చదువు, ఉన్నత విద్య, వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయటా సంతృప్తిగా ఉంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థానచలన సూచన ఉన్నది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. దత్తాత్రేయస్వామి ఆరాధన శుభప్రదం.
మీనం
కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆధ్యా త్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యంగా ఉంటారు. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. ఆత్మీయుల సలహాలు పాటించండి. వాహన మర్మతులు ముందుకురావచ్చు. కొత్త పనులు ప్రారంభించకుండా.. చేతిలో ఉన్నవాటిపై దృష్టి సారించడం అవసరం. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. పెద్దల సలహాలు పాటించడం వల్ల మేలు కలుగు తుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.