Astro Tips for Success: ఎంత కష్టపడినా మళ్ళీ మళ్ళీ ఆటంకాలు ఎదురవుతున్నాయా? ఈ 5 పరిహారాలతో మీ జీవితమే మారిపోవచ్చు!-astro tips for success do these 5 to reach your goal and happy life ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Astro Tips For Success: ఎంత కష్టపడినా మళ్ళీ మళ్ళీ ఆటంకాలు ఎదురవుతున్నాయా? ఈ 5 పరిహారాలతో మీ జీవితమే మారిపోవచ్చు!

Astro Tips for Success: ఎంత కష్టపడినా మళ్ళీ మళ్ళీ ఆటంకాలు ఎదురవుతున్నాయా? ఈ 5 పరిహారాలతో మీ జీవితమే మారిపోవచ్చు!

Peddinti Sravya HT Telugu

Astro Tips for Success: వ్యాపారంలో విజయాన్ని అందుకోలేకపోతున్నారా, కోరుకున్న ఉద్యోగం రాలేదా, సక్సెస్ ని అందుకోలేకపోతున్నారా, ప్రమోషన్లు రావట్లేదా? అయితే కచ్చితంగా మీరు ఈ పరిహారాలని ప్రయత్నం చేసి చూడాలి. విజయాన్ని అందుకోవడానికి ఈ 5 పరిహారాలు మీకు సాయపడచ్చు.

విజయాన్ని అందుకోవడానికి ఈ 5 పరిహారాలను పాటించండి (pinterest)

జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా విజయాన్ని అందుకోవాలని, ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. కానీ, కొంత మందికి ఎంత శ్రమించినా కూడా విజయం దక్కదు. మీరు చేసే ప్రతీ పనిలో విజయం దక్కాలంటే, ఈ పరిహారాలని ప్రయత్నం చేయండి. ఇక మీకు తిరుగే ఉండదు.

మీరు అనుకున్నట్లుగా వ్యాపారంలో విజయాన్ని అందుకోలేకపోతున్నారా, కోరుకున్న ఉద్యోగం రాలేదా, సక్సెస్ ని అందుకోలేకపోతున్నారా, ప్రమోషన్లు రావట్లేదా? అయితే కచ్చితంగా మీరు ఈ పరిహారాలని ప్రయత్నం చేసి చూడాలి.

మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసినా పదే పదే విఫలం అవుతున్నట్లయితే ఈ పరిహారాలు చక్కగా పనిచేస్తాయి. అదృష్టం కూడా మీ వెంట ఉంటుంది. కేవలం కొన్ని రోజులు వీటిని పాటిస్తే సరిపోతుంది. ఇక మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు.

విజయాన్ని అందుకోవడానికి ఈ 5 పరిహారాలను పాటించండి

1.కాకులకు చపాతీలు

విజయాన్ని అందుకోలేకపోతున్నట్లయితే ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు, ఒక చపాతీని కాకులకు పెట్టండి. ఇక మీ పని పూర్తయిపోతుంది. ఆటంకాలు ఏమీ ఉండవు.

2.నిమ్మకాయ పరిహారం

చెడు దృష్టి నుంచి బయటపడడానికి నిమ్మకాయ పరిహారం బాగా పనిచేస్తుంది. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన పనులు చేయడానికి ముందు ఈ పరిహారాన్ని పాటించండి. ఒక నిమ్మకాయకి నాలుగు లవంగాలు గుచ్చి 'ఓం శ్రీ హనుమతే నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఆ తర్వాత ఈ నిమ్మకాయని మీతో తీసుకువెళ్లండి. ఇలా చేయడం వలన సక్సెస్ ని అందుకోవచ్చు.

3.పక్షులకు ఆహారం

శని, రాహువు, కేతువు దోషాలతో మీ పనులు పూర్తవనట్లయితే పక్షులకు ఏడు గింజలను ఆహారంగా పెట్టండి. పక్షులు పెట్టిన గింజలను తింటే పనులు పూర్తవుతాయని చాలా మంది నమ్ముతారు.

4.వినాయకుడిని తీసుకువెళ్లండి

మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీతో పాటు ఒక చిన్న వినాయకుడిని తీసుకువెళ్లండి. వినాయకుడు పనిలో ఆటంకాలను తొలగిస్తాడు. దీనితో మీ పనులు పూర్తయిపోతాయి.

5.నల్ల మిరియాల పరిహారం

ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు నల్ల మిరియాలను గడప మీద వేసి, వాటిని దాటి బయటకు వెళ్ళండి. మీ పనిలో ఆటంకాలు తొలగిపోతాయి పనులు పూర్తవుతాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Peddinti Sravya

eMail

సంబంధిత కథనం