ఈ తెల్లని పూలతో శుక్రుడు, చంద్రుడు, గురువు బలపడతారు. జీవితాంతం సంపద, సంతోషం కలుగుతాయి. శుక్రుడు అందం, ప్రేమ, కళ, ఐశ్వర్యం మొదలైన వాటికి కారకుడు. జాతకంలో శుక్రుడు స్థానం బలంగా ఉంటే వీటిపై ప్రభావం పడుతుంది. అయితే, శుక్రుడిని బలంగా మార్చడానికి మల్లె పువ్వుల పరిహారం బాగా పని చేస్తుంది.
మల్లె పువ్వుతో చేసే ఈ పరిహారం శుక్రుడు స్థానాన్ని మాత్రమే కాదు. చంద్రుడు, గురువు స్థానాన్ని కూడా బలంగా మారుస్తుంది. అయితే, మరి జాతకంలో వీటి బలాన్ని పెంచడానికి ఏం చేయాలి? ఈ పరిహారాన్ని ఏ విధంగా పాటించాలి వంటి విషయాలను తెలుసుకుందాం. శుక్ర దోషం ఉన్నా ఇలా చేయడం మంచిది.
సంతోషం, ఐశ్వర్యం, ప్రేమకు కారకుడైన శుక్రుడు బలహీనంగా ఉన్నా లేదంటే శుక్ర దోషం ఉన్నా శుక్రవారం రాత్రి కలశంలో పాలు, మల్లెపూలు వేసి శుక్ర మంత్రాన్ని పఠించాలి.
చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేయడం వలన శుక్రుడు, చంద్రుడు బలపడతాయి. శుక్రుడు, చంద్రుడు మనసుకి కారకుడు. ఈ పరిహారం మనసుకు శాంతి కలుగుతుంది. శుక్రుడు సంతోష పడతాడు.
శివాలయానికి వెళ్లి సోమవారం నాడు మల్లె పూలను శివుడికి సమర్పించాలి. ఇలా చేయడం వలన మీ కల నెరవేరుతుంది. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. సంతోషం, ప్రశాంతత కలుగుతాయి.
గులాబీ, మందారం, మల్లెపూలను లక్ష్మీదేవికి శుక్రవారం నాడు సమర్పిస్తే మంచిది. ఈ పరిహారాన్ని పాటించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అదృష్టం కూడా ఉంటుంది.
మంగళవారం నాడు హనుమంతుని ఆలయానికి వెళ్లి మల్లెపూలను రాముడు భక్తుడికి ఇవ్వాలి. ఇలా చేయడం వలన కుజదోషం నుంచి బయటపడొచ్చు. హనుమంతుడి అనుగ్రహం కలుగుతుంది.
గురువారం నాడు విష్ణుమూర్తికి మల్లెపూలను సమర్పించాలి. ఇలా చేయడం వలన గురు గ్రహం బలంగా మారుతుంది. జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు తొలగిపోతాయి. సంతోషంగా ఉండొచ్చు.
ఇంట్లో మల్లె పూల మొక్క ఉంటే దోషాల నుంచి బయటపడొచ్చు. అలాగే గ్రహాల స్థానంలో కూడా మార్పు వస్తుంది. మిమ్మల్ని మీరు ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు. సంతోషంగా ఉండొచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం