Astro Tips: పూజ అయిన వెంటనే పొరపాటున కూడా ఈ 5 పనులు చేయకండి.. పుణ్యం రాదు, సమస్యలు రావచ్చు!
Astro Tips: పూజ చేయడం వలన భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది. పూజ చేసే సమయాన్ని చాలా పవిత్రమైన సమయంగా భావిస్తారు. పూజ అయిన వెంటనే పొరపాటున కూడా ఈ 5 పనులు చేయకండి. పుణ్యం రాదు, సమస్యలు రావచ్చు.
ప్రతీ ఇంట్లో కూడా రోజూ పూజలు చేస్తారు. పూజ చేయడం వలన భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది. పూజ చేసే సమయాన్ని చాలా పవిత్రమైన సమయంగా భావిస్తారు. ప్రశాంతత కూడా ఈ సమయంలో మనకి కలుగుతుంది. అయితే, పూజ చేసిన ఫలితం కాసేపటి వరకు ఉండాలంటే, పూజ చేసిన వెంటనే ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి.
పూజ చేయడం వలన మన శరీరం, మనసు కొంచెం ప్రత్యేక శక్తిని కలిగి ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో కొన్ని తప్పులు చేయడం మంచిది కాదు. పూజ చేసినంత సేపు చాలా ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. అది కాసేపటి వరకు మన ఇంట్లో కొనసాగాలంటే ఈ తప్పులను చేయకండి.
పూజ చేసిన వెంటనే ఈ 5 పొరపాట్లు చేయకండి
1.గోళ్లు కత్తిరించుకోవడం
పూజ చేసిన వెంటనే గోళ్ళను కత్తిరించడం లాంటివి చేయొద్దు. ప్రతికూల శక్తి కలిగి, సానుకూల శక్తి దూరమవుతుంది. ఒకవేళ కనుక మీరు గోళ్లు కత్తిరించుకోవాలి అనుకుంటే పూజ చేసిన తర్వాత అరగంట వరకు ఆగి, ఆ తర్వాత కత్తిరించుకోండి.
2.కాళ్లు కడుక్కోవడం
పూజ చేసిన వెంటనే కాళ్లు కడుక్కోవడం మంచిది కాదు. ఇలా చేయడం వలన భగవంతుడిని అవమానించినట్లు అవుతుంది. ఇలా చేయడం వలన మీ పూజ ఫలితం కొంచెం తగ్గుతుంది. కాబట్టి కాసేపటి వరకు ఆగడం మంచిది.
3.పూజ చేసిన వెంటనే ప్రసాదం తినడం
ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. చాలా మంది పూజ చేసిన వెంటనే ప్రసాదం తినేస్తారు. అలా కాకుండా కాసేపు అక్కడే వదిలేసి ఆ తర్వాత తినడం మంచిది.
4.మాంసం, మద్యం
ఏ ఇంట్లో అయితే రోజూ పూజలు చేస్తారో ఆ ఇంట్లో మాంసం, మద్యం స్వీకరించడం మంచిది కాదు. ముఖ్యంగా పూజ చేసిన వెంటనే మద్యం, మాంసం ముట్టుకోకూడదు. ఒకవేళ అలా కాకుండా మీరు ఈ తప్పులు చేశారంటే భగవంతుడికి కోపం వస్తుంది. ఇబ్బందులు కలగవచ్చు.
5.కోపానికి గురవ్వకుండా
భగవంతుడి అనుగ్రహం కలగడానికి, సానుకూల శక్తి కలగడానికి పూజ చేసిన వెంటనే కోపానికి గురవ్వకుండా ప్రశాంతంగా వ్యవహరించాలి. శాంతంతో ఉంటే కాసేపటి వరకు బాగుంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం