ఒక్కోసారి మనకి అవసరమైనప్పుడు ఇతరుల నుంచి దేనినైనా అప్పుగా తెచ్చుకుంటూ ఉంటాము. లేదా తెలిసిన వాళ్ళని అడిగి తెచ్చుకుంటూ ఉంటాము. కానీ, ఎట్టి పరిస్థితుల్లో కొన్నిటిని ఉచితంగా తెచ్చుకోకూడదు. అలాంటివి ఇంటికి తీసుకురావడం వలన చాలా నష్టం కలుగుతుంది. గ్రహాలు, జ్యోతిష్యం మాదిరి వాస్తు కూడా మన జీవితంలో చాలా మార్పును తీసుకురావడానికి సహాయపడుతుంది.
వాస్తు కూడా మనం చేసే వాటిల్లో ఏది తప్పు, ఏది ఒప్పు అనేది కూడా చెప్తుంది. కొన్ని పొరపాట్లు చేయడం వలన కష్టాలని ఎదుర్కోక తప్పదు. ఇతరుల నుంచి చాలా మంది అప్పుడప్పుడు కొన్ని వస్తువులని ఉచితంగా పొందుతూ ఉంటారు.
జ్యోతిష్య శాస్త్రం కొన్నిటిని ఇతరుల నుంచి ఉచితంగా తీసుకోకూడదని చెప్తోంది. ఒకవేళ కనుక వీటిని ఇతరుల నుంచి మీరు ఉచితంగా తెచ్చుకున్నట్లైతే, కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
ఎప్పుడూ కూడా ఉప్పుని ఇతరుల నుంచి ఉచితంగా తెచ్చుకోకూడదు. ఒకవేళ మీరు ఇతరుల నుంచి ఉప్పు తెచ్చుకోవాలి అనుకుంటే బదులుగా వారికి ఏదైనా ఇచ్చి తెచ్చుకోండి. ఎందుకంటే ఉప్పు శని దేవుడు, సూర్యుడికి సంబంధించినది. కాబట్టి, ఉచితంగా తెచ్చుకుంటే పేదరికాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పుల బాధ పడాలి.
వాస్తు ప్రకారం జేబు రుమాలిని కూడా ఉచితంగా ఎవరి దగ్గర నుంచి తెచ్చుకోకూడదు. ఎవరికీ బహుమతిగా కూడా ఇవ్వకూడదు. ఇతరుల జేబు రుమాలుని కూడా ఉపయోగించకూడదు. ఇలా చేయడం వలన అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇతరుల నుంచి ఉచితంగా సూదులు తెచ్చుకోవడం మంచిది కాదు. సూదులు ప్రతికూల శక్తిని కలిగిస్తాయి బంధాలని దెబ్బతీస్తాయి. మానసిక ఒత్తిడిని పెంచుతాయి.
ఇతరుల షూ, చెప్పులు తెచ్చుకోకూడదు. ఇతరుల నుంచి ఉచితంగా వీటిని పొందినట్లయితే కష్టాలని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఇతరుల చెప్పులు, షూ ని ఉపయోగించినట్లయితే పనిలో ఆటంకాలు, పేదరికం, ఒత్తిడితో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం