ఇంట్లో ఎక్కువగా గొడవలు అవుతుంటే, ఈ 4 వస్తువులు ఉంచండి.. ఇకపై సమస్యే రాదు!-are you facing troubles at home with disputes then keep these 4 at home says vastu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఇంట్లో ఎక్కువగా గొడవలు అవుతుంటే, ఈ 4 వస్తువులు ఉంచండి.. ఇకపై సమస్యే రాదు!

ఇంట్లో ఎక్కువగా గొడవలు అవుతుంటే, ఈ 4 వస్తువులు ఉంచండి.. ఇకపై సమస్యే రాదు!

Peddinti Sravya HT Telugu

చాలా మంది ఇళ్లల్లో పదేపదే సమస్యలు వస్తున్నాయని, సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మీ ఇంట్లో కూడా రోజూ గొడవలు పడుతూ ఉంటారా?, దాని వలన చికాకుగా అనిపిస్తూ ఉంటుందా? ఆనందం కూడా లేదా? అయితే ఈ 4 వస్తువులు ఉంచండి. ఇకపై సమస్యే రాదు.

ఇంట్లో ఎక్కువగా గొడవలు అవుతుంటే, ఈ 4 ఉంచండి

ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండాలనుకుంటారు. అందుకోసం రకరకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారా?, అయితే ఈ పొరపాట్లు చేయకండి. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సంతోషంగా ఉండడానికి అవుతుంది. చాలా మంది తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. దాని వలన ఎంతో నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

చాలా మంది ఇళ్లల్లో పదేపదే సమస్యలు వస్తున్నాయని, సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మీ ఇంట్లో కూడా రోజూ గొడవలు పడుతూ ఉంటారా?, దాని వలన చికాకుగా అనిపిస్తూ ఉంటుందా? ఆనందం కూడా లేదా? అయితే ఇలా చేయండి. మన చుట్టూ ఉండే వస్తువులు వాటి ఉనికి అనేక రకాల శక్తులని అందిస్తుంది.

మానసిక, శారీరక పరిస్థితులపై ఇవి ప్రభావితం చేస్తాయి. గ్రహాలు శక్తి వస్తువుని బట్టి కూడా ఇంట్లో ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఇంటి అలంకరణ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా మంచిది. గ్రహాల శక్తి ఆధారంగానే సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి కలగాలన్నా.. ఆనందం, శ్రేయస్సు ఇంట్లో నిలవాలని ఇవి ఇంట్లో ఉండేటట్లు చూసుకోండి.

ఇవి ఇంట్లో ఉంటే సమస్యలు తీరుతాయి

1.నీటి బిందె

ఇంట్లో నీటి బిందె ఉండడం చాలా మంచిది. రాగి లేదా ఇత్తడి బిందెతో నీటిని నింపి పెడితే శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. ఇది ఇంటి ఈశాన్యం మూలలో ఉంటే శుభప్రదం.

2.తులసి మొక్క

ప్రతీ ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్క ప్రతికూల శక్తిని తొలగిస్తుంది, సానుకూల శక్తిని వ్యాపిస్తుంది. తులసి మొక్కకి రోజూ నీళ్లు పోయడం వలన కొత్త శక్తి వస్తుంది. ఈశాన్యం వైపు తులసి మొక్క ఉంటే మంచిది.

3.వినాయకుడు, లక్ష్మీదేవి

ఇంట్లో వినాయకుడు, లక్ష్మీదేవి విగ్రహాలని పెట్టండి. ఇది సానుకూల శక్తిని తీసుకొస్తాయి. ఆనందం, శ్రేయస్సు కూడా ఉంటుంది. పూజ గదిలో వీటిని ఉంచవచ్చు. డబ్బు కొరత కూడా లేకుండా ఉంటుంది.

4.పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహం

పంచముఖి ఆంజనేయ స్వామి ఫోటోని లేదా విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వలన ప్రతికూల శక్తి తొలగిపోతుంది. చెడు కన్ను సమస్యలు ఉండవు. దక్షిణం వైపు పంచముఖి ఆంజనేయ స్వామి ఫోటోని పెట్టడం మంచిది. తద్వారా శాంతి, ఆనందం కలుగుతాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం