Kumbha Rasi Today: కుంభ రాశి వారికి ఈరోజు ఆఫీస్‌లో ఒకరితో ఇబ్బందులు, రాత్రికి గుర్తుండిపోయే ఘటన
Kumbha Rasi: రాశిచక్రంలో 11 వ రాశి కుంభ రాశి. జన్మించే సమయంలో కుంభ రాశిలో సంచరించే జాతకుల రాశిని కుంభ రాశిగా పరిగణిస్తారు. ఈరోజు కుంభ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
Kumbha Rasi August 20, 2024: కుంభ రాశి వారు ఈ రోజు ప్రేమ జీవితంలో సమస్యలను పరిష్కరించడంపై ఎక్కువ దృష్టి పెడతారు. ఆరోగ్యం మీ వృత్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు ఈరోజు జాగ్రత్తగా చూసుకోండి.
ప్రేమ
ప్రేమ విషయంలో ఈ రోజు కుంభ రాశి వారు పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పకముందే మీ సహనంతో వాటికి పరిష్కారం లభిస్తుంది. ఈ రోజు ప్రేమ విషయంలో మార్పులు ఉండవచ్చు. తల్లిదండ్రుల అంగీకారంతో కొందరు పెళ్లి దిశగా అడుగులు వేస్తారు. మీ భాగస్వామి భావాల గురించి కొంచెం సున్నితంగా ఉండండి. అలానే భాగస్వామితో ఎక్కువ సమయం గడపండి. మీ భాగస్వామిని కలచివేసే సంభాషణలకు దూరంగా ఉండండి. డిన్నర్ ప్లాన్ చేయడం ద్వారా మీరు ఈరోజు రాత్రి గుర్తుండిపోయేలా చేయవచ్చు.
కెరీర్
కుంభ రాశి జాతకులు ఆఫీస్ రాజకీయాల్లో సవాళ్లు, సహోద్యోగుల నుంచి అహంకారాన్ని ఎదుర్కొంటారు. కార్యాలయంలో ఒక సీనియర్ మీ విజయాలను తక్కువ చేయడానికి ప్రయత్నిస్తాడు. మీ ప్రొడక్టివిటీని దెబ్బతినకుండా చూసుకోండి. మీ గురించి మేనేజర్లు, టీమ్ లీడర్లు ఆత్మవిశ్వాసంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. రాబోవు రోజుల్లో ఇది మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది.
విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు ఈ రోజు శుభవార్త అందుతుంది. వ్యాపారం చేసే కొంతమందికి ఈ రోజు మంచి రాబడి లభిస్తుంది. ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించిన వారు ఈరోజు అధికారులతో వ్యవహరించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి.
ఆర్థిక
డబ్బు పరంగా ఈరోజు కుంభ రాశి వారికి శుభదినం. ఇది మీ జీవనశైలిలో కూడా కనిపిస్తుంది. కొంతమంది జాతకులు మునుపటి పెట్టుబడుల నుంచి ఆశించిన విధంగా డబ్బు పొందలేరు. కానీ ఈ పరిస్థితి మీ డబ్బుపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడం మీకు మంచిదే. కానీ అన్ని విషయాలు తెలుసుకుని అటువైపు అడుగులు వేయండి. వ్యాపారంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకునే వారు ప్రణాళికతో ముందుకు సాగవచ్చు. నగలు, పాత్రలు, కంప్యూటర్ ఉపకరణాలు, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్ వ్యాపారులకు ఈరోజు మంచి రాబడి లభిస్తుంది.
ఆరోగ్యం
ఈ రోజు బరువైన వస్తువులను ఎత్తేటప్పుడు జాగ్రత్త అవసరం. ఛాతీ సమస్యలు రావొచ్చు.సెలవులకు వెళ్ళిన కొంతమంది పిల్లలు గాయపడవచ్చు. ఇది మిమ్మల్ని ఈరోజు బాధపెట్టొచ్చు. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండండి. ఎక్కువ కూరగాయలతో తేలికపాటి భోజనం చేయడానికి ఈరోజు ప్రయత్నించండి.