ఏప్రిల్ 6, నేటి రాశి ఫలాలు.. ప్రముఖులతో పరిచయాలు, మాటలతో ఇతరులను ఆకర్షిస్తారు
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ06.04.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 06.04.2024
వారం: శనివారం, తిథి : ద్వాదశి,
నక్షత్రం :శతభిష, మాసం : ఫాల్గుణం
సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: ఉత్తరాయణం
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబ విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగ యోగముంది. ఉద్యోగాలలో ఆశించిన స్థానచలన మార్పులుంటాయి. మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ప్రయాణాలు కలసివస్తాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మేషరాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించి నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది.
వృషభ రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల కలయిక ఆనందాన్నిస్తుంది. ఉద్యోగస్తులు ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వృషభ రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. శివాలయం దర్శించడం మంచిది.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఉద్యోగులకు అధికారుల అండదండలుంటాయి. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఎంతటివారినైనా మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివపార్వతులను పూజించండి. శివాలయాన్ని నవగ్రహ ఆలయాన్ని దర్శించడం మంచిది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో స్వల్ప భేదాభిప్రాయములు ఏర్పడతాయి. ఆర్థికపరంగా అంత అనుకూలంగా లేదు. కుటుంబ సమస్యలు ఇబ్బందిపెట్టును. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు కొంత ఆటంకాలుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వృథా ఖర్చులుంటాయి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. దైవ చింతన కలుగుతుంది. ఉద్యోగస్తులకు అంత అనుకూలంగా లేదు. వ్యాపారస్తులక నష్టాలతో కూడియున్నటువంటి సమయం. సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విఘ్నేశ్వరుడిని పూజించండి. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించండి.
కన్యా రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఇంటా బయట అశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా ఒడిదుడుకులు అధిగమిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కన్యారాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం రుణవిమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.
తులా రాశి
తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులుంటాయి. తులా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించి నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలున్నాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళ నుండి ఉపశమనం. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. శివాలయం దర్శించడం మంచిది.
ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తి, వ్యాపారపరంగా అంత అనుకూలంగా లేదు. బంధువుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. ప్రారంభించిన పనులు ముందుకు సాగవు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో శ్రమ అధికమవుతుంది. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివపార్వతులను పూజించండి. శివాలయాన్ని నవగ్రహ ఆలయాన్ని దర్శించడం మంచిది.
మకర రాశి
మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడిపెదరు. మిత్రులతో కలసి ఉంటారు. సన్నిహితుల నుండి శుభవార్తల వింటారు. వ్యాపారాల్లో విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దశరథప్రోక్త శనిస్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అధిక శ్రమతో గానీ పనులు పూర్తి కావు. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా మధ్యస్థ ఫలితాలున్నాయి. కుంభరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విఘ్నేశ్వరుడిని పూజించండి. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించండి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వృత్తి ఉద్యోగపరంగా అంత అనుకూలంగా లేదు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనారోగ్య సమస్యలుంటాయి. కుటుంబ సభ్యులతో అభిప్రాయభేదములు ఏర్పడు సూచనలున్నాయి. మీన రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం రుణవిమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మొబైల్ : 9494981000