ఏప్రిల్ 5, నేటి రాశి ఫలాలు.. డబ్బు బాగా ఖర్చు చేస్తారు, సంఘంలో పరపతి పెరుగుతుంది-april 5th 2024 today rasi phalalu in telugu check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  April 5th, 2024 Today Rasi Phalalu In Telugu Check Your Zodiac Signs Result For Daily Horoscope

ఏప్రిల్ 5, నేటి రాశి ఫలాలు.. డబ్బు బాగా ఖర్చు చేస్తారు, సంఘంలో పరపతి పెరుగుతుంది

HT Telugu Desk HT Telugu
Apr 05, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ05.04.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఏప్రిల్ 5వ తేదీ నేటి రాశి ఫలాలు
ఏప్రిల్ 5వ తేదీ నేటి రాశి ఫలాలు (freepik)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 05.04 2024

ట్రెండింగ్ వార్తలు

వారం: శుక్రవారం, తిథి : ఏకాదశి,

నక్షత్రం : ధనిష్ట మాసం : ఫాల్గుణం

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు ఇబ్బందిపెట్టును. వ్యాపారస్తులకు నష్టాలతో కూడిన సమయం. అధిక ధనవ్యయముండును. బంధుమిత్రులతో అకారణంగా భేదాభిప్రాయములు తలెత్తవచ్చు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపే సందర్భంలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగుల ప్రయత్నాలు ముందుకు సాగవు. మేష రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీ అష్టకం పఠించండి.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. వాహనయోగముంది. విద్యార్థులకు అనుకూలం. వృషభరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శ్రీశంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించండి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా కష్టపడాల్సిన సమయం. ఖర్చులను తగ్గించుకోవాలి. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టును. అనుకున్న పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలలో ఇబ్బందులేర్పడతాయి. డబ్బు పొదుపు చేయటం మంచిది. మిథున రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అమ్మవారిని పూజించండి. అమ్మవారి ఆలయాలను దర్శించి తీపి పదార్థాలు లేదా మిఠాయిలను నివేదించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. కోర్టు వ్యవహారాలు కలసివస్తాయి. మీ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది. బంధుమిత్రుల సహకారముంటుంది. కర్కాటకరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పఠించండి. పాలు పంచదారతో చేసిన ప్రసాదములను లక్ష్మీదేవికి నివేదించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది. ఆర్థిక పెట్టుబడుల వ్యవహారంలో జాగ్రత్త అవసరం. బంధుమిత్రులతో అకారణంగా గొడవలు ఏర్పడవచ్చు. ప్రయత్నాలు వాయిదాపడతాయి. సింహరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అతిథులకు తీపిపదార్థాలు వంటివి పంచిపెట్టండి. ఆలయాలలో మిఠాయిలు వంటివి ప్రసాదంగా సమర్పించండి. పశువులకు బెల్లం, తీపి పదార్థాలను ఆహారంగా పెట్టడం మంచిది.

కన్యా రాశి

కన్యారాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులకు లాభాదాయకం. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుండి ప్రశంసలుంటాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కలసివస్తాయి. విద్యార్థులు అనుకూలమైన రోజు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబముతో ఆనందముగా గడిపెదరు. శ్రీకృష్ణుడిని పూజించాలి. కన్యారాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లలితా స్తోత్రాన్ని పఠించండి. లక్ష్మీ అష్టోత్తర నామాలను పఠించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగుతాయి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. వాయిదాపడిన పనులు పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలేర్పడతాయి. వ్యాపారస్తులకు అనుకూల సమయం. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తారు. శుభకార్య వేడుకలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందముగా గడిపెదరు. తులా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీ అష్టకం పఠించండి.

వృశ్చిక రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. అకస్మిక ధనలాభముంటుంది. నూతన గృహ ప్రాప్తి. విద్యార్థులు ముందంజలో ఉంటారు. బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించి పేరు సంపాదిస్తారు. ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందముగా గడుపుతారు. వృశ్చికరాశి మరింత శుభఫలితాలు పొందటం కోసం అతిథులకు తీపిపదార్థాలు వంటివి పంచిపెట్టండి. ఆలయాలలో మిఠాయిలు వంటివి ప్రసాదంగా సమర్పించండి. పశువులకు బెల్లం, తీపిపదార్ధాలను ఆహారంగా పెట్టడం మంచిది.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. వాహనాలు, స్థలాలు కొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణాలు కూడా ప్రారంభించే అవకాశముంది. ఆరోగ్యం అనుకూలించును. వ్యాపారపరంగా లాభదాయకం. ఉద్యోగస్తులకు అనుకూలం. విందు వినోదాల్లో పాల్గొంటారు. శత్రువులు మిత్రులుగా మారతారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పఠించండి. పాలు పంచదారతో చేసిన ప్రసాదములను లక్ష్మీదేవికి నివేదించడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలుంటాయి. వ్యాపారస్తులకు లాభాలు అందుతాయి. నూతన వస్తు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మీ ప్రవర్తన అందరికి ఆనందాన్నిస్తుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలున్నాయి. విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత పొందుతారు. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అమ్మవారిని పూజించండి. అమ్మవారి ఆలయాలను దర్శించి తీపి పదార్థాలు లేదా మిఠాయిలను నివేదించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ధనాన్ని విరివిగా ఖర్చు చేస్తారు. నూతన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ వాక్చాతుర్యంతో ఇతరులను మెప్పిస్తారు. ఆరోగ్యం అనుకూలించును. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శ్రీశంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. గృహంలో శుభయోగాలున్నాయి. భూ, గృహ, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులుంటాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైన రోజు. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీ అష్టకం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel