ఏప్రిల్ 3, నేటి రాశి ఫలాలు.. ఈ మూడు రాశుల వారికి అనుకూలంగా లేదు, కాస్త జాగ్రత్త-april 3rd 2024 today rasi phalalu check your zodiac signs result for daily horoscope in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఏప్రిల్ 3, నేటి రాశి ఫలాలు.. ఈ మూడు రాశుల వారికి అనుకూలంగా లేదు, కాస్త జాగ్రత్త

ఏప్రిల్ 3, నేటి రాశి ఫలాలు.. ఈ మూడు రాశుల వారికి అనుకూలంగా లేదు, కాస్త జాగ్రత్త

HT Telugu Desk HT Telugu
Apr 03, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ03.04.2024 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఏప్రిల్ 3వ తేదీ నేటి రాశి ఫలాలు
ఏప్రిల్ 3వ తేదీ నేటి రాశి ఫలాలు (freepik)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 03.04.2024

వారం: బుధవారం, తిథి : నవమి,

నక్షత్రం : ఉత్తరాషాఢ, మాసం : ఫాల్గుణం,

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. అన్నదమ్ములతో కలసిమెలసి ఉంటారు. శుభకార్యాల విషయంలో ఆర్ధికంగా ఆటంకాలు ఏర్పడవచ్చు. ఆరోగ్య సమస్యలు తీరతాయి. శుభవార్త వింటారు. కుటుంబములో అభిప్రాయభేదాలు ఏర్పడవచ్చు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. దీర్ఘకాలిక పెట్టుబడులు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాలు కలసివస్తాయి. మేషరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మంచిది. మహావిష్ణువు ఆలయాన్ని దర్శించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు. వ్యాపారస్తులకు లాభదాయకం. కుటుంబ సభ్యులతో ఆనందముగా కాలం గడిపెదరు. విలువైన ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలుంటాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్య సమస్యలుంటాయి. ప్రశాంతంగా ఉంటారు. వృధా ఖర్చులుంటాయి. వృషభ రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం కృష్ణుని ఆలయాలు దర్శించటం మంచిది. కృష్ణాష్టకం పఠించాలి.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశివారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆరోగ్యంగా ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. మంచి ఆలోచనలు వస్తాయి. అర్థిక సమస్యలు ఎదురుకావచ్చు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి అవకాశాలుంటాయి. కుటుంబసభ్యులతో చర్చించడం మంచిది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. దైవభక్తి పెరుగుతుంది. మంచివారితో పరిచయాలేర్పడతాయి. మిథునరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శ్రీమన్నారాయణుడు/ శ్రీమహావిష్ణువుకు సంబంధించిన ఆలయాన్ని దర్శించడం మంచిది. విష్ణుమూర్తి ఆలయాలలో అర్చన జరిపించుకోవాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా, ఆనందముగా గడిపెదరు. ఉద్యోగస్తులకు పదోన్నతులుంటాయి. ఆరోగ్య సమస్యలుండవు. బంధుమిత్రుల సహకారముంటుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులుంటాయి. విద్యార్థులకు అనుకూల సమయం. నిరుద్యోగులకు ఉద్యోగకాశములుంటాయి. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం రామాలయాలను దర్శించండి. రామకోటి వంటివి రాయటం మంచిది. తారకమంత్రం పఠించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో విభేదాలేర్పడవచ్చును. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు ఇబ్బందిపెట్టును. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోరాదు. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రతి విషయంలోను ఆచి తూచి వ్యవహరించాలి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచిస్తున్నాను. సింహరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్య నమస్కారం చేయటం మంచిది. గురు దక్షిణామూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉన్నది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్న పనులు సకాలంలో విజయవంతంగా పూర్తిచేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహనిర్మాణ పనులు కలసివస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. రావలసిన డబ్బు అందుతుంది. అన్మదమ్ముల సహకారముంటుంది. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయండి. విష్ణుమూర్తి అష్టోత్తర నామాలను పఠించండి.

తులా రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం తులా రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు. ఆర్ధిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. దుబారా ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడిపెదరు. తీర్ధయాత్రలు చేస్తారు. తులా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయాలి. మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. వృత్తి, వ్యాపారపరంగా లాభాలున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, అనుకూల స్థాన చలన మార్పులుంటాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబముతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కాంట్రాక్టులు లభిస్తాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వృశ్చిక రాశివారు మరింత శుభఫలితాల పొందటం కోసం గణపతి అష్టోత్తరం పఠించాలి. వినాయకుడి ఆలయాన్ని దర్శించాలి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబముతో అనందముగా గడిపెదరు. ప్రయాణాలు కలసివస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు విదేశీ ప్రయాణం, ఉన్నత విద్య అనుకూలిస్తుంది. బంధువులతో భేదాభిప్రాయములు తలెత్తవచ్చు. వాహనా మరమ్మతుల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ధనూరాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం వినాయకుడిని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించాలి.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. విందు వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబములో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానం గురించి అధికంగా ఆలోచిస్తారు. రుణాలు చేస్తారు. మీ మీద ఉన్న బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మకర రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మంచిది. మహావిష్ణువు ఆలయాన్ని దర్శిచండం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. ప్రారంభించిన పనులు వాయిదాపడతాయి. కుటుంబసభ్యులతో అభిప్రాయ భేదములు ఏర్పడును. స్నేహితులతో మాటపడవలసి వస్తుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో పని ఒత్తిడులుంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయండి. విష్ణుమూర్తి అష్టోత్తర నామాలను పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వాహన యోగముంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం రామాలయాలను దర్శించండి. రామకోటి వంటివి రాయటం మంచిది. తారకమంత్రం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ