ఏప్రిల్ 2, నేటి రాశి ఫలాలు..సోదరులతో గొడవలు, వ్యాపార విస్తరణకు ఆటంకాలు
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ02.04.2024 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 02.04 2024
వారం; మంగళవారం, తిథి : అష్టమి,
నక్షత్రం : పూర్వాషాఢ, మాసం : ఫాల్గుణం
సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: ఉత్తరాయణం
మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఆరోగ్య సమస్యలు కాస్త ఇబ్బందిపెడతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. ఉద్యోగస్తులకు శ్రమ పెరుగుతుంది. ఆదాయం కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలు తీరతాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషాన్నిస్తాయి. దేవాలయ దర్శనం చేస్తారు. ఇంటిలో కొద్దిపాటి ఒత్తిడులు. శ్రమానంతరం కార్యక్రమాలు పూర్తిచేస్తారు. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మేషరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వరునికి దీపారాధన చేయండి. రాహుకాల సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం మంచిది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మీరు చేసేటటువంటి ప్రతీ పనియందు విజయాన్ని పొందెదరు. ధనలాభం, కీర్తిలాభం కలుగును. విదేశీ ప్రయాణాలు లాభాలు ఇస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా లాభదాయకముగా ఉంటుంది. వృషభరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దుర్గాదేవిని పూజించటం మంచిది.
మిథున రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. రావలసిన డబ్బు అందుతుంది. వ్యాపారులకు పెట్టుబడులకు తగిన లాభాలుంటాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కళాకారులకు అవార్డులు, రివార్డులు అందుతాయి. కొన్ని సమస్యలు తీరతాయి. కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. దేవాలయాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సుబ్రహ్మణ్యుని ఆలయం దర్శించటం మంచిది. రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. రావలసిన సొమ్ము ఆలస్యంగా అందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో కొంత నిరాశ. పెట్టుబడులలో తొందరపడరాదు. ఉద్యోగస్తులకు అనుకూలంగా లేదు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. సోదరులు నుంచి మాటపడతారు. మీ ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలుంటాయి. వాహనాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆంజనేయస్వామి వారిని పూజించండి. అప్పాలను ఆంజనేయస్వామికి నివేదించడం మంచిది.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మానసిక అశాంతి. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. వ్యాపారస్తులకు అనుకున్న లాభాలు రావు. ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీలుంటాయి. కాంట్రాక్టులు చేజారిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శారీక సమస్యలు ఇబ్బందిపెడతాయి. బంధువులు, స్నేహితులతో అకారణంగా విభేదాలు. కార్యక్రమాలలో ఆటంకాలుంటాయి. సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దుర్గా దేవిని పూజించాలి. సుబ్రహ్మణ్యుని ఆలయాన్ని దర్శించడం మంచిది.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేయవలసిన పరిస్థితి. వ్యాపారస్తులకు లాభాలు రావు. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు అధికమగును. అవకాశాలు జారవిడుచుకుంటారు. బంధువర్గంలో గొడవలు. ఆరోగ్యంపై శ్రద్ద అవసరం. ముఖ్యులతో వ్యక్తిగత విషయాలు చర్చిస్తారు. స్నేహితుల నుంచి మాటపడతారు. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. కన్యా రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దుర్గాదేవిని పూజించడం, ఆరాధించడం మంచిది. రాహుకాల సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి.
తులా రాశి
తులా రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యగులకు పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. అనుకున్న సొమ్ము అందుతుంది. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులుంటాయి. అరుదైన ఆహ్వానాలు. సన్నిహితులు, స్నేహితులతో వివాదాల పరిష్కారం. కార్యక్రమాలలో అవరోధాలు తొలగుతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. తులారాశివారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఉద్యోగస్తులకు మార్పులు అనివార్యం. దేవాలయాలు సందర్శిస్తారు. స్నేహితుల నుంచి మాటపడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబములో ఒత్తిడులుంటాయి. కొన్ని సమస్యలు వేధిస్తాయి. వృశ్చికరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం వినాయకుడిని పూజించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.
ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. భూములు, భవనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు లక్ష్యాలు సాధిస్తారు. పదోన్నతులు లభించే సమయం. వ్యాపారులకు స్వయంకృషితో లాభాలుంటాయి. దేవాలయాలు సందర్శిస్తారు. స్నేహితులతో ఆనందముగా గడుపుతారు. ఆశయాల సాధనలో బంధువుల సహకారముంటుంది. ఆదాయ విషయంలో ఇబ్బందులు ఎదురైనా అవసరాలు తీరతాయి. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి.
మకర రాశి
మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. రుణభారాలు తొలగుతాయి. వ్యాపారస్తులకు అనుకున్న లాభాలుంటాయి. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. మకర రాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సాయంకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. గణపతి స్తోత్రం పఠించాలి.
కుంభ రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతులంటాయి. వ్యాపారస్తులకు లాభాదాయకం. విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలుంటాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. కార్యక్రమాలు అనుకున్న విధంగా సాగుతాయి. ముఖ్యమైన కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య సమస్యలు తీరతాయి. కుంభరాశివారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం విఘ్నేశ్వరుడిని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. శ్రమకు ఫలితం కనిపించదు. ఉద్యోగస్తులకు ఊహించని బదిలీలుంటాయి. శుభవార్తలుంటాయి. చేపట్టిన పనులలో ఆటంకాలుంటాయి. సోదరులు, సోదరీలతో గొడవలు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు. విద్యార్థులు అనుకున్నది సాధించడంలో విఫలమవుతారు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారస్తులకు ఆటుపోట్లు, అనుకున్న లాభాలు కష్టమే. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం రుణవిమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మొబైల్ : 9494981000