ఏప్రిల్ 28, నేటి రాశి ఫలాలు.. వీరికి శత్రు దోషం తొలగుతుంది, ఎవరికి ధనం ఇవ్వొద్దు-april 28th 2024 today rasi phalalu in telugu check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఏప్రిల్ 28, నేటి రాశి ఫలాలు.. వీరికి శత్రు దోషం తొలగుతుంది, ఎవరికి ధనం ఇవ్వొద్దు

ఏప్రిల్ 28, నేటి రాశి ఫలాలు.. వీరికి శత్రు దోషం తొలగుతుంది, ఎవరికి ధనం ఇవ్వొద్దు

HT Telugu Desk HT Telugu
Apr 28, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ28.04.2024 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఏప్రిల్ 28, నేటి రాశి ఫలాలు
ఏప్రిల్ 28, నేటి రాశి ఫలాలు (freepik )

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 28.04.2024

వారం: ఆదివారం, తిథి : చవితి

నక్షత్రం : మూల, మాసం : చైత్రం,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు లాభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపెదరు. మీరు చేసే ప్రతి పనీ సత్ఫలితాన్నిస్తుంది. భూ, గృహ, వాహనాదియోగాలుంటాయి. మేష రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయాన్ని పఠించండి. సూర్య నమస్కారం వంటివి చేయటం వలన శుభఫలితాలు కలుగుతాయి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా అనుకూల సమయం. వ్యాపారంలో విశేష ధనలాభముంది. మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. మిత్రబలం పెరుగుతుంది. శత్రుదోషం తొలగుతుంది. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యాష్టకాన్ని పఠించండి. నవగ్రహ జపం చేయటం మంచిది.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును. వివాదాలకు దూరంగా ఉండాలి. ఒత్తిడి కలిగించే సంఘటనలు ఉన్నాయి. చెడు ఆలోచించవద్దు. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకొనే నిర్ణయాలు సఫలమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో తగిన శ్రద్ద చూపించాలి. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అరుణం పారాయణం చేయడం మంచిది. సూర్యభగవానుడికి తర్పణాలు వదలండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకులంగా ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపెదరు. ఆరోగ్య విషయాలలో శ్రద్ద వహించాలి. అనుకున్నది సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విద్యార్థులకు అనుకూల సమయం. అపార్థాలకు దూరంగా ఉండాలి. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సూర్యనారాయణమూర్తిని పూజించండి. చంద్రశేఖరాష్టకం పఠించండి.

సింహ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం సింహ రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. ప్రతీ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. గొడవలకు దూరంగా ఉండాలి. మిత్రుల వలన కొన్ని పనులు పూర్తవుతాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగస్థులకు మధ్యస్థ సమయం. కొందరి వలన ఇబ్బందులు ఎదురవుతాయి. సింహ రాశి వాళ్ళు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. సూర్యాష్టకాన్ని పఠించడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్థులకు అనుకూల సమయం. కుటుంబ సభ్యులతో చర్చించి పనులు చేయాలి. మీ ప్రతిభతో ప్రశంసలు అందుకుంటారు. శుభవార్త వింటారు. ఎవరికైనా ధనమిస్తే తిరిగిరాదు. మీరు అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాలి. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యభగవానుని పూజించి బెల్లం, పరమాన్నాన్ని నివేదించడం మంచిది. ఆలయాలను దర్శించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. ఉద్యోగస్తులు పై అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తులా రాశివారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. సూర్య నమస్కారాలు చేయాలి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. డైరెక్ట్‌గా నిర్ణయాలు తీసుకొని అమలుచేయండి. పనులను మధ్యలో ఆపవద్దు. చెడు ఆలోచనలు చేయవద్దు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించాలి. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాలి. వృశ్చిక రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాల్లో పూజలు వంటివి చేయాలి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా అనుకూల ఫలితాలున్నాయి. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన ధాన్యాభివృద్ధి ఉంటుంది. శుభవార్త వింటారు. అన్ని విషయాలలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం అనుకూలించును. ధనూ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యాష్టకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది.

మకర రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవాలి. సకాలంలో మీ పనులు పూర్తిచేయాలి. ఉద్యోగస్థులకు పై అధికారులతో ఇబ్బందులు కలుగును. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. కుటుంబ సమస్యలు ఇబ్బందిపెట్టును. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాలి. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ శాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్టకాన్ని పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. రుణ సమస్యలు తొలగుతాయి. ఒక పని పూర్తవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఆనందాన్నిస్తాయి. ముఖ్యమైన విషయాలలో విజయం లభిస్తుంది. శత్రుపీడ తొలగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో సమయానుకూలంగా వ్యవహరించాలి. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభ రాశి మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి.

మీన రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. సకాలంలో పనులు పూర్తి చేస్తే మంచిది. వివాదములకు దూరంగా ఉండాలి. తెలియని ఆటంకాలుంటాయి. ప్రతీ అడుగు ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్య పనులలో విజయం లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel