ఏప్రిల్ 1, నేటి రాశి ఫలాలు.. ఆప్తులు అండగా నిలుస్తారు, ఫోన్ సందేశాలు నమ్మొద్దు-april 1st 2024 today rasi phalalu check your zodiac signs result for daily horoscope in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  April 1st, 2024 Today Rasi Phalalu Check Your Zodiac Signs Result For Daily Horoscope In Telugu

ఏప్రిల్ 1, నేటి రాశి ఫలాలు.. ఆప్తులు అండగా నిలుస్తారు, ఫోన్ సందేశాలు నమ్మొద్దు

HT Telugu Desk HT Telugu
Apr 01, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ01.04.2024 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఏప్రిల్ 1వ తేదీ నేటి రాశి ఫలాలు
ఏప్రిల్ 1వ తేదీ నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 01.04.2024

ట్రెండింగ్ వార్తలు

వారం: సోమవారం, తిథి : సప్తమి

నక్షత్రం : మూల, మాసం : ఫాల్గుణం

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానం అందుతుంది. గృహనిర్మాణాలు ముగింపు దశకు వస్తాయి. వేడుకలకు హాజరవుతారు. పొదుపు పథకాల పట్ల ఆసక్తి కలుగుతుంది. మానసికంగా కుదుటపడతారు. కష్టం ఫలిస్తుంది. ఆదాయం బాగుంటుంది. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. మేషరాశివారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం శివపంచాక్షరీ మంత్రంతో శివుడిని అభిషేకించడం, పూజించడం మంచిది.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అయినవారి సహకారం ఉంటుంది. పెట్టుబడులకు సమయం కాదు. పత్రాల రెన్యువల్‌లో ఏకాగ్రత వహించండి. దళారులను ఆశ్రయించవద్దు. పనులు వేగవంతమవుతాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. వృషభ రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం చంద్రశేఖర అష్టకం పఠించడం మంచిది. శివాలయాన్ని దర్శించడం వల్ల ప్రశాంతత లభించును.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. మీ సమర్థతను చాటుకుంటారు. ఆదాయ వ్యయాలు అనుకూలంగా ఉంటాయి. సంస్థల స్థాపనకు అనుకూలం. ఆప్తులకు సాయం అందిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రతి విషయంలో నిర్ణయాలు ఆచితూచి తీపుకోవాలి. అపరిచితులతో మితంగా సంభాషించండి. మిథునరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివాలయాన్ని దర్శించి పుణ్యనదీ (గంగ, గోదావరి, కృష్ణ, కావేరీ) జలాలతో అభిషేకం చేయటం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. ప్రముఖుల సందర్శనం అనుకూలించదు. చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు. ఆధ్యాత్మికత పెరుగుతుంది. అపోహలను తావివ్వవద్దు. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోవాలి. పిల్లల చదువులపై మరింత శ్రద్ద వహించాలి. కర్కాటకరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం బిల్వపత్రాలతో శివుడిని పూజించండి. బిల్వాష్టకం పఠించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఖర్చులు అధికమగును. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఆలోచనలతో సతమతమవుతారు. రుణ ఒత్తిళ్ళతో మనశ్శాంతి ఉండదు. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. వ్యాపకాలు సృష్టించుకోవడం మంచిది. సన్నిహితుల చొరవతో సమస్య సానుకూలమవుతుంది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. సింహరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యనారాయణ మూర్తికి తర్పణాలు వదలండి. లింగాష్ట్రకాన్ని పఠించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆదాయానికి తగినట్లుగా ఖర్చులుంటాయి. ఆప్తుల సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఒప్పందాల్లో ఆచితూచి వ్యవహరించండి. పొదుపునకు ఆస్కారం లేదు. నిలిచిపోయిన పనులు పూర్తిచేస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. బ్యాంకు వివరాలు ఇతరులకు వెల్లడించవద్దు. అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తారు. కన్యా రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం పంచామృతాలతో శివాభిషేకం చేసుకోవడం మంచిది. శివపురాణం పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో సత్సంబంధాలుంటాయి. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానపరంగా శుభం జరుగుతుంది. గృహమార్పు తప్పనిసరి. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నది. మీ శ్రమ ఫలిస్తుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. తులా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివాష్టకం పఠించండి. శివాలయంలో ప్రదక్షిణలు చేయటం, శివారాధన మంచిది.

వృశ్చిక రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. మీ కృషి ఫలిస్తుంది. సామరస్యంగా వ్యవహరించండి. వ్యవహారాలు ధనంలో ముడిపడి ఉంటాయి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. స్థిరచరాస్తుల వ్యవహారంతో తీరిక ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. ధార్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వృశ్చికరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలముంటుంది. శుభవార్త వింటారు. ప్రణాళికలు వేసుకుంటారు. కొత్త పరిచయాలుంటాయి. అపరిచితులను నమ్మవద్దు. గృహ మరమ్మత్తులు చేపడతారు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. పెద్దల ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. నిశ్చితార్థంలో జాగ్రత్త. మీ స్తోమతకు మించి హామీలివ్వవద్దు. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివారాధన చేయాలి. బిల్వాష్టకము పఠించటం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం బాగుంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. ఇంటా బయటా ప్రశాంతత ఉంటుంది. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. ఆప్తులతో సంభాషిస్తారు. మీ నమ్మకం ఒమ్ము కాదు. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అప్టోతర శతనామావళి పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఆప్తుల జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ప్రణాళికలు వేసుకుంటారు. రావనుక్ను బాకీలు వసూలవుతాయి. సంస్థల స్థాపనకు తరుణం కాదు. ఏకపక్ష నిర్ణయాలు తగవు. సమాచారాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. కుంభరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం బిల్వాష్టకం పఠించండి. శివారాధన చేయండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఖర్చులు అధికమగును. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. ఫోన్‌ సందేశాలను నమ్మవద్దు. ఆప్తుల సలహా పాటించండి. పిల్లల విజయం సంతోషాన్నిస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్గుమణుగుతుంది. మీ సమర్థతను చాటుకుంటారు. అవకాశాలు కలసివస్తాయి. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుడిని పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel