ఏప్రిల్ 17, నేటి రాశి ఫలాలు.. శ్రీరామనవమి రోజు మీ రాశి జాతకం ఎలా ఉందో చూశారా?-april 17th 2024 today rasi phalalu in telugu check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఏప్రిల్ 17, నేటి రాశి ఫలాలు.. శ్రీరామనవమి రోజు మీ రాశి జాతకం ఎలా ఉందో చూశారా?

ఏప్రిల్ 17, నేటి రాశి ఫలాలు.. శ్రీరామనవమి రోజు మీ రాశి జాతకం ఎలా ఉందో చూశారా?

HT Telugu Desk HT Telugu
Apr 17, 2024 08:00 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ17.04.2024 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఏప్రిల్ 17, నేటి రాశి ఫలాలు
ఏప్రిల్ 17, నేటి రాశి ఫలాలు (freepik)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 17.04 2024

వారం: బుధవారం, తిథి : శు.నవమి,

నక్షత్రం : పుష్యమి, మాసం : చైత్రము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూలంగా లేదు. బంధువర్గంతో వివాదాలుంటాయి. చేపట్టిన పనులలో అటంకాలు అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు వాయిదా వేస్తారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మేష రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మంచిది. మహావిష్ణువు ఆలయాన్ని దర్శించడం మంచిది.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధువర్గం నుండి శుభవార్తలు వింటారు. కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు అనుకూలం. ఉద్యోగస్తులకు సమస్యలు తొలగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం కృష్ణుని ఆలయాలు దర్శించటం మంచిది. కృష్ణాష్టకం పఠించాలి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలం. ఉద్యోగస్తులకు నూతన పదోన్నతులుంటాయి. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శ్రీమన్నారాయణుడు/ శ్రీమహావిష్ణువుకు సంబంధించిన ఆలయాన్ని దర్శించడం మంచిది. విష్ణుమూర్తి అలయాలలో అర్చన జరిపించుకోవాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదములులేర్పడు సూచనలున్నాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత అప్పులు తీర్చడానికి కొత్త ప్రయత్నాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారపరంగా ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం రామాలయాలను దర్శించండి. రామకోటి వంటివి రాయటం మంచిది. తారకమంత్రం పఠించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అంత అనుకూలంగా లేదు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలున్నాయి. వృథా ఖర్చులుంటాయి. అకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. నూతన రుణ ప్రయత్నాలు కలసిరావు. ఇంటా బయటా అంత అనుకూల పరిస్థితులు లేవు. సింహరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్య నమస్కారం చేయటం మంచిది. గురు దక్షిణామూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉన్నది. సన్నిహితుల నుండి శుభకార్య అహ్వానాలు అందుతాయి. నూతన వ్యక్తులతో పరిచయం కలసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు లాభదాయకం. కన్యా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయండి. విష్ణుమూర్తి అష్టోత్తర నామాలను పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్నిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులు ఉద్యోగాలలో ఆటంకాలను అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రయాణాలుంటాయి. తులారాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయాలి. మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా కొంత ఇబ్బంది కలిగిస్తాయి. పనులలో శ్రమ అధికమవుతుంది. ఆర్థిక ఇబ్బందుల వలన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. బంధువర్గంతో వివాదాలుంటాయి. వృశ్చిక రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం గణపతి అష్టోత్తరం పఠించాలి. వినాయకు ఆలయాన్ని దర్శించాలి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో అభిప్రాయభేదములు ఏర్పడతాయి. వ్యాపార, ఉద్యోగపరంగా అంత అనుకూలంగా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో ఇబ్బందులు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ధనూరాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం వినాయకుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించాలి.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబముతో ఆనందముగా గడిపెదరు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ధన వ్యవహారాలు కలసివస్తాయి. అవసరానికి సన్నిహితుల సాయం అందుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల సమయం. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మంచిది. మహావిష్ణువు ఆలయాన్ని దర్శించడం మంచిది.

కుంభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగుతాయి. దూరప్రయాణాలలో ప్రముఖులతో పరిచయాలు కలసివస్తాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు పదోన్నతులుంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయండి. విష్ణుమూర్తి అష్టోత్తర నామాలను పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. వృథా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూలమైన సమయం కాదు. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. అరోగ్యవిషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం రామాలయాలను దర్శించండి. రామకోటి వంటివి రాయటం మంచిది. తారకమంత్రం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel