ఏప్రిల్ 16, నేటి రాశి ఫలాలు.. ఒక ఆపద నుంచి బయట పడతారు, ప్రయాణాల్లో జాగ్రత్త-april 16th 2024 today rasi phalalu check your zodiac signs result for daily horoscope in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఏప్రిల్ 16, నేటి రాశి ఫలాలు.. ఒక ఆపద నుంచి బయట పడతారు, ప్రయాణాల్లో జాగ్రత్త

ఏప్రిల్ 16, నేటి రాశి ఫలాలు.. ఒక ఆపద నుంచి బయట పడతారు, ప్రయాణాల్లో జాగ్రత్త

HT Telugu Desk HT Telugu
Apr 16, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ16.04.2024 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఏప్రిల్ 16, నేటి రాశి ఫలాలు
ఏప్రిల్ 16, నేటి రాశి ఫలాలు (freepik)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 16.04. 2024

వారం: మంగళవారం, తిథి : శు. అష్టమి

నక్ష్మత్రం : పునర్వసు, మాసం : చైత్రము

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని అమలుచేయండి. ఒక ఆపద నుంచి బయటపడతారు. గొడవలకు దూరంగా ఉండండి. ఖర్చులు నియంత్రించుకోవాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మేషరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వరునికి దీపారాధన చేయండి. రాహుకాల సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. పట్టుదలతో చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. భూ, గృహ, వాహన లాభాలున్నాయి. వ్యాపారస్తులకు అనుకూల సమయం. తోటివారి ప్రోత్సాహం ఉంటుంది. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. సమయస్ఫూర్తితో ఆపదల నుంచి బయటపడతారు. విద్యార్థులకు ఆశించిన ఫలితాలుంటాయి. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దుర్గాదేవిని పూజించటం మంచిది. దేవీ మంత్రాలు పఠించండి.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. మీ జీవిత భాగస్వామితో చిన్న విషయానికి వాగ్వివాదానికి గురయ్యే అవకాశముంది. చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యపరంగా తగు జాత్రలు తీసుకోవాలి. మిథునరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సుబ్రహ్మణ్యుని ఆలయం దర్శించటం మంచిది. రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కుటుంబముతో ఆనందముగా గడిపెదరు. వ్యాపారస్తులకు లాభదాయకం. మీరు అప్పులు ఇవ్వడం లేదా అప్పులు తీసుకోవడం మంచిది కాదు. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు అధికం. ఆరోగ్యం అనుకూలించును. ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. ఆంజనేయ స్వామి వారిని పూజించండి. అప్పాలను ఆంజనేయస్వామికి నివేదించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. క్రమంగా వృద్ధిలోకి వస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. గుర్తింపు, గౌరవం పెరుగుతాయి. వ్యాపారం కలసి వస్తుంది. తోటివారి సహకారంతో నూతన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. భూ గృహ వాహన ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దుర్గాదేవిని పూజించాలి. సుబ్రహ్మణ్యుని ఆలయాన్ని దర్శించడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు వృత్తి, వ్యాపారపరంగా అనుకూల సమయం. వృథా ఖర్చులుంటాయి. ఉద్యోగంలో ఆశించిన విధంగా ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. కొద్దిపాటి అనారోగ్య సమస్యలుంటాయి. మీ సొంత విషయాలలో ఇతరుల జోక్యం పనికిరాదు. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. కుటుంబ సమస్యలుంటాయి. కన్యారాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దుర్గాదేవిని పూజించడం, ఆరాధించడం మంచిది. రాహుకాల సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు ఉంటాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. విలాసవస్తువులు కోసం అధికంగా ఖర్చు చేస్తారు. కొందరు స్నేహితులు మోసగించే అవకాశముంది. విదేశాల్లో ఉద్యోగాలు ఆశిస్తున్న నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. ఆరోగ్యం అనుకూలించును. విద్యార్థులు విజయాన్ని అందుకుంటారు. తులా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

వృశ్చిక రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆదాయం పెరుగుతుంది. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. ఏదో ఒక సమస్య ఇబ్బందిపెడుతుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడిపెదరు. ఆరోగ్యం అనుకూలించును. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. వినాయకుడిని పూజించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. వృత్తి ఉద్యోగపరంగా అనుకూల సమయం. వ్యాపారస్తులకు లాభదాయకం. కుటుంబములో సుఖసంతోషాలుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ధనూ రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు పదోన్నతులుంటాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబసౌఖ్యం. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సాయంకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. గణపతి స్తోత్రం పఠించాలి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. కుటుంబ వ్యవహారాలు ప్రశాంతంగా ఉంటాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండిబాకీలు వసూలవుతాయి. ఇంటా బయటా శ్రమ ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు బాగా ఉపయోగించుకుంటారు. వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు చదువుల్లో కష్టపడాలి. కుంభ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం విఘ్నేశ్వరుడిని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులుంటాయి. శుభవార్తలు వింటారు. వృధా ఖర్చులుంటాయి. అనారోగ్య సమస్యలుంటాయి. ఇతరుల విషయాలో జోక్యం చేసుకోరాదు. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. మీన రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం రుణవిమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel