ఏప్రిల్ 14, నేటి రాశి ఫలాలు.. భూ, గృహ, వాహన యోగాలు.. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి-april 14th 2024 today rasi phalalu in telugu check all zodiac signs results in daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఏప్రిల్ 14, నేటి రాశి ఫలాలు.. భూ, గృహ, వాహన యోగాలు.. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి

ఏప్రిల్ 14, నేటి రాశి ఫలాలు.. భూ, గృహ, వాహన యోగాలు.. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి

HT Telugu Desk HT Telugu
Apr 14, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ14.04.2024 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఏప్రిల్ 14, నేటి రాశి ఫలాలు
ఏప్రిల్ 14, నేటి రాశి ఫలాలు (freepik)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 14.04. 2024

వారం: ఆదివారం, తిథి : షష్టి

నక్షత్రం : ఆరుద్ర, మాసం : చైత్రం,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. పేరు ప్రతిష్టలు దక్కుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. తీర్థయాత్రలు చేస్తారు. మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అనారోగ్య సమస్యలు అంతగా ఉండవు. విద్యార్థులకు కలసివస్తుంది. విదేశీయోగ యున్నది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి. భూ, గృహ, వాహన యోగాలు కలసివస్తాయి. కుటుంబ సభ్యులు అందరికీ మేలు జరుగుతుంది. మేష రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయాన్ని పఠించండి. సూర్య నమస్కారం వంటివి చేయటం వలన శుభఫలితాలు కలుగుతాయి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వస్త్ర, వస్తువులను కొనుగోలు చేస్తారు. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులు వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించాలి. వృత్తిపరంగా కష్టపడాల్సిన సమయం. విదేశీయోగం అనుకూలంగా ఉన్నది. ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించాలి. భూ, గృహ, వాహన యోగాలున్నాయి. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యాష్టకాన్ని పఠించండి. నవగ్రహ జపం చేయటం మంచిది.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. అన్ని విషయాలలో విజయం సాధిస్తారు. శత్రువులు మిత్రులుగా మారతారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పదవీయోగమున్నది. వ్యాపారంలో ధనలాభం రావచ్చు. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం అనుకూలించును. వృత్తి నైపుణ్యంతో ఉన్నత స్థితికి వెళతారు. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అరుణం పారాయణం చేయడం మంచిది. సూర్యభగవానుడికి తర్పణాలు వదలండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. వ్యాపారంలో రాణిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. సంతాన సౌఖ్యముంది. ధనలాభమున్నది. విద్యార్థులకు విదేశీయాన యోగమున్నది. భూ, గృహ, వాహన యోగాలు శుభఫలితాలిస్తాయి. మంచి జీవిత భాగస్వామి దొరుకుతారు. సంతోషం, మనశ్శాంతి ఉంటుంది. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సూర్యనారాయణ మూర్తిని పూజించండి. చంద్రశేఖరాష్టకం పఠించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వృత్తిపరంగా జాగ్రత్తగా వహిస్తే ఇబ్బందులుండవు. భూ, గృహ, వాహనాల విషయంలో బాగా ప్రయత్నించాలి. మనోధైర్యంతో వాళ్ళను అధిగమిస్తూ ముందుకు సాగాలి. విద్యార్థులకు పరీక్షల్లో మంచి ఫలితాలున్నాయి. సింహ రాశి వారికి మరింత శుభఫలితాలు పొందటం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. సూర్యాష్టకాన్ని పఠించడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు పదవీయోగమున్నది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు ధనలాభాలు బాగా ఉంటాయి. ఎంచుకున్న రంగంలో ప్రతిభ కనబరుస్తారు. విదేశీయాన ప్రయత్నాల్లో సఫలమవుతారు. పెట్టుబడులు కలసివస్తాయి. సంతానపరంగా శుభవార్త ఉంటుంది. కీర్తి, ప్రతిష్టలు లభిస్తాయి. విద్యార్థులు ఉన్నత విద్యల్లో రాణిస్తారు. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యభగవానుడిని పూజించి బెల్లం, పరమాన్నాన్ని నివేదించడం మంచిది. ఆలయాలను దర్శించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు అధికార లాభమున్నది. వ్యాపారంలో అధిక ధనలాభం ఉన్నది. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. తీర్ధయాత్రలు చేస్తారు. భూ, గృహ, వాహన యోగాలు కలసిరావచ్చు. సంతానవృద్ధి కలుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యపరంగా అనుకూల సమయం. తులా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. సూర్య నమస్కారాలు చేయాలి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు అధికారయోగమున్నది. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగుతాయి. వ్యాపారస్తులకు కలసివస్తుంది. వ్యవసాయదారులకు ఆశించిన లాభాలు వస్తాయి. భూ, గృహ, వాహన యోగాలున్నాయి. కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. వృశ్చిక రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాల్లో పూజలు వంటివి చేయాలి.

ధనూ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం ధనూ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగస్తులకు పదవీ సూచనలున్నాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. రుణ సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. సంతానం అభివృద్ధిని సాధిస్తారు. మానవత్వంతో కూడిన ఆలోచనలతో సఫలమవుతారు. సంతానం అభివృద్ధిని సాధిస్తారు. సమస్యలు తప్పుతాయి. కుటుంబసౌఖ్యం. ధనూ రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యాష్టకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబ సౌఖ్యం. ఉద్యోగస్తులకు పదోన్నతులుంటాయి. వేరు వేరు మార్గాల్లో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. బుద్ధిబలంతో మెప్పు పొందుతారు. విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. కష్టాలు తొలగుతాయి. కొందరికి ఆదర్శనీయులు అవుతారు. వ్యవసాయదారులకు లాభదాయకం. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ శాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్టకాన్ని పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఏకాగ్రతతో ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగాలి. ఉద్యోగస్తులు సకాలంలో పనిచేస్తే ఇబ్బందులు తప్పుతాయి. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం. ప్రయాణాలలో జాగ్రత్తలు వహించాలి. ధర్మబద్ధంగా వ్యవహరించాలి. సంతానంతో ఇబ్బందులు రాకుండా శాంతంగా వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. కుంభ రాశి మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విదేశీ ప్రయత్నాలు కలసివస్తాయి. తీర్థయాత్రలు చేస్తే మంచిది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. భూ, గృహ, వాహన యోగాలు మధ్యస్థం. విద్యార్థులు ఉన్నత విద్యల్లో బాగా కష్టపడాలి. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel