వైశాఖ మాసంలో కృష్ణ పక్షం ఏకాదశి నాడు అపర ఏకాదశి జరుపుకుంటారు. ఈ ఏడాది మే 23న జరుపుకోనున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం మే 23న వేకువజామున 1.12 గంటలకు ప్రారంభమై మే 23న ఉదయం 10.29 గంటలకు ముగుస్తుంది. మే 23న ఉదయ తిధి వస్తుంది కాబట్టి అపర ఏకాదశిని మే 23న జరుపుకుంటారు. అపర ఏకాదశి తరువాత నిర్జల ఏకాదశి వస్తుంది. అన్ని ఏకాదశులలో నిర్జల ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చెబుతారు. ఈ ఉపవాసాన్ని ఆచరించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు. దశమి రోజున ఏకాదశి పూర్తిగా లేకపోతే ఆ రోజు కాకుండా మరుసటి రోజు ఏకాదశి ఉపవాసం చేయాలి.
వైశాఖ మాసంలో ఏకాదశి కాబట్టి ఈ రోజున కూడా నీరు దానం చేయడం మంచిది, పుచ్చకాయ, పండ్లు ఈ రోజున దానం చేస్తే మంచిది. పేదలకు అన్నదానం చేస్తే కూడా ఎంతో పుణ్య ఫలితం ఉంటుంది. ఈ రోజున ఆహారం, నీటిని దానం చేయడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు.
దశమి రోజున అపర ఏకాదశి ఉపవాసం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ దశమి రోజు రాత్రి నుంచి ఆహారం తీసుకోకండి. ఈ రోజున అన్నదానం చేస్తే చాలా మంచిది. చాలా మంది ఈ రోజు ఉప్పు కూడా తినరు. ఈ రోజు పండ్లు తినడం ఉత్తమం.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.