Mars transit: అంగారక యోగం ముగియడంతో ఈ రాశుల వారికి శుభ ఘడియలు వచ్చాయి
Mars transit: జూన్ 1వ తేదీతో అంగారక యోగం ప్రభావం ముగిసిపోయింది. దీంతో కొన్ని రాశుల వారికి శుభ ఘడియలు వచ్చాయి. అనుకున్నవన్నీ నెరవేరతాయి. వ్యాపారంలో లాభాలు అందుతాయి.
Mars transit: నవగ్రహాలలో నీడ గ్రహమైన రాహువుతో కుజుడు కలవడం వల్ల అంగారక యోగం ఏర్పడింది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి చెడు ప్రభావాలు ఎదురయ్యాయి. దాని నుంచి జూన్ నెలతో విముక్తి కలిగింది. ధైర్యం, శౌర్యం, పరాక్రమానికి ప్రతీకగా భావించే కుజుడు జూన్ 1వ తేదీ మీన రాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశించాడు.
మీన రాశి నుంచి కుజుడు నిష్క్రమించడం వల్ల అంగరాక యోగం అంతరించింది. అంగారకుడు జులై 12వరకు మేష రాశిలో ఉండి తర్వాత వృషభ రాశికి వెళతాడు. జ్యోతిష్య శాస్త్రంలో అంగారక యోగం శుభప్రదమైనదిగా పరిగణించరు. దీని ప్రభావంతో జీవితంలో అనేక కష్టాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ యోగం ముగియడంతో కొన్ని రాశుల వారికి సంతోషం, శ్రేయస్సు రెట్టింపు అవుతుంది. ఏ రాశుల వారికి కుజుడి సంచారం అదృష్టాన్ని ప్రసాదిస్తుందో చూడండి.
మేష రాశి
మేష రాశిలోనే అంగారక సంచారం జరిగింది. ఇది మీకు చాలా శుభప్రదంగా మారింది. జీవితంలో వచ్చే సమస్యలన్నీ తగ్గిపోతాయి. కెరీర్ పరంగా ఆశించిన ఫలితాలు పొందుతారు. దీనితో పాటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వాళ్ళు లాభంతో పాటు వ్యాపారంలో విజయం సాధిస్తారు. జీవితంలోని ప్రతి దశలో జీవిత భాగస్వాములు, కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి చూపిస్తారు. పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత పాటించాలి. ఈ సమయంలో పాజిటివ్ ఎనర్జీతో అడుగులు ముందుకు వేసి అనుకున్నవి సాధించుకుంటారు. ఈ కాలం చాలా ఉత్పాదకంగా ఉంటుంది.
సింహ రాశి
సింహ రాశి వారికి అంగారక యోగం ముగింపు ప్రయోజనకరంగా ఉంటుంది. దీని వల్ల అనేక లాభాలు పొందుతారు. కుజుడు సింహ రాశి తొమ్మిదో ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది అదృష్టాన్ని ఇస్తుంది. దీని ఫలితంగా సమస్యల్లో కూరుకుపోయిన పనులన్నీ నెరవేరబోతున్నాయి. అందులో విజయం కూడా మీదే అవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబంలో వాతావరణం సంతోషంగా, మంచిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితిలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. పనికి సంబంధించి విదేశాలకు కూడా వెళ్లాల్సి వస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ధనం వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కర్కాటక రాశి
అంగారక యోగం ముగియడంతో కర్కాటక రాశి వారికి శుభ ఘడియలు ప్రారంభమయ్యాయి. కుజుడి సంచారం నుంచి ఈ రాశి జాతకులు అధిక ప్రయోజనాలు పొందుతారు. మేష రాశిలో అంగారక సంచారం వీరికి చాలా అదృష్టం ఇస్తుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా రెండింటిలోనూ విజయం సాధించబోతున్నారు. వ్యాపారస్తులు లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. డబ్బు, ఆస్తికి సంబంధించి మీరు వేసుకున్న కొన్ని వ్యూహాలు ఇప్పుడు నెరవేరతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగం మారేందుకు ఇది అనువైన సమయం. వ్యాపారులకు పాట పెట్టుబడుల నుంచి మంచి రాబడి లభిస్తుంది. వృత్తిలో మీకు ప్రశంసలు, గౌరవం లభిస్తుంది. ఉత్సాహంతో ప్రతి పని పూర్తి చేస్తారు.