వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సంతోషంగా ఉండడానికి అవుతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇబ్బందుల నుంచి కూడా బయటపడొచ్చు. చాలామంది చనిపోయిన పూర్వికుల ఫోటోలను సరైన దిశలో ఉంచరు. కానీ, వాస్తు ప్రకారం సరైన దిశలో ఉంచినట్లయితే సమస్యల నుంచి బయటపడవచ్చు.
వాస్తు దోషాలు వంటివి కూడా కలగవు. ఇక ఈరోజు చనిపోయిన పూర్వీకుల ఫోటోలను ఏ దిశలో ఉంచితే మంచిది, ఎటువంటి తప్పులు చేయకూడదు, వాస్తు ప్రకారం పాటించాల్సిన నియమాలు ఏంటి అనేది తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం చనిపోయిన పూర్వీకుల ఫోటోని బెడ్ రూమ్ లో లేదా డ్రాయింగ్ రూమ్ లో ఉంచడం మంచిది కాదు. ఇలా పెడితే మీ కుటుంబీకుల ఆరోగ్య పరిస్థితి పై ప్రభావం చూపిస్తుంది. మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. కుటుంబంలో ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. గొడవలు కూడా ఎక్కువగా జరగవచ్చు.
వాస్తు ప్రకారం చనిపోయిన పూర్వికుల ఫోటోలను దక్షిణం వైపు పెడితే మంచిది. ఇది యమ్మ ధర్మరాజు దిక్కు. ఇలా ఈ దిశలో పెడితే, ఎటువంటి వాస్తు దోషాలు లేదా ఇబ్బందులు కలగవు.
ఫోటో దక్షిణం వైపు ఉండి, ఫోటోలో ఉన్న వారి ముఖం ఉత్తరం వైపు ఉండేటట్టు పెట్టాలి. అలా చేస్తే సానుకూల శక్తి కలిగి, సంతోషంగా ఉండవచ్చు.
వాస్తు ప్రకారం ఒకటి కంటే ఎక్కువ ఫోటోలను పెట్టడం మంచిది కాదు. అలా చేయడం వలన ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల పనుల్లో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.