Tulasi Puja Sunday: ఆదివారం రోజు తులసి మొక్క దగ్గర దీపం పెట్టకూడదా? పెడితే ఏమవుతుంది?
Tulasi Puja Sunday: పవిత్రమైన తులసి మొక్క పూజించడానికి చాలా నియమాలు ఉన్నాయి. అందులో ఒకటి తులసి మొక్క దగ్గర దీపం పెట్టడం. రండి అసలు ఆదివారం తులసి మొక్క దగ్గర దీపం పెట్టొచ్చో లేదో తెలుసుకుందాం.
హిందూ ధర్మం ప్రకారం తులసి మొక్క మహిమతో కూడినది, ఆరాధించ తగ్గది. కానీ శాస్త్రాలలో తులసి పూజ చేయడం గురించి చాలా నియమాలు పొందుపరిచారు. అందులో ఈ మొక్కను శుభ్రంగా పెంచడం ఒకటి అయితే భక్తి శ్రద్ధలతో ఆరాధించి తులసి దగ్గర దీపం పెట్టడం మరొకటి. ఇది కొన్ని శతాబ్దాలుగా వస్తున్న ఆచారం. అయినప్పటికీ చాలామందిలో ఆదివారం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించవచ్చా లేదా అనే సందేహం మాత్రం అలానే ఉండిపోయింది. ఆదివారం రోజు తులసి మొక్క దగ్గర దీపం పెట్టకూడదా.. పెడితే ఏమవుతుంది? తెలుసుకుందాం.
గ్రంథాల్లో పొందుపరిచిన సమాచారం ప్రకారం తులసి మొక్క ఒక పవిత్రమైనది. హిందువులు తులసిని సాక్షాత్ లక్ష్మీ దేవిగా భావించి పూజిస్తుంటారు. మహిమతో కూడిన ఈ మొక్కకు ప్రతిరోజు దీపం పెట్టి పూజ చేస్తుంటారు. కార్తీక మాసంలోనైతే తులసి మొక్కను ప్రత్యేకంగా అలంకరించి ఆరాధిస్తుంటారు. తులసికి, శాలిగ్రాముడికి వివాహం కూడా చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగించడంతో పాటు నైవేద్యం కూడా ఉంచి కొలుస్తారు. ఈ విధంగా తులసి మొక్క దగ్గర ప్రతిరోజు దీపారాధన చేయొచ్చా అంటే కాదని చెబుతున్నాయి శాస్త్రాలు. ముఖ్యంగా ఆదివారం రోజున తులసి మొక్క మరింత మహత్తుతో కూడి ఉంటుంది. అయినప్పటికీ ఆ రోజు దీపం పెట్టడం అశుభ ఫలితాలు ఇస్తుందట. దాని వెనుక కారణాలు ఏమై ఉండొచ్చు. రండి ఒకసారి ఈ విషయం గురించి మరింత తెలుసుకుందాం.
తులసి మొక్క దగ్గర దీపం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి ఇంట్లో తులసి మొక్కను నాటి, రోజూ పూజ చేయడం అనేది తప్పనిసరి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం పొంది, ఆ ఇంట సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయి. ఫలితంగా ఆయురారోగ్యాలతో ఉంటారని పెద్దలు చెబుతుంటారు. కానీ శాస్త్రాల్లో ప్రస్తావించిన దాని ప్రకారం తులసి మొక్కకు కొన్ని సందర్భాల్లో దీపం పెట్టకపోవడమే మంచిది. ఆదివారం నాడు తులసి మొక్కకు దీపం వెలిగించకూడదు. ఎందుకంటే ఆ రోజు తులసీమాత విష్ణు భగవానుడు కోసం కటిక ఉపవాసం చేస్తుంది. అదే రోజు మొక్కకు నీరు పెట్టి దీపం వెలిగిస్తే తులసి దీక్ష భగ్నమై, వ్రత భంగం కలుగుతుంది. అంతేకాకుండా తులసి మాతను పూజించిన వారికి పూజాఫలం కూడా దక్కదు. తులసి ఆగ్రహానికి గురై వివాహితుల మధ్య గొడవలు తలెత్తుతాయట.
అందుకే జ్యోతిష్య శాస్త్రంలో ఆదివారం రోజు తులసి మొక్కకు దీపం పెట్టడాన్ని నిషేధించారు. ఆరోజు దీపం పెట్టడం మాత్రమే కాదు తులసి మొక్కను స్పర్శించకూడదు కూడా. ఇక సూర్యాస్తమ సమయంలో లేదా సాయంత్రం సమయంలో తులసి మొక్కకు దీపం పెట్టకూడదనే విషయం గుర్తుంచుకోవాలి.ఇవేమీ పట్టించుకోకుండా ఒకవేళ ఆ సమయంలోనూ ఎవరైనా తులసిని పూజిస్తే వారి పూజ స్వీకరించడం జరగదు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.