అమావాస్య రోజున పితృ దేవతలకు తర్పణం చేయడం చాలా ముఖ్యమైన కార్యం. ఈ రోజున పితృదేవతలు భూమిని సందర్శిస్తారనే నమ్మకం ఉంది. తర్పణం ద్వారా మనము పితృలకు జలాంజలి సమర్పించి, వారి ఆశీర్వాదాలను పొందుతాము.
పితృదేవతల తృప్తి, కులవృద్ధి, కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, పితృదోష నివారణ అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలియజేసారు.
ఒక చేతిలో (సాధారణంగా కుడి చేతిలో) జలం, నువ్వులు, దర్భలు, అక్షింతలు తీసుకొని, అపవిత్ర జలం (అంజలి) వామహస్తం లేదా అంగుళి ద్వారా తర్పణం చేయాలి. పితృదేవతల పేర్లను లేదా పితృభ్యః స్వధాయై నమః అని మంత్రం జపిస్తూ జలాన్ని విడిచి వేయాలి.
1. పితామహ (తండ్రి)
2. పితామహి (తండ్రి తండ్రి)
3. ప్రపితామహ (తండ్రి తండ్రి తండ్రి)
తర్పణం అనంతరం పితృ స్తుతి లేదా విష్ణు స్మరణ చేసుకుంటారు.
ఆచమ్య... పుణ్యతిదౌ... ప్రీత్యర్థం.... ప్రయుక్తపుణ్యకాలే దేవర్షి పిత్రూ సుద్దిశ్య దేవర్షి పితృ ప్రీత్యర్థం దేవర్షి పితృతర్పణం కరిష్యే (ఇతి సంకల్పః).
గమనిక: ప్రతి మంత్రం చివర "తర్పయామి" అని ఒకసారి లేదా రెండు మూడు సార్లు చెప్పాలి. ప్రతి సారి ఒక ఉద్ధరిణెడు నీరు "తర్పయామి" అన్న తరువాత వదిలి పెట్టాలి అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
బ్రాహ్మెదయో యే దేవాః తాన్ దేవగణాన్ తర్పయామి.
సర్వాన్ దేవాన్తర్పయామి.
సర్వాన్ దేవగణాన్ తర్పయామి.
సర్వాన్ దేవపత్నీః తర్పయామి.
సర్వాన్ దేవపుత్రాన్ తర్పయామి.
సర్వాన్ దేవపౌత్రాన్ తర్పయామి.
భూర్దేవాన్ తర్పయామి.
భువర్దేవాన్ తర్పయామి.
సువర్దేవాన్ తర్పయామి.
భూర్బువఃసువర్దేవాన్ తర్పయామి.
(ఇక్కడ యజ్ఞోపవీతాన్ని మాలగా ధరించాలి)
అథ కృష్ణ ద్వైపాయనాదయో యే ఋషయః తాన్ ఋషీన్తర్పయామి, తర్పయామి.
సర్వాన్ ఋషీగణాన్ తర్పయామి, తర్పయామి.
సర్వాన్ ఋషీపత్నీః తర్పయామి, తర్పయామి.
సర్వాన్ ఋషీపుత్రాన్ తర్పయామి, తర్పయామి.
సర్వాన్ ఋషీపౌత్రాన్ తర్పయామి, తర్పయామి.
భూర్ఋషీన్తర్పయామి, తర్పయామి.
భువర్ఋషీన్తర్పయామి, తర్పయామి.
సువర్ఋషీన్తర్పయామి, తర్పయామి.
భూర్భువఃసువర్ఋషీన్తర్పయామి, తర్పయామి.
కాండఋషీ తర్పణం:
రౌంద్ర ఋషీన్తర్పయామి, తర్పయామి.
ప్రజాపతిం కాండఋషీం తర్పయామి, తర్పయామి.
సోమం కాండఋషీం తర్పయామి, తర్పయామి.
అగ్నిం కాండఋషీం తర్పయామి, తర్పయామి.
సర్వాన్ దేవాన్ కాండఋషీగణాన్ తర్పయామి, తర్పయామి.
ఇలా పితృదేవతలకు తర్పణం చేయడం చాలా ముఖ్యమైన కార్యమని ప్రముఖ ఆధ్యాత్మికవేత, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేసారు.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ- 9494981000