అక్షయ తృతీయ వేళ ఈ రాశి వారికి ఊహించని లాభాలు.. ధనం, శుభకార్యాలు, ప్రముఖులతో పరిచయాలు ఇలా ఎన్నో!-akshaya tritiya rasi phalalu mesha rasi to meena rasi april 29th tuesday check your horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  అక్షయ తృతీయ వేళ ఈ రాశి వారికి ఊహించని లాభాలు.. ధనం, శుభకార్యాలు, ప్రముఖులతో పరిచయాలు ఇలా ఎన్నో!

అక్షయ తృతీయ వేళ ఈ రాశి వారికి ఊహించని లాభాలు.. ధనం, శుభకార్యాలు, ప్రముఖులతో పరిచయాలు ఇలా ఎన్నో!

HT Telugu Desk HT Telugu

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 30.04.2025 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు (pinterest)

రాశిఫలాలు (దిన ఫలాలు) : 30.04.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: చైత్ర, వారం : బుధవారం, తిథి : శు. తదియ, నక్షత్రం : రోహిణి

మేష రాశి

మేష రాశి వారికి లావాదేవీలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆలోచించి ముందుకు సాగండి. తొందరపాటు నిర్ణయం తగదు. ఒత్తిళ్లకు గురికావద్దు. పనులు అస్త వ్యస్తంగా సాగుతాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆప్తులకు మీ ఇబ్బందులు తెలియజేయండి. పత్రాలు అందుకుంటారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పిల్లల చదువులపై దృష్టి సారిస్తారు.

వృషభ రాశి

వృషభ రాశి వారికి అన్ని విధాలా యోగదాయకమే. అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. మీ జోక్యం అనివార్యం. ఏకాగ్రతతో బాధ్యతలు నిర్వహించండి. దుబారా ఖర్చులు విపరీతం. కీలక పత్రాలు అందుకుంటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి.

మిధున రాశి

మిధున రాశి వారి కృషి ఫలిస్తుంది. ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. అను రాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మీ ఇష్టాయిష్టాలను వెంటనే తెలియజేయండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. వాహనం కొనుగోలు చేస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొందరి అతి చౌరవ ఇబ్బంది కలిగిస్తుంది. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి కలిసివచ్చే సమయం. నిరుత్సాహం వీడి శ్రమించండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. అర్దాంతరంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. వేడుకను ఘనంగా చేస్తారు. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది.

సింహ రాశి

సింహ రాశి వారి పరిస్థితులు చక్కబడతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. వేదికలు అన్వేషిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. ఆప్తులతో తరచూ సంభాషిస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వా దాలకు దిగవద్దు. పిల్లల ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.

కన్య రాశి

కన్య రాశి వారి గ్రహస్థితి అనుకూలంగా లేదు. ప్రతి విషయంలోనూ ఆప్రమత్తంగా ఉండాలి. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. రావలసిన ధనం లౌక్యంగా రాబట్టుకోవాలి. ఖర్చులు అధికం. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. బాధ్యతలు అప్పగించవద్దు. చర్చల్లో పాల్గొంటారు.

తుల రాశి

తుల రాశి వారు సంతోషకరమైన వార్త వింటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దైర్యంగా ముందుకెడతారు. ఆదాయా నికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ధన సహాయం తగదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. బాధ్యతల నుంచి తప్పు కుంటారు. పిల్లలకు శుభపరిణామాలున్నాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు వ్యవహారాల్లో ఒత్తిడికి గురి కావద్దు. ఉత్సాహంగా శ్రమించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఖర్చులకమైనా ప్రయోజనకరం. పనులు ఒక పట్టాన సాగవు. గృహమరమ్మతులు చేపడతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. మీ చొరవతో ఒక శుభకార్యం నిశ్చయమవుతుంది. కొత్త పరిచయాలు లేర్పడతాయి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. శుభకార్యం నిశ్చయమవుతుంది. కొత్త పరిచయాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. చెల్లింపులు, పత్రాల రెన్యువల్ అలక్ష్యం తగదు. మీ ఏమరు పాటుతనం ఇబ్బందులకు దారితీస్తుంది. పిల్లల విజయం సంతోషం కలిగిస్తుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.

మకర రాశి

సర్వత్రా అనుకూలదాయకం. దీక్షతో శ్రమించి లక్ష్యం సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఆదాయం సంతృప్తికరం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పెద్దమొత్తం ధన సహాయం తగదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు.

కుంభ రాశి

కుంభ రాశి వారు లావాదేవీల్లో ఆప్రమత్తంగా ఉండాలి. సలహాలు ఆశించవద్దు. వ్యతిరేకులు తప్పుదారి పట్టిస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. గృహనిర్మాణం పూర్తవుతుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. మీ చొరవతో ఒకరికి లబ్ది చేకూరుతుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.

మీన రాశి

అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. చేపట్టిన పనులు ఆలస్యంగానైనా పూర్తి చేయగల్గుతారు, ఖర్చులు విపరీతం, రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పిల్లల భవిష్యత్తుపై దృష్టిపెడతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000