Mars transit: రెండేళ్ల తర్వాత శుక్రుడి నక్షత్రంలోకి కుజుడు.. ఈ రాశులపై సంపద వర్షం-after two years mars transit in rohini nakshtram three zodiac signs get full of bags with money ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mars Transit: రెండేళ్ల తర్వాత శుక్రుడి నక్షత్రంలోకి కుజుడు.. ఈ రాశులపై సంపద వర్షం

Mars transit: రెండేళ్ల తర్వాత శుక్రుడి నక్షత్రంలోకి కుజుడు.. ఈ రాశులపై సంపద వర్షం

Gunti Soundarya HT Telugu
Jul 23, 2024 03:02 PM IST

Mars transit: కుజుడు వృషభరాశిలో ఉన్నాడు, కృత్తికా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. 3 రోజుల తరువాత అంగారకుడు శుక్రుని నక్షత్రరాశిలో సంచరిస్తాడు. దీని కారణంగా కొన్ని రాశిచక్ర గుర్తులపై సంపద వర్షం కురుస్తుంది.

శుక్రుడి నక్షత్రంలోకి కుజుడు
శుక్రుడి నక్షత్రంలోకి కుజుడు

Mars transit: అన్ని గ్రహాలకు అధిపతిగా అంగారకుడిని భావిస్తారు. నవగ్రహాలలో మంగళకరమైన గ్రహంగా పిలుస్తారు. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు రాశి మారడమే కాకుండా నక్షత్రం మారడం కూడా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ధైర్యం, పరాక్రమం, శౌర్యం వంటి వాటికి అంగారకుడు ప్రతీకగా నిలుస్తాడు. జాతకంలో కుజుడు శుభ స్థానంలో ఉంటే వారి జీవితమే మారిపోతుంది.

అంగారకుడు నక్షత్రాన్ని మార్చడం వల్ల మొత్తం 12 రాశిచక్రాలపై సానుకూల, ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. కుజుడు ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. 45 రోజుల తర్వాత వృషభ రాశిని వీడి మిథున రాశిలోకి అడుగుపెడతాడు. ఇక అంగారకుడు మొన్నటి వరకు కృత్తిక నక్షత్రంలో సంచరించాడు.

జూలై 22న రోహిణి నక్షత్రంలో కుజుడు ప్రవేశించి తన ప్రయాణం ప్రారంభించాడు. దృక్ పంచాంగ్ ప్రకారం కుజుడు సుమారు 2 సంవత్సరాల తర్వాత ఈ నక్షత్రంలోకి ప్రవేశించాడు. రోహిణీ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. దీని వల్ల శుక్రుడి శుభ ప్రభావం కూడా కుజుడి వల్ల లాభపడే రాశుల మీద పడుతుంది. అటువంటి పరిస్థితిలో శుక్రుని రాశిలో కుజుడు సంచరించడం వల్ల ఏ రాశుల వారు అద్భుతమైన ప్రయోజనాలను పొందగలరో తెలుసుకుందాం.

మేష రాశి

శుక్రుడి నక్షత్రంలో కుజుడి సంచారం మేష రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకున్న కార్యాలన్నీ పూర్తి చేస్తారు. కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన మీ పని ఇప్పుడు ఊపందుకుంటుంది. సంపద పెరిగే అవకాశం కూడా ఉంది. మీరు మీ తల్లి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని శుభవార్తలను అందుకుంటారు. అదే సమయంలో వ్యాపారవేత్తలకు ఈ సమయం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కొత్త ఒప్పందాలు వ్యాపారుల చేతికి అందుతాయి. ఇవి పూర్తి లాభదాయకంగా ఉంటాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి కుజుడి నక్షత్ర సంచారం అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది. ఇది మాత్రమే కాకుండా కుజుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. దీని వల్ల ఈ రాశి వాళ్ళు డబుల్ లాభాలు అందుకోబోతున్నారు. న్యాయపరమైన విషయాల్లో మీరు విజయం సాధించవచ్చు. వ్యాపారం చేసే వారికి శుభవార్తలు అందుతాయి. ఆత్మవిశ్వాసం నిండుగా ఉంటుంది. ఆస్తిలో ఏదైనా పాత పెట్టుబడి లాభాలను తీసుకురావడం వల్ల మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవలసి రావచ్చు. అదే సమయంలో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి.

మకర రాశి

అంగారకుడి నక్షత్ర మార్పు మకర రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు మీ కుటుంబం, పూర్వీకుల నుండి ఆశీర్వాదం పొందుతారు. అంగారకుడి అనుగ్రహంతో సమాజంలో మీ స్థానం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధైర్యం, శక్తి సామర్థ్యాలు మెరుగుపడతాయి. వ్యాపారంలో నెలకొన్న సమస్యలు తొలగిపోయి లాభాలను పొందుతారు. డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా క్రమంగా సమసిపోతాయి.

నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించండి.

Whats_app_banner