ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. మనం సంతోషంగా ఉండాలంటే, మన ఇంట్లో లక్ష్మీదేవి కూడా ఉండాలి. లక్ష్మీదేవి మన ఇంటి నుంచి దూరంగా ఉంటే, అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటాము. వాస్తు శాస్త్రం ప్రకారం, ప్రతి ఒక్క వస్తువుకీ కూడా ఏదో ఒక ఎనర్జీ ఉంటుంది. సానుకూల శక్తి లేదా ప్రతికూల శక్తిని కలిగి ఉంటాయి. కొన్ని వస్తువులను సాయంత్రం సమయంలో ఇంటికి తెచ్చుకోవడం వలన, శుభ ఫలితాలను పొందవచ్చు.
సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంటికి వీటిని తెచ్చుకుంటే, సానుకూల మార్పులను చూడవచ్చు. అదృష్టం కూడా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో కొలువై ఉంటుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన, చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడవచ్చు. వాస్తు ప్రకారం అనుసరిస్తే, ఎలాంటి ప్రతికూల శక్తి ఉన్నా సరే తొలగిపోతుంది, సానుకూల శక్తి వ్యాపిస్తుంది.
వాస్తు ప్రకారం సానుకూల శక్తిని పొందడానికి, ధనం, సంతోషం కలగడానికి ఈ మార్పులు చేయండి. వాస్తు ప్రకారం ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడు ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుంది. అలాగే లక్ష్మీదేవి కూడా ఆ ఇంట్లో ఉంటుంది. అదృష్టం, సంతోషం, ధనం, సానుకూల శక్తిని పొందవచ్చు.
వాస్తు ప్రకారం సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటే మంచిది. దీనిని ఉత్తరం వైపున పెట్టాలి. ఇలా చేయడం వలన మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది. లక్ష్మీదేవిని ఆరాధించిన తర్వాత, పరవన్నం నైవేద్యంగా పెట్టండి.
లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండాలంటే, సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత ఒక చిన్న కొబ్బరికాయను ఇంట్లోకి తీసుకురండి. దీని వలన ధనం, సంపద కలుగుతాయి. శుక్రవారం నాడు తీసుకు వస్తే మరీ మంచిది. లక్ష్మీదేవిని పూజించి, చిన్న కొబ్బరికాయను ఇంటికి తీసుకువచ్చి, ఆ కొబ్బరికాయను ఎర్రటి వస్త్రంలో చుట్టి, డబ్బులు దాచుకునే చోట పెట్టండి. ఇక ధన ప్రవాహం పెరుగుతుంది.
ఇంట్లో ఉంటే కూడా మంచి జరుగుతుంది. లాఫింగ్ బుద్ధాను ఇంట్లో పెట్టడం వలన, సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ధనం కూడా కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. లాఫింగ్ బుద్ధాను ఇంట్లో పెట్టేటప్పుడు ఈశాన్యం వైపు పెట్టడం మంచిది. ఇది మంచి ఫలితాన్ని అందిస్తుంది. బాధలు అన్నిటిని తొలగిస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.