Venus transit: సంపద దాతగా పిలిచే శుక్రుడు త్వరలో తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. జూన్ ప్రారంభంలో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రుని రాశిలో శుక్రుడు సంచరించడం వల్ల ఆ ప్రభావం 12 రాశుల మీద కనిపిస్తుంది.
శుక్రుడు ప్రస్తుతం మిథున రాశిలో సంచరిస్తున్నాడు. వారం రోజుల తరువాత శుక్రుడు తన రాశిని మారుస్తాడు. 07 జూలై 2024న, శుక్రుడు సాయంత్రం 04:15 గంటలకు చంద్రుని రాశి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా కొన్ని రాశులకు డబ్బు వర్షం పడుతుంది. మరికొన్ని రాశుల వాళ్ళు సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ శుక్రుడి సంచారము వలన కొన్ని రాశుల వారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు.
జూలై 30 వరకు శుక్రుడు ఈ రాశిలో ఉంటాడు. ఆ తర్వాత 31 జూలై 2024న శుక్రుడు సింహరాశిలో సంచరిస్తాడు.జాతకంలో శుక్రుని స్థానం బలంగా ఉంటే ఆ వ్యక్తి వారి జీవితంలో సరైన సంతృప్తిని పొందవచ్చు. మనస్సు బలంగా ఉంటుంది. శుక్రుడి అనుగ్రహంతో జీవితంలో ఆనందం పొందుతారు. అన్నీ సుఖాలను అనుభవిస్తారు. మంచి మొత్తంలో డబ్బు సంపాదించగలుగుతారు. ఆరోగ్యం కూడా స్థిరంగా ఉంటుంది. శుక్రుని సంచారంతో ఏ రాశుల వారికి మంచి రోజులు రాబోతున్నాయో తెలుసుకుందాం.
శుక్రుడు చంద్రుడి రాశిలోకి మారడం వల్ల వృశ్చిక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ కార్యాలయంలో పెట్టుబడి పెట్టడానికి మంచి ఒప్పందాన్ని పొందవచ్చు. అది కూడా లాభదాయకంగా ఉంటుంది. మీరు విహారయాత్రకు కూడా వెళ్ళవచ్చు. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. జీవితంలో శృంగారం అలాగే ఉంటుంది. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల చాలా ఆసక్తిని కలిగి ఉంటారు.
శుక్రుడు పదవ ఇంట, ఆదాయ గృహంలో సంచరిస్తాడు. కర్కాటకంలో శుక్రుని సంచారం తుల రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. సంతోషం, శాంతి కారణంగా ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు మీ ప్రేమికుడితో డేటింగ్‌కు కూడా వెళ్లవచ్చు. మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త వనరులు లభిస్తాయి. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులు తమ రంగాలలో లాభాలు, పురోగతిని ఆశించవచ్చు. స్థిరాస్తిలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. తులా రాశి వారు దీర్ఘకాలిక లాభాలను ఆర్జించే ఆస్తిలో పెట్టుబడి పెట్టవచ్చు.
శుక్రుడు వారి లగ్న గృహంలో మాత్రమే సంచరిస్తాడు. కర్కాటక రాశి వారికి ఈ శుక్ర సంచారము శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ రాశిలోనే శుక్రుడి సంచారం జరగబోతుంది. ఈ కాలంలో మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. శృంగారం, ఆకర్షణ జీవితంలో నిలిచిపోతాయి. షార్ట్ ట్రిప్ కి కూడా వెళ్లే అవకాశం ఉంది. మీరు మీ కెరీర్‌లో కొత్త పనులను పొందవచ్చు. మీరు వృత్తిపరంగా, ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. ఈ రాశి వారికి కెరీర్‌లో అపారమైన విజయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారు డబ్బును ఆదా చేయగలుగుతారు. ఆకస్మిక ఆర్థిక లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.