దసరా నవరాత్రులు సమీపిస్తున్నాయి. నవరాత్రులు తర్వాత ఆ శని,చంద్రుల సంయోగం కారణంగా విష యోగం ఏర్పడుతుంది. ఈ విష యోగం కారణంగా కొన్ని రాశుల వారు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొత్తం 12 రాశుల వారిపై ఈ యోగం ప్రభావం చూపించగా, కొన్ని రాశుల వారికి మాత్రం సమస్యలు ఎదురవుతాయి. శని న్యాయదేవుడు.
కర్మలను బట్టి శని దేవుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మంచి చేస్తే మంచి ఫలితాలను అందుకోవాలి. అదే చెడు చేస్తే చెడు ఫలితాలను ఎదుర్కోక తప్పదు. చంద్రుడు చాలా వేగంగా కదిలే గ్రహం. త్వరగా రాశులను మారుస్తూ ఉంటాడు.
ఈ రెండు గ్రహాల సంయోగం కారణంగా కొన్ని రాశుల వరకే నవరాత్రి తర్వాత కష్టాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ విష యోగం వలన ఏ రాశుల వారికి ఇబ్బందులు రావచ్చు అనేది తెలుసుకుందాం.
కుంభ రాశి వారికి శని–చంద్రుల సంయోగంతో ఏర్పడే విష యోగం అశుభఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుంభ రాశి వారు అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పనులు పూర్తవక ఇబ్బంది పడతారు. పనులను మధ్యలోనే వదిలేయాల్సి వస్తుంది.
ఆర్థికపరంగా కూడా సమస్యలు రావచ్చు. ఓపికగా ఉండాలి మరియు జాగ్రత్తగా వ్యవహరించాలి. శత్రువు ముప్పు కూడా ఈ సమయంలో పెరుగుతుంది. ఏదైనా పనిని మొదలు పెట్టడానికి హనుమంతుడిని ఆరాధించండి.
మేష రాశి వారికి కూడా ఈ విష యోగం అశుభ ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి 12వ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అకస్మాత్తుగా డబ్బును కోల్పోయే ఛాన్స్ ఉంది. ఆర్థిక ఇబ్బందులు రావచ్చు.
భయం, ఆందోళన, మానసిక శాంతి లోపంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కష్టపడి పని చేసినప్పటికీ డబ్బు సంపాదించ లేకపోవచ్చు. ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్తగా ఉండాలి. హనుమంతుడిని పూజిస్తే కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మీన రాశి వారికి ఈ విష యోగం చిన్నపాటి ఇబ్బందులను తీసుకువస్తుంది. అశుభ సంఘటనలు జరగవచ్చు. శని మీన రాశిలో ఉండడం, అక్టోబర్ 6న చంద్రుడు కూడా మీన రాశిలోకి వెళ్లడం జరుగుతుంది. ఇలా ఈ రెండు గ్రహాల సంయోగంతో ఆకస్మిక ఆర్థిక ఇబ్బందులు వస్తాయి.
ఆర్థిక జీవితం సమస్యలతో నిండి ఉంటుంది. రుణాలు తీసుకునే పరిస్థితి కూడా ఎదురవుతుంది. శని ప్రభావం తగ్గించడానికి కొన్ని వస్తువులను దానం చేయడం, హనుమంతుని ఆరాధించడం మంచిది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.