Mercury retrograde: బుధుడి తిరోగమనంలో ఒక నెల తరువాత ఈ రాశుల వారిపై ధన వర్షం-after a month of mercurys retrograde money will shower on these zodiac signs ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mercury Retrograde: బుధుడి తిరోగమనంలో ఒక నెల తరువాత ఈ రాశుల వారిపై ధన వర్షం

Mercury retrograde: బుధుడి తిరోగమనంలో ఒక నెల తరువాత ఈ రాశుల వారిపై ధన వర్షం

Haritha Chappa HT Telugu
Jul 08, 2024 01:20 PM IST

Mercury retrograde: జ్యోతిష లెక్కల ప్రకారం 2024 ఆగస్టు 5న గ్రహాల రాకుమారుడు బుధుడు సింహరాశిలో తిరోగమనంలో ఉంటాడు. దీని వల్ల సింహరాశితో సహా కొన్ని రాశుల వారు ఈ శుభ ఫలితాలు చూసే అవకాశం ఉంది.

రాశి ఫలాలు
రాశి ఫలాలు

వైదిక జ్యోతిషశాస్త్రంలో గ్రహాల కదలికకు చాలా ప్రాముఖ్యత ఉంది. బుధుడి తిరోగమనం వల్ల మేషం నుండి మీన రాశి వరకు 12 రాశులపై శుభ, అశుభ ప్రభావాలు ఉంటాయని నమ్ముతారు. ఇటీవల శని దేవడు కుంభ రాశిలో తిరోగమనం చెందాడు. పంచాంగం ప్రకారం శని తర్వాత బుధ గ్రహం ఇప్పుడు తిరోగమనం చెందబోతోంది. ఆగస్టు 5, 2024 న గ్రహాల రాకుమారుడు బుధుడు సింహ రాశిలో తిరోగమనంలోకి వస్తాడు. ఆగస్టు 24, 2024 తెల్లవారుజామున 2:43 గంటల వరకు తిరోగమనంలో ఉంటుంది. కొన్ని రాశులవారు బుధుడి రివర్స్ కదలిక వల్ల చాలా ప్రయోజనం పొందుతారు. సుమారు 24 రోజుల పాటు కొన్ని రాశుల వారికి దీర్ఘకాలంగా ఎన్నో పనులు సఫలమవుతాయి. సంపద పెరుగుతుంది. శుభకార్యాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. కుటుంబంలో శాంతి, సంతోషాలు నెలకొంటాయి. బుధుడి తిరోగమన కదలిక వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం.

సింహం: సింహ రాశి జాతకులకు రెట్రోగ్రేడ్ బుధుడు వల్ల బంపర్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఉద్యోగ-వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి. కొత్త ప్రాజెక్టులలో పనిచేసే అవకాశం లభిస్తుంది. వ్యాపారం విస్తరిస్తుంది. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. శారీరక సౌకర్యాలు పెరిగే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఎదురైన సవాళ్లను అధిగమిస్తారు. గృహ కలహాల నుంచి విముక్తి లభిస్తుంది. సమాజంలో మీకు ఎంతో గౌరవం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా ఇంక్రిమెంట్ అవకాశాలు పెరుగుతాయి. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు.

వృశ్చికం: బుధుడి తిరోగమన కదలిక వృశ్చిక రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది చాలా శుభ సమయం. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రశంసలు అందుకుంటారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు తొలగిపోతాయి. స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ వ్యాపార స్థానం బలంగా ఉంటుంది. మీ మాటల్లో మాధుర్యం ఉంటుంది.

మకరం: బుధుడి తిరోగమనం వల్ల మకర రాశి వారికి చాలా ప్రయోజనం కలుగుతుంది. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. డబ్బు ఆదా చేయడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. జీవిత భాగస్వామికి మద్దతు లభిస్తుంది. అకడమిక్ పనులలో అపారమైన విజయం సాధిస్తారు. విద్యార్థులకు ఇది చాలా శుభ సమయం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది.

(ఈ వ్యాసంలో ఇవ్వబడిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనదని మేము చెప్పడం లేదు. మరింత సమాచారం కోస సంబంధిత రంగ నిపుణుల సలహా తీసుకోవాలి)

WhatsApp channel