జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడుని సంపద, వైభవానికి అధిపతిగా భావిస్తారు. శుక్రుడు వృషభ రాశికి అధిపతి. శుక్రుడు కాలానుగుణంగా ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. ఈ సంచారం కారణంగా అనేక శుభ రాజయోగాలు ఏర్పడతాయి. దీంతో జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.
శుక్రుడు జూన్ 29న మేషరాశిని విడిచిపెట్టి సొంత రాశి అయినటువంటి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం కారణంగా 50 ఏళ్ల తర్వాత కేంద్ర త్రికోణ రాజయోగం, మాలవ్య రాజయోగం ఏర్పడతాయి. ఈ రాజ యోగాలు ఏర్పడడం వలన మూడు రాశుల వారి బ్యాంకు బాలన్స్ పెరగడంతో పాటుగా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.
శుక్రుడి రాశి మార్పుతో ఏర్పడిన కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడడం వలన ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు మీ ప్రణాళికలు ఫలిస్తాయి. సొంత వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి కూడా ఇది మంచి సమయం. ఇంట్లో శాంతి, సంతోషం కలుగుతాయి. మతపరమైన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కుటుంబంతో పర్యటనలకు కూడా వెళ్తారు.
కర్కాటక రాశి వారికి మాలవ్య యోగం అనేక లాభాలని అందిస్తుంది. ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. డబ్బుకి లోటు ఉండదు. కొత్త కారు కొనే అవకాశం కూడా ఉంది. వ్యాపారాలు కూడా మొదలుపెడతారు. మంచి లాభాలని పొందుతారు.
సింహ రాశి వారికి కేంద్ర త్రికోణ, మాలవ్య రాజ యోగాలు అదృష్టాన్ని తీసుకువస్తాయి. మీ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో సింహ రాశి వారు బాస్ నుంచి ప్రశంసలని పొందుతారు. అవార్డులు కూడా రావచ్చు. వ్యాపారాలకి ఎక్కువ లాభం వస్తుంది. కుటుంబ సభ్యులందరూ ఐకమత్యంగా కలిసి సంతోషంగా ఉంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.