50 ఏళ్ల తర్వాత మీనరాశిలో రెండు రాజయోగాలు.. ఈ 3 రాశులకు కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు!-after 50 years two rajayogas formed in meena rasi due to mercury and venus and these rasis wil get benefits ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  50 ఏళ్ల తర్వాత మీనరాశిలో రెండు రాజయోగాలు.. ఈ 3 రాశులకు కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు!

50 ఏళ్ల తర్వాత మీనరాశిలో రెండు రాజయోగాలు.. ఈ 3 రాశులకు కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు!

Peddinti Sravya HT Telugu

ప్రస్తుతం మీన రాశిలో రెండు రాజయోగాలు ఏర్పడ్డాయి. శుక్రుడు, బుధుడు మీన రాశిలో సంయోగం చెందడంతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడింది. దానితో పాటు మాలవ్య యోగం కూడా ఏర్పడింది. 50 సంవత్సరాల తర్వాత ఈ రెండు యోగాలు ఏర్పడ్డాయి. కొన్ని రాశులు దీని ద్వారా అదృష్ట ఫలితాలను పొందబోతున్నాయి.

50 ఏళ్ల తర్వాత మీనరాశిలో రెండు రాజయోగాలు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నవగ్రహాలు కొంత కాల వ్యవధిలో తమ రాశి, నక్షత్ర స్థానాలను మారుస్తాయి. ఇది మానవ జీవితంలో చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. నవగ్రహాలు కొన్నిసార్లు స్థానం మారేటప్పుడు ఒక గ్రహం మరొక గ్రహంతో కలిసే పరిస్థితి ఏర్పడుతుంది. అలా ప్రస్తుతం మీన రాశిలో రెండు రాజయోగాలు ఏర్పడ్డాయి.

శుక్రుడు, బుధుడు మీన రాశిలో సంయోగం చెందడంతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడింది. దానితో పాటు మాలవ్య యోగం కూడా ఏర్పడింది. 50 సంవత్సరాల తర్వాత ఈ రెండు యోగాలు ఏర్పడ్డాయి. ఈ రాజయోగం ప్రభావం అన్ని రాశులకు ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే కొన్ని రాశులు దీని ద్వారా అదృష్ట ఫలితాలను పొందబోతున్నాయి. అవి ఏయే రాశులో తెలుసుకుందాం.

ఈ 3 రాశుల వారికి డబుల్ యోగాలు

1.మీన రాశి

మీన రాశి మొదటి ఇంట్లో లక్ష్మీ నారాయణ యోగం, మాలవ్య యోగం ఏర్పడ్డాయి. దీని వల్ల మీకు ఆధిపత్యం పెరుగుతుందని చెబుతున్నారు. పని చేసే ప్రదేశంలో మీ పనితీరు బాగుంటుంది. అభివృద్ధికి కొత్త అవకాశాలు మీకు లభిస్తాయి. వివాహితుల జీవితంలో ఆనందం పెరుగుతుంది. వివాహం కాని వారికి త్వరలో వివాహం అవ్వచ్చు. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

2.ధనుస్సు రాశి

ధనస్సు రాశి నాలుగవ ఇంట్లో లక్ష్మీ నారాయణ యోగం, మాలవ్య యోగం ఏర్పడ్డాయి. దీని వల్ల మీ ఇంట్లో ఆనందం పెరుగుతుంది. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేయడానికి అవకాశాలు కలుగుతాయి. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి.

జీవితంలో సౌకర్యాలు కూడా పెరుగుతాయి. పనిచేసే ప్రదేశంలో ఉన్నతాధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. వ్యాపారంలో మీకు మంచి పురోగతి ఉంటుంది. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. తల్లిదండ్రుల నుండి పూర్తి మద్దతు ఉంటుంది.

3.వృషభ రాశి

మీ రాశిలో పదకొండవ ఇంట్లో లక్ష్మీ నారాయణ, మాలవ్య యోగాలు ఏర్పడ్డాయి. దీని వల్ల మీ ఆదాయంలో భారీ పెరుగుదల ఉంటుంది. వ్యాపారంలో గణనీయమైన పురోగతి ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అవకాశాలు ఉంటాయి.

కొత్త పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారంలో మంచి ఫలితాలు లభిస్తాయి. మానసికంగా మీకు ఆనందం పెరుగుతుంది. ఇతరుల నుండి గౌరవ, మర్యాదలు లభిస్తాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం