యాభై ఏళ్ళ తరవాత గురువు, బుధుల దశాంక యోగం.. ఈ మూడు రాశులకు జాక్ పాట్!-after 50 years dashanka yoga formed by jupiter and mercury and it is jackpot to gemini capricorn virgo ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  యాభై ఏళ్ళ తరవాత గురువు, బుధుల దశాంక యోగం.. ఈ మూడు రాశులకు జాక్ పాట్!

యాభై ఏళ్ళ తరవాత గురువు, బుధుల దశాంక యోగం.. ఈ మూడు రాశులకు జాక్ పాట్!

Peddinti Sravya HT Telugu

బుధుడు, గురువు 36 డిగ్రీల కోణంలో ఉండడంతో దశాంక యోగాన్ని సృష్టించింది. 50 ఏళ్ల తర్వాత ఈ యోగం ఏర్పడింది. గురువు, బుధ దశాంక యోగ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుంది. అయితే, కొన్ని రాశుల వారు దీని ద్వారా అదృష్ట ఫలితాలను పొందుతారు.

యాభై ఏళ్ళ తరవాత గురువు, బుధుల దశాంక యోగం

జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు తమ రాశులు, నక్షత్రాలను క్రమం తప్పకుండా సంచరిస్తాయి. అప్పుడు ఒక గ్రహం మరో గ్రహంతో కలిసే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యోగాల ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ విధంగా గురు, బుధుడు కలిసి దశాంక యోగాన్ని సృష్టిస్తారు.

వైదిక జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధుడు, గురువు 36 డిగ్రీల కోణంలో ఉండడంతో దశాంక యోగాన్ని సృష్టించింది. 50 ఏళ్ల తర్వాత ఈ యోగం ఏర్పడింది. గురువు, బుధ దశాంక యోగ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుంది. అయితే, కొన్ని రాశుల వారు దీని ద్వారా అదృష్ట ఫలితాలను పొందుతారు. మరి ఇందులో ఏయే రాశుల వారు ఉన్నారో ఓ లుక్కేయండి.

1.మకర రాశి

గురువు, బుధ దశాంగ యోగం మీకు ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది. వ్యాపారంలో మంచి పురోగతి సాధిస్తారని తెలుస్తోంది. మిమ్మల్ని వెతుక్కుంటూ కొత్త బాధ్యతలు వస్తాయని తెలుస్తోంది.

పనిచేసే చోట ఆదాయ మార్గాలు పెరగవచ్చు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అవివాహితులు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు. గొప్ప యోగంతో పురోభివృద్ధి సాధిస్తారని చెబుతారు. కోటేశ్వర యోగం ఆనందాన్ని పెంచుతుందని చెబుతారు. ఆరోగ్యంలో మంచి మెరుగుదల ఉంటుంది.

2.మిథున రాశి

మిథున రాశి వారికి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయని తెలుస్తోంది. ఆశించిన మంచి జీవితం లభిస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. గొప్ప యోగం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. పురోగతి ఉంటుంది. వ్యాపారంలో భారీగా లాభాలు వస్తాయి. వివాహం, ప్రేమ జీవితం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఆరోగ్యంలో మంచి మెరుగుదల ఉంటుంది.

3.కన్య రాశి

దశాంక యోగం మీకు శుభయోగాన్ని ఇస్తుందని తెలుస్తోంది. గురువు, బుధుడి కలయిక మీకు అదృష్టాన్ని తెస్తుంది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. కఠోర శ్రమ మంచి ఫలితాలను ఇస్తుంది. కోటీశ్వర యోగంతో మీరు సంతోషంగా ఉంటారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.