Maha shivaratri 2024: 300 ఏళ్ల తర్వాత శివరాత్రి రోజు అరుదైన యోగాలు.. శివుడిని పూజిస్తే రెట్టింపు పుణ్యఫలం-after 300 years maha shivaratri to bring very special and asupicious on shiva yogam sarvartha siddhi yogm ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Maha Shivaratri 2024: 300 ఏళ్ల తర్వాత శివరాత్రి రోజు అరుదైన యోగాలు.. శివుడిని పూజిస్తే రెట్టింపు పుణ్యఫలం

Maha shivaratri 2024: 300 ఏళ్ల తర్వాత శివరాత్రి రోజు అరుదైన యోగాలు.. శివుడిని పూజిస్తే రెట్టింపు పుణ్యఫలం

Gunti Soundarya HT Telugu
Feb 22, 2024 09:53 AM IST

Maha shivaratri 2024: ఈ ఏడాది మహా శివరాత్రి మార్చి 8వ తేదీన జరుపుకోనున్నారు. 2024 లో వచ్చే శివరాత్రి రోజు అరుదైన సంఘటనలు జరగబోతున్నాయి. ఫలితంగా శివరాత్రి ప్రాముఖ్యత, పూజా ఫలం రెట్టింపు కాబోతుంది.

మహా శివరాత్రికి అరుదైన యోగాలు
మహా శివరాత్రికి అరుదైన యోగాలు (pixabay)

Maha shivaratri 2024: మహా శివరాత్రి చాలా ముఖ్యమైన పండుగ. ఆరోజు శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడిపోతాయి. ఈ ఏడాది మహా శివరాత్రి మార్చి 8న జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే మహా శివరాత్రి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. అనేక శుభ యోగాలు మహా శివరాత్రి నాడు ఏర్పడి పండుగ విశిష్టతని రెట్టింపు చేశాయి.

yearly horoscope entry point

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం మహా శివరాత్రి రోజు శివ యోగంతో సర్వార్థ సిద్ది యోగం వంటి అరుదైన యోగం ఏర్పడబోతోంది. ఇది మాత్రమే కాదు మహా శివరాత్రి రోజు ప్రదోష వ్రతం కూడా ఉంది. శుక్రవారం రావడంతో శుక్ర ప్రదోష ఉపవాసం ముఖ్యమైనదిగా పరిణమించింది. ఈ సమయంలో ఎవరైనా ఉద్యోగం, వ్యాపారంలో పనులు చేపడితే వారికి విజయం, ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. సుమారు 300 సంవత్సరాల తర్వాత ఈ అరుదైన కలయిక జరగబోతుంది.

శివరాత్రి విశిష్టతను పెంచిన అరుదైన కలయికలు

మార్చి 8న కోరికలు తీర్చే సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడబోతుంది. ధ్యానం, మంత్రోచ్చారణకు ఉత్తమమైన శివ యోగం కూడా ఆరోజు వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మహా శివరాత్రి రోజు మొత్తం శివయోగం ఉంటుంది. ఉదయం 6.38 గంటల నుంచి 10.41 వరకు సర్వార్త సిద్ధి యోగం ఏర్పడుతుండగా సూర్యోదయం నుంచి 12.46 గంటల వరకు శివయోగం జరుగుతుంది.

ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్ధశి నాడు వచ్చే మహా శివరాత్రి సర్వార్థ సిద్ధి యోగంతో వచ్చే అత్యంత పవిత్రమైన రోజుగా మారబోతుంది. ఈరోజు శివారాధనకు సర్వార్థ సిద్ధి యోగంతో పాటు శివయోగం, శ్రవణ నక్షత్రాల అద్భుత కలయిక జరగబోతోంది. మార్చి 9వ తేదీతో సిద్ది యోగం సమయం ముగుస్తుంది. ఇన్ని అద్భుతమైన యోగాలు కలయిక కావడంతో శివరాత్రి రోజున శివారాధన చేసే పూజలకు రెట్టింపు ప్రతిఫలం దక్కనుంది.

శివయోగం

శివయోగం సమయంలో పూజించడం వల్ల వారికి శివుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.

సిద్ధ యోగం

విఘ్నాలు తొలగించే వినాయకుడికి ప్రతి ఒక్కరూ తొలి పూజ అందిస్తారు. సిద్ధ యోగం అనేది అడ్డంకులు తొలగించే వినాయకుడికి సంబంధించినది. ఈ యోగంలో వినాయకుడిని పూజిస్తే చేపట్టే ప్రతి పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం సొంతం అవుతుంది. ఈ ముహూర్తంలో ఏ పని తలపెట్టినా అది మీకు శ్రేయస్సు అందిస్తుంది.

శ్రవణ నక్షత్రం

శ్రవణ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు. ఈ నక్షత్రం వచ్చిన సమయంలో ఎటువంటి కార్యం తలపెట్టినా దానికి శని ఆశీస్సులు ఉంటాయి. శివుడికి భక్తుడు శనీశ్వరుడు. శివ అనుగ్రహంతో పాటు శని చల్లని చూపు మీమీద ఉంటుంది. అందుకే ఈరోజు పూజ చేయడంతో పాటు ఏదైనా కొత్త పనులు ప్రారంభించడం శుభప్రదంగా పరిగణిస్తారు.

శుక్ర ప్రదోషం, శివరాత్రి కలిసి

ఈ సారి మహా శివరాత్రి, శుక్ర ప్రదోష వ్రతం రెండూ ఒకే రోజు వస్తున్నాయి. ఆరోజు శివుడిని పూజించడం వల్ల రెట్టింపు ఫలితాలు దక్కుతాయి. ఉపవాసం ఉండి శివుడిని ఆరాధిస్తే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగం, వ్యాపారంలో కలిసి వస్తుంది. దివ్యమైన ఈరోజు పూజ చేయడం వల్ల కుటుంబంలో ఐశ్వర్యం కలుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

Whats_app_banner