300 ఏళ్ల తర్వాత గణేశ్ చతుర్థి రోజున ఇలా.. ఈ రాశులవారి జీవితంలో అద్భుతాలు
Ganesh Chaturthi : గణేశ చతుర్థి వచ్చింది. ఈసారి 300 సంవత్సరాల తర్వాత అద్భుతమైన యోగం ఏర్పడుతోంది. ఈ యోగం అన్నిరాశుల వారిని ప్రభావితం చేస్తుంది. అయితే కొన్ని రాశులవారికి మాత్రం అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.
గణేశ చతుర్థి భాద్రపద మాసంలో చౌతి రోజున జరుపుకోంటారు. ఈ సంవత్సరం చతుర్థి పండుగ సెప్టెంబర్ 18, 19 తేదీలలో జరుపుకొంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహ సంచారాల కారణంగా దాదాపు 300 ఏళ్ల తర్వాత గణేష్ చతుర్థి నాడు 3 శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ ఏడాది ఇదే ప్రత్యేకత. ఈ సంవత్సరం శుక్లయోగం, శుభ యోగం, బ్రహ్మయోగం ఏర్పడుతున్నాయి. దీంతో మూడు రాశులవారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఆ రాశులు ఏంటో చూద్దాం..
ట్రెండింగ్ వార్తలు
మేష రాశి
ఈ మూడు శుభ యోగాలు ఉన్నాయి కాబట్టి మేషరాశి వారిలో సంతానం కోసం ఎదురుచూసేవారికి సంతాన భాగ్యం కలుగుతుంది. మీరు ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతారు. సమాజంలో మీ గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి చాలా మంచి సమయం. మీ ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి. ఈ చతుర్థి తర్వాత మీరు ఆస్తి లేదా ఇల్లు కొనుగోలు చేయవచ్చు.
మిథున రాశి
ఈ మూడు శుభ యోగాల వల్ల మిథున రాశి వారికి అదృష్ట యోగాలు వచ్చాయి. ఈ కాలంలో మీ అదృష్టం పెరుగుతుంది. చతుర్థి తర్వాత మీకు ధనయోగం కలుగుతుంది. మీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కూడా పూర్తవుతుంది. మీ ప్రజాదరణ పెరుగుతుంది. ప్రజలు మిమ్మల్ని గౌరవించడం ప్రారంభిస్తారు. ఏ పని చేసినా విజయం సాధిస్తారు. మీ కుటుంబ జీవితం బాగుంటుంది.
మకర రాశి
మకర రాశి వారికి ఈ మూడు శుభ యోగాల వల్ల అదృష్ట మద్దతు లభిస్తుంది. మీ పనులన్నీ ప్రణాళిక ప్రకారం సాగుతాయి. మీరు డబ్బు సంపాదిస్తారు. ఉద్యోగి ప్రమోషన్ పొందుతారు. ఈ చతుర్థి తర్వాత మీరు ఆకస్మిక ఆర్థిక లాభం పొందుతారు.
ఇక ఈ సంవత్సరం వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకుంటే, సెప్టెంబర్ 19 ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు శుభ సమయం. కొంతమంది సెప్టెంబర్ 18న కూడా ప్రతిష్ఠించుకుంటున్నారు.
గణేశుడిని ఈ మంత్రాలతో జపించండి
ఓం గం గణపతయే నమః
ఓం శ్రీ గణేశాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం క్షిప్ర ప్రసాదాయ నమః
ఓం బాలచంద్రాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం విఘ్ననాశాయ నమః
ఓం విఘ్ననాశాయ నమః ఓంధర్వాయ నమః నమః ఓం విక్త్రాయ నమః
గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత 108 సార్లు ఈ మంత్రాలను జపించండి.