30 ఏళ్ళ తరువాత వచ్చే నెలలో శని, బుధుల సంసప్తక రాజయోగం, ఈ మూడు రాశులకు పట్టిందల్లా బంగారమే.. అదృష్టం, డబ్బుతో పాటు ఎన్నో-after 30 years saturn mercury forms samsaptaka raja yogam and it gives lots of benefits to cancer tarus and pisces ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  30 ఏళ్ళ తరువాత వచ్చే నెలలో శని, బుధుల సంసప్తక రాజయోగం, ఈ మూడు రాశులకు పట్టిందల్లా బంగారమే.. అదృష్టం, డబ్బుతో పాటు ఎన్నో

30 ఏళ్ళ తరువాత వచ్చే నెలలో శని, బుధుల సంసప్తక రాజయోగం, ఈ మూడు రాశులకు పట్టిందల్లా బంగారమే.. అదృష్టం, డబ్బుతో పాటు ఎన్నో

Peddinti Sravya HT Telugu

జూలై నెలలో శని తిరోగమనం చెందుతాడు. ఈ సమయంలో బుధ గ్రహంతో సంసప్తక రాజయోగాన్ని ఏర్పరుస్తాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇది చాలా ప్రభావితమైనది. ఈ రాజయోగం 30 ఏళ్ల తర్వాత ఏర్పడుతుంది. సంసప్తక రాజయోగంతో ఈ 3 రాశుల వారికి అనేక లాభాలు ఉంటాయి. మరి ఈ రాశుల్లో మీరు కూడా ఒకరేమో చూసుకోండి.

30 ఏళ్ళ తరువాత వచ్చే నెలలో శని, బుధుల సంసప్తక రాజయోగం (pinterest)

గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో మరో రాశితో కూడా సంయోగం చెందుతూ ఉంటాయి. గ్రహాల సంయోగం చెందినప్పుడు శుభ, అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక, వాటి పరస్పర కలయిక పెద్ద మార్పులను తీసుకువస్తుంది.

30 ఏళ్ల తర్వాత సంసప్తక రాజయోగం

జూలై నెలలో శని తిరోగమనం చెందుతాడు. ఈ సమయంలో బుధ గ్రహంతో సంసప్తక రాజయోగాన్ని ఏర్పరుస్తాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇది చాలా ప్రభావితమైనది. ఈ రాజయోగం 30 ఏళ్ల తర్వాత ఏర్పడుతుంది. ఈ యోగం అన్ని రాశి చక్రాలను ప్రభావితం చేస్తుంది. ఈ సమయాన్ని శుభప్రదంగా భావిస్తారు. అదృష్టాన్ని కూడా తీసుకువస్తుంది.

ఈ అరుగైన రాజయోగం ఆకస్మిక ధన లాభం, వృత్తిలో పురోగతి, వ్యాపారంలో లాభాలు వంటి శుభ ఫలితాలను తీసుకువస్తుంది. శని-బుధ గ్రహాల కలయిక జీవితంలో పురోగతికి సువర్ణవకాశం తీసుకువస్తుంది. మరి అదృష్ట రాశులు ఎవరు?, ఆ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

సంసప్తక రాజయోగంతో ఈ 3 రాశుల వారికి బోలెడు లాభాలు:

1.కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి ఈ యోగం శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగం లేదా వ్యాపారం చేసే వారికి ఈ సమయం కలిసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. తోటి ఉద్యోగస్తుల మద్దతు మీకు ఉంటుంది. ఎప్పటి నుంచో పూర్తికాని పనులు ఈ సమయంలో పూర్తవుతాయి.

2.వృషభ రాశి:

వృషభ రాశి వారికి సంసప్తక రాజయోగం అదృష్టం తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో రాని డబ్బు ఈ సమయంలో మీకు అందుతుంది. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది.

3.మీన రాశి:

మీన రాశి వారికి సంసప్తక రాజయోగం అనేక లాభాలు అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. వివాహితుల ప్రేమ జీవితం మధురంగా మారుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారులకు కూడా ఈ సమయం బాగుంటుంది. ఆర్థికపరంగా సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.