జ్యోతిష నిపుణులు చెప్తున్న దాని ప్రకారం, 30 ఏళ్ల తర్వాత నాలుగు పెద్ద మహా శని యోగాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ మహా శని యోగాల కారణంగా కొన్ని రాశుల వారికి సంతోషం కలుగుతుంది. ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మార్చి 29న శని మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. పైగా అదే రోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడనుంది. పైగా ఈరోజు నుంచే చైత్ర నవరాత్రులు కూడా మొదలు కాబోతున్నాయి. ఆ తరవాత రోజు కొత్త తెలుగు సంవత్సరము కూడా ప్రారంభం అవుతోంది. ఇలాంటి సందర్భంలో ఈ రాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
మేష రాశి వారు గొడవలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కెరీర్ లో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాహమైన వారికి ఇబ్బందులు కలగవచ్చు. ఆర్థిక నష్టం కూడా కలిగే అవకాశం ఉంది. ప్రయాణం చేసేటప్పుడు కూడా మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. వాహనాన్ని నడిపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది.
సింహ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అప్పులు బాధని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు ఉద్యోగంలో మార్పును చూడొచ్చు. ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. అప్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు కూడా ఆర్థిక నష్టాన్ని చూడాల్సి ఉంటుంది.
ఈ సమయంలో ధనస్సు రాశి వారి జీవితంలో పెద్ద మార్పు చోటు చేసుకోబోతోంది. శత్రువుల వలన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. తండ్రితో లేదా సోదరుడుతో గొడవలు జరిగే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు ఆఫీస్ లో గొడవలు. నిద్ర పోవాల్సి ఉంటుంది. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మీన రాశి వారికి కూడా ఈ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీ మాటలు కారణంగా మీరు గొడవలు పడే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు మిమ్మల్ని అవమానిస్తారు. ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు కూడా ఈ సమయంలో డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం