Planet combust: 24 ఏళ్ల తర్వాత ఒకేసారి అస్తంగత్వ దశలోకి వెళ్ళిన రెండు శుభ గ్రహాలు..-after 24 years jupiter and venus combust in the same time these zodiac sign face troubles ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Planet Combust: 24 ఏళ్ల తర్వాత ఒకేసారి అస్తంగత్వ దశలోకి వెళ్ళిన రెండు శుభ గ్రహాలు..

Planet combust: 24 ఏళ్ల తర్వాత ఒకేసారి అస్తంగత్వ దశలోకి వెళ్ళిన రెండు శుభ గ్రహాలు..

Gunti Soundarya HT Telugu

Planet combust: 24 ఏళ్ల తర్వాత రెండు శుభ గ్రహాలు ఒకేసారి అస్తంగత్వ దశలోకి వెళ్ళాయి. దీని వల్ల మూడు రాశుల వారికి అశుభ ఫలితాలు ఎదురవుతాయి. కెరీర్, వైవాహిక జీవితంలో ఎదురుదెబ్బలు తగులుతాయి.

ఒకేసారి రెండు గ్రహాలు అస్తంగత్వ దశలోకి (pinterest)

Planet combust: నవగ్రహాలలో అత్యంత శుభప్రదమైన గ్రహాలుగా బృహస్పతి, శుక్రుడిని పరిగణిస్తారు. రాక్షసులకు అధిపతి శుక్రుడు అయితే దేవతలకు గురువుగా బృహస్పతిని భావిస్తారు. ఇవి రెండు శత్రు సంబంధాన్ని కలిగి ఉంటాయి.

ఈ రెండు గ్రహాల స్థానాలు శుభకార్యాలపై ప్రభావం చూపుతాయి. ఇవి రెండు దహన స్థితిలో ఉన్నప్పుడు శుభకార్యాలు, ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుకూలమైన సమయం కాదు.

శుక్రుడు ఏప్రిల్ 28లోకి అస్తంగత్వ దశలోకి వెళ్ళాడు. జులై 11న తిరిగి ఉదయిస్తాడు. అటు మే 3 వ తేదీ నుంచి బృహస్పతి వృషభ రాశిలో అస్తమించాడు. మళ్ళీ జూన్ 3న ఉదయించనున్నాడు. 24 ఏళ్ల తర్వాత గురు, శుక్ర గ్రహాలు ఒకేసారి అస్తంగత్వ దశలోకి వెళ్ళాయి. ఈ రెండు పెద్ద గ్రహాలు వారి వారి స్థానాల్లో ఉన్నప్పుడు కొన్ని రాశిచక్ర గుర్తులు అననుకూల ఫలితాలను కలిగి ఉంటాయి. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని రాశులు ఇవే.

వృషభ రాశి

గురు, శుక్ర గ్రహాలు అస్తంగత్వ దశలో ఉన్నప్పుడు వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పనిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కెరీర్ కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చిన్న చిన్న పనులకు కూడా మీరు ఎక్కువగా కృషి చేయాల్సిన అవసరం వస్తుంది. ఈ సమయంలో మీ ఉన్నతాధికారులతో సంబంధాలు క్షీణిస్తాయి. సహొద్యోగులు మిమ్మలని వ్యతిరేకించే అవకాశం ఉంది. దీని ఫలితంగా ఒత్తిడికి గురవుతారు. వ్యాపారవేత్తలకు లాభాలు ఉన్నాయి. కానీ అందుకోసం చాలా ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ఖర్చులు గణనీయంగా అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో మీ కోరికలు, ఖర్చులను తీర్చడం మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు డబ్బును కూడా ఆదా చేయలేకపోవచ్చు. అనారోగ్యపరంగా కుటుంబ సభ్యులలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండే అవకాశం ఉంది. వైవాహిక జీవితానికి ఇది మంచి కాలం కాదు. మీ భాగస్వామి లేదా బాయ్ ఫ్రెండ్ తో భేదాభిప్రాయాలు రావచ్చు.

సింహ రాశి

శుక్రుడు సింహ రాశి తొమ్మిదో ఇంట్లో, బృహస్పతి పదో స్థానంలో అస్తమించారు. దీని ఫలితంగా కొన్ని సమస్యల వల్ల పిల్లలు ఎదుగుదలకు ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగం కోసం ప్రయాణించాల్సిన అవసరం వస్తుంది. కానీ మీ లక్ష్యాలను చేరుకోలేకపోతారు. అందుకోసం మరింత కృషి చేయాల్సి వస్తుంది. ఈ కాలంలో కార్మికులు తీవ్ర ఉద్యోగ అసంతృప్తిని అనుభవిస్తారు. పదేపదే ఉద్యోగం మార్పునకు అవకాశం ఉంటుంది. వ్యాపారవేత్తలకు ఇది చెడు సమయం. తమ రంగాలలో తక్కువ లాభాలతో సంతృప్తి చెందాల్సి వస్తుంది. ఆర్థిక నష్టం ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. భాగస్వామితో ఎటువంటి వాదనలు చేయకూడదు. వివాహంలో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి ఆరో ఇంట్లో శుక్రుడు, ఏడో ఇంట్లో బృహస్పతి అస్తమించారు. అందువల్ల ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పనిలో విజయం సాధించలేరు. కెరీర్‌లో విజయం సాధించడానికి మీకు ఇంకా చాలా ఎక్కువ అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఇది సవాలుతో కూడిన సమయం. భాగస్వామ్య వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో తగాదాలు అయ్యే అవకాశం ఉంది.