కుజుడి పరిణామం పెద్దది. ఎర్రటి నిప్పులా మండుతాడు. కేతువుని ఛాయా గ్రహంగా భావిస్తారు. మిగిలిన గ్రహాల్లానే ఈ గ్రహాలు కూడా శక్తివంతమైనవి. ఎప్పటికప్పుడు రాశులను మారుస్తూ ఉంటాయి. రెండు గ్రహాల కలయిక ఇప్పుడు ఏర్పడనుంది. జూన్ 7న కుజుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. కేతువు సింహరాశిలోనే ఉన్నాడు. ఈ రెండిటి కలయిక వలన 12 రాశులపై ప్రభావం పడుతుంది.
కానీ కొన్ని రాశుల వారికి మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుంది. కుజుడు - కేతువు కలయిక వలన ఏ రాశుల వారికి కలిసి వస్తుంది?, ఏ రాశుల వారు ఎటువంటి ప్రయోజనాలను పొందుతారు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మరి ప్రయోజనం పొందే రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి.
వృషభ రాశి వారికి కుజుడు, కేతువు కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. జూన్ 7 తర్వాత ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. రెండు చేతుల డబ్బులు వస్తాయి. పాత పెట్టుబడుల ద్వారా ఒక్కసారిగా ఎక్కువ లాభాన్ని పొందుతారు.
ఒక్కరే ప్రాజెక్ట్‌ని మొదలుపెట్టిన, భాగస్వామ్య ప్రాజెక్ట్‌ని మొదలుపెట్టినా కలిసి వస్తుంది. ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు కొంచెం ఒత్తిడిగా అనిపించొచ్చు, కానీ చివరికి మంచి ఫలితాన్ని పొందుతారు. ఏదైనా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూడా హాజరవుతారు.
వృశ్చిక రాశి వారికి ఈ కలయిక వలన శుభ ఫలితాలు అందుతాయి. కెరియర్‌లో కూడా మీకు బాగా కలిసి వస్తుంది. కుజ కేతు యోగం మీకు అదృష్టాన్ని తీసుకొస్తుంది. మీ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. జీతాలు పెరగవచ్చు. అదృష్టం కూడా మీకు ఉంటుంది. ప్రేమ జీవితం కూడా మధురంగా ఉంటుంది.
మిథున రాశి వారికి కుజ కేతు సంయోగం వలన అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో కూడా ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారులకు కూడా కలిసి వస్తుంది. ఈ శక్తివంతమైన కలయిక వలన ఈ రాశి వారికి గౌరవం కూడా పెరుగుతుంది.
పని ప్రదేశంలో పెద్ద బాధ్యతలను తీసుకుంటారు. పై అధికారులు మీకు పూర్తి మద్దతు ఇస్తారు. జూన్ 7 తర్వాత కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లడానికి కూడా ప్లాన్ చేస్తారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.