గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సంవత్సరం దీపావళి నాడు ఒక ప్రత్యేకమైన యోగం ఏర్పడబోతోంది. ఇది వంద సంవత్సరాల తర్వాత ఏర్పడడం విశేషం. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. సుమారు 100 సంవత్సరాల తర్వాత ఏర్పడే ఈ యోగం ఈ రాశుల వారి జీవితాన్నే మార్చబోతోంది.
గురువు తన సొంత రాశి అయినటువంటి కర్కాటకంలో తిరోగమనం చెందుతున్నాడు. ఇలా గురువు తిరోగమనం చెందడంతో హంస మహాపురుష రాజయోగం ఏర్పడనుంది. అక్టోబర్ 20న దీపావళి నాడు ఈ యోగం ఏర్పడడం చాలా విశేషం. పైగా ఈ యోగం అరుదైనది. గురువు కర్కాటకంలో సంచరించడం కొన్ని రాశుల వారి జీవితాన్ని మార్చేస్తుంది.
ఈ రాశుల వారి జీవితంలో శుభ ఫలితాలు ఎదురవుతాయి, సుఖ సంతోషాలు కలుగుతాయి. గురువు తిరోగమనంలో కర్కాటకంలోకి ప్రవేశించడం ఇంకా ప్రయోజనకరంగా ఉండబోతోంది. ఇది ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపించినా, కొన్ని రాశుల వారు మాత్రం అనేక విధాలుగా లాభాలను పొందుతారు. డబ్బుకి కూడా లోటు ఉండదు, వృత్తిలో పురోగతి చూస్తారు, విజయాలను అందుకుంటారు.
కర్కాటక రాశి వారికి హంస మహాపురుష రాజయోగం శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఎప్పటి నుంచో చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పుడు ఫలితం రాబోతోంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యాపారులకు కూడా కలిసి వస్తుంది, కొత్త ఒప్పందాలను పొందుతారు. వివాహం కాని వారికి ఇది మంచి సమయం.
వృశ్చిక రాశి వారికి హంస మహాపురుష యోగం అనేక విధాలుగా కలిసి రాబోతోంది. అదృష్టం పెరుగుతుంది, ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేసే వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటి దాకా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. వృత్తిలో కొత్త అవకాశాలను చూస్తారు. పోటీ పరీక్షల్లో విజయాలను అందుకుంటారు. కుటుంబ జీవితం కూడా బాగుంటుంది.
తులా రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. విజయాలను అందుకుంటారు, కొత్త బాధ్యతలను పూర్తి చేస్తారు. సమాజంలో పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారులకి కూడా ఇది మంచి సమయం. ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉంటాయి. ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి. పెళ్లి కాని వారు సానుకూల మార్పులను చూస్తారు.