మీరు ఈ పనులు చేస్తుంటే వెంటనే మానుకోండి లేదంటే అదృష్టం వెనక్కి వెళ్ళిపోతుంది-according to vastu these things create obstacles in luck money does not last ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మీరు ఈ పనులు చేస్తుంటే వెంటనే మానుకోండి లేదంటే అదృష్టం వెనక్కి వెళ్ళిపోతుంది

మీరు ఈ పనులు చేస్తుంటే వెంటనే మానుకోండి లేదంటే అదృష్టం వెనక్కి వెళ్ళిపోతుంది

Gunti Soundarya HT Telugu
Nov 02, 2024 07:16 PM IST

మనకున్న కొన్ని చిన్న చిన్న అలవాట్లు అదృష్టాన్ని దూరం చేస్తాయి. వాస్తు ప్రకారం ఆ అలవాట్లు సంపద రాకుండా ఆగిపోతుంది. మీకు ఈ పనులు చేసే అలవాటు ఉంటే వెంటనే వాటిని వదులుకోండి.

అదృష్టాన్ని దూరం చేసే అలవాట్లు ఇవే
అదృష్టాన్ని దూరం చేసే అలవాట్లు ఇవే

ప్రతి వ్యక్తి జీవితంలో వాస్తుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వాస్తు దోషాల కారణంగా ప్రజలు అదృష్టం పొందలేరు. సంపదను కూడబెట్టుకోవడం కష్టం అవుతుంది. రోజువారీ జీవితంలో వాస్తుకు సంబంధించిన కొన్ని విషయాలపై శ్రద్ధ వహిస్తే అన్ని సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. 

వాస్తులో పేర్కొన్న కొన్ని నియమాలను అనుసరించడం వల్ల జీవితంలో సానుకూలత వస్తుంది, ప్రతికూలత తొలగిపోతుంది. చాలా సార్లు వాస్తు దోషాల వల్ల జీవితంలో ఆర్థిక, శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బు నష్టపోయే పరిస్థితి తలెత్తుతుంది. మనకి తెలియకుండా చేసే పనులే వాటికి కారణాలు కావచ్చు. వాస్తు దోషాల వల్ల అదృష్టంలో కూడా అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదృష్టానికి ఆటంకం కలిగించే కొన్ని పనులు ఇవి. మీరు కూడా ఈ పనులు చేస్తున్నారా? అయితే వెంటనే ఈ అలవాట్లు మార్చుకోండి. లేదంటే అదృష్టం మీ దగ్గరకు కూడా రాదు. 

చాలా మందికి ఉండే అలవాటు ఇది. మంచం పక్కన లేదంటే దిండు కింద డబ్బులు ఉన్న పర్సు పెట్టుకుని పడుకుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం దిండు దగ్గర పర్సు పెట్టుకుని పడుకోకూడదు. అలాంటి పరిస్థితుల్లో సంపద నిలవదు.

నిద్రపోయే ముందు పుస్తకాలు చదివే అలవాటు చాలా మందికి ఉంటుంది. అలా చదువుతూ నిద్రలోకి జారుకుంటారు. అప్పుడు వాటిని దిండు కింద పెట్టేసుకుంటారు. దిండు కింద వార్తాపత్రిక, పుస్తకం లేదా ఫోటోగ్రాఫ్ పెట్టుకుని పడుకోవడం వల్ల ప్రతికూల శక్తి ప్రభావం పెరుగుతుంది. 

మనలో చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది. నిద్రలో మంచినీళ్లు అవుతాయోమోనని వాటర్ బాటిల్ పక్కనే పెట్టుకుని పడుకుంటారు. రాత్రిపూట మీ దిండు దగ్గర వాటర్ బాటిల్ ఉంచుకోవడం మీ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు వాచ్, మొబైల్, ఐప్యాడ్ మొదలైనవాటిని పడక దగ్గర ఉంచుకోవద్దు. ఇవన్నీ ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మీ టాయిలెట్ శుభ్రంగా లేకుంటే మీ డబ్బు వృధా ఆగదని అర్థం చేసుకోండి.

వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు పూజ గది ఎప్పుడూ ఉండకూడదు. ఇది సరైనది కాదు. దీని వల్ల బాధలు పడే అవకాశం ఉంది. ఇంట్లో ఎండిపోయిన లేదా ముళ్ల మొక్కలను నాటవద్దు. ఇది ప్రతికూలతను పెంచుతుంది. ఇంటి మెయిన్ గేటును ఎప్పుడూ బయట తెరవకండి. లోపలికి తెరిస్తే శుభం. ఇంటి లోపల ముఖ్యంగా కిచెన్ లో డస్ట్‌బిన్‌ను ఉంచవద్దు. ఇది జీవితంలో, ఇంట్లో ఇబ్బందులను పెంచుతుంది.

భారీ ఫర్నిచర్, షూ స్టాండ్ లేదా చెప్పులు ఈశాన్య దిశలో ఉంచకూడదు. దీంట్లో ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. అలాగే డస్ట్ బిన్ దగ్గర తులసి, మనీ ప్లాంట్ వంటి మొక్కలు ఉంచకూడదు. లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.

Whats_app_banner