వాస్తు ప్రకారం పాటించడం వల్ల సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు నియమాలు అనుసరించడం వల్ల జీవితంలోని ఇబ్బందుల నుంచి బయటపడడానికి సహాయపడుతుంది. చాలా మంది వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు.
సానుకూల శక్తి, ప్రతికూల శక్తి మన జీవితం మీద నేరుగా ప్రభావం చూపిస్తాయి. ఆరోగ్యం, బంధాలు, ఆర్థిక పరిస్థితులు కూడా దీనివల్ల ప్రభావితమవుతాయి. అందువల్ల వాస్తు నియమాలను పాటించడం చాలా మంచిదని చెబుతారు.
ఈరోజు డైనింగ్ టేబుల్ విషయంలో ఏ నియమాలు పాటించాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాలపై ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు, అవి నివారించాలి.
తిన్న తర్వాత మురికిపాత్రలను డైనింగ్ టేబుల్‌పై ఉంచడం చాలా చెడ్డ అలవాటు. ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. కుటుంబంలో అనారోగ్యం, మానసిక ఒత్తిడి, అనేక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. ఎప్పటికప్పుడు టేబుల్‌ను శుభ్రపరచడం చాలా ముఖ్యం.
క్రిస్టల్ బాల్స్, డెకరేటివ్ షోపీసులు, కొవ్వొత్తులు వంటివి విరిగిపోతే వెంటనే తొలగించాలి. ఇవి ప్రతికూల శక్తిని తీసుకువస్తాయి, పేదరికాన్ని కూడా కలిగించవచ్చు.
డైనింగ్ టేబుల్‌పై ముళ్లతో ఉన్న మొక్కలు ఉంచకూడదు. వాస్తు ప్రకారం, ఇవి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగాన్ని దెబ్బతీస్తాయి. ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తాయి.
పాడైపోయిన ఆహారం, కుళ్లిన పండ్లు ఉంచడం వల్ల ఆర్థిక నష్టం కలగవచ్చు. టేబుల్ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. పాడైనవి వెంటనే తొలగించాలి.
తాజా పండ్లను బౌల్‌లో ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. ధనం, ఆరోగ్యం మెరుగవుతాయి.
తులసి మొక్క, మనీ ప్లాంట్ సానుకూల శక్తిని చుట్టూ వ్యాపింపజేస్తాయి. శుభ ఫలితాలను ఇస్తాయి. కనుక వీటిని డైనింగ్ టేబుల్ పై ఉంచండి.
ఒక చిన్న బౌల్‌లో సాల్ట్ ఉంచడం వల్ల ప్రతికూల శక్తి తొలగి, సానుకూల శక్తి కలుగుతుంది.
డైనింగ్ టేబుల్ వద్ద ప్రకాశవంతమైన, అందమైన లైట్స్ ఉంటే, అది చూడటానికి బాగుండటమే కాకుండా సానుకూల శక్తిని కూడా ప్రసరిస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.