జాతకం అనేది ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించినది. కానీ ఒక ఇంటి వాస్తు ఆ ఇంట్లో నివసించే ప్రతి ఒక్కరికీ సంబంధించినది. కాబట్టి వాస్తు విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
ఇంట్లో మెట్లు తూర్పు-ఆగ్నేయ దిశలో ఉంటే మంచిది. ఇది కుటుంబంలో మంచి సమన్వయానికి దారితీస్తుంది.
ఎల్ అక్షరం ఆకారంలో టెర్రస్ కు దారితీసే మెట్లను నిర్మించడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఈ ఇంట్లో నివసించే ప్రజలకు సహాయపడుతుంది. ప్రారంభించిన పనులు త్వరితగతిన పూర్తవుతాయి. ఇది వారు సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి దోహదపడుతుంది.
అదే విధంగా టెర్రస్ కు వెళ్లే మెట్లను వృత్తాకార పద్ధతిలో నిర్మించవచ్చు. కుటుంబ పనులు మందకొడిగా సాగినా విజయం సాధిస్తారు. కుటుంబ పెద్దల నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు. దీనివల్ల కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. అవసరమైతే దక్షిణం వైపు మెట్లు నిర్మించుకోవచ్చు. దీనివల్ల కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైనా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
మెట్లు ఎక్కే ప్రదేశంలో పూల మొక్కలను నాటాలి. కుదరకపోతే పూల కుండీలు పెట్టాలి. దీని వల్ల మరిన్ని మంచి ఫలితాలను పొందవచ్చు. ఇంటి లోపల ఉంటే మెట్ల అడుగున వంటగది నిర్మించకూడదు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.